పాక్‌ బౌలర్‌ను ‘అవమానించిన’ న్యూజిలాండ్‌ స్టార్‌? | PSL New Drama: NZ Star Walks Away Objects To Usman Tariq Action | Sakshi
Sakshi News home page

PSL: పాక్‌ బౌలర్‌కు ‘అవమానం’.. డారిల్‌ మిచెల్‌ చర్య వైరల్‌

Apr 11 2026 11:57 AM | Updated on Apr 11 2026 12:39 PM

PSL New Drama: NZ Star Walks Away Objects To Usman Tariq Action

పాకిస్తాన్‌ స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ బౌలింగ్‌ యాక్షన్‌ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అతడి బౌలింగ్‌ శైలిపై న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ మైదానంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో అంపైర్‌ రంగంలోకి పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది.

121 పరుగులకే ఆలౌట్‌
పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)-2026 టోర్నీలో డారిల్‌ మిచెల్‌ రావల్పిండిజ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఉస్మాన్‌ తారిఖ్‌ క్వెటా గ్లాడియేటర్స్‌ తరఫున ఆడుతున్నాడు. కరాచీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన రావల్పిండిజ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. గ్లాడియేటర్స్‌ బ్యాటింగ్‌కు దిగింది.

నిర్ణీత 20 ఓవర్లలో గ్లాడియేటర్స్‌​ జట్టు 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన రావల్పిండిజ్‌ 17.3 ఓవర్లలో కేవలం 121 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. తద్వారా 61 పరుగుల భారీ తేడాతో గ్లాడియేటర్స్‌ చేతిలో ఓటమిపాలైంది.

పాక్‌ బౌలర్‌కు ‘అవమానం’!
ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రావల్పిండిజ్‌ స్టార్‌ డారిల్‌ మిచెల్‌.. గ్లాడియేటర్స్‌ బౌలర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ బౌలింగ్‌లో తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. అతడు వేసిన తొలి బంతిని ప్యాడిల్‌ స్వీప్‌ షాట్‌ ఆడిన డారిల్‌.. తర్వాత ఉస్మాన్‌ పాజ్‌ ఇస్తూ తనదైన శైలిలో బౌలింగ్‌ చేయగా.. వికెట్ల నుంచి దూరంగా వెళ్లిపోయాడు.

తాను సిద్ధంగా లేనని సైగ చేస్తూ రెండుసార్లు ఇలాగే చేశాడు. దీంతో అంపైర్‌ వచ్చి ఆటను కొనసాగించాలని చెప్పగా..డారిల్‌ అన్యమస్కంగానే అందుకు అంగీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో డారిల్‌ చర్య పాక్‌ బౌలర్‌కు అవమానం లాంటిదేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో డారిల్‌ మిచెల్‌ 32 బంతుల్లో 30 పరుగులు చేసి సౌద్‌ షకీల్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

అప్పట్లో అశూ మద్దతు
కాగా ఉస్మాన్‌ తారిఖ్‌ క్రీజు వద్ద కాస్త ఆగి బంతిని రిలీజ్‌ చేస్తాడన్న సంగతి తెలిసిందే. దీంతో అతడు బౌలింగ్‌ చేయకుండా బంతిని విసురుతాడనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఐసీసీ మాత్రం అతడిపై శైలిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ విషయంలో ఉస్మాన్‌కు అండగా నిలిచాడు.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ ఆటకు విరాట్‌ కోహ్లి ఫిదా... ఏమన్నాడంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement