breaking news
Tipper accident
-
'టిప్పర్ టెర్రర్'
ఉద్యోగానికి వెళ్లేవారు కొందరు.. కాలేజీకి వెళ్లేవారు మరికొందరు.. ఆస్పత్రికి వెళ్లేవారు ఇంకొందరు.. ఎవరి పనికోసం వారు బస్సెక్కారు.. తెల్లవారుజామున వారితోపాటు వారి ఆశలు, అవసరాలను కూడా మోసుకొని బయలుదేరిన ఆర్టీసీ బస్సు.. హైదరాబాద్ వైపు దూసుకుపోతోంది. తెలతెలవారుతుండగా టిప్పర్ రూపంలో మృత్యువు వాయువేగంతో ఎదురుగా దూసుకొచ్చింది. కంకర ఓవర్‌లోడుతో ఉన్న భారీ టిప్పర్ బస్సును బలంగా ఢీకొట్టడటంతోపాటు ఆ బస్సుపైనే ఒరిగిపోయింది. టిప్పర్‌లో ఉన్న 60 టన్నుల కంకర మొత్తం ఒక్కసారిగా బస్సుపై పడిపోయింది. దీంతో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే 19 మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కంకర కింద నలిగిపోతూ కొందరు ప్రయాణికులు చేసిన ఆర్తనాదాలతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం భీతావహంగా మారిపోయింది. సోమవారం ఉదయం 6.40 గంటల ప్రాంతంలో రంగారెడ్డి చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్– తాండూర్ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదం బాధితుల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. అత్యంత భీతావహంగా ఉన్న ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. మృతుల్లో నెలల పసికందు కూడా ఉండటం, తల్లి తన బిడ్డను కాపాడేందుకు పొత్తిళ్లలో పొదువుకొని అలాగే ప్రాణాలు విడువటం అందరి హృదయాలను కలచివేసింది.హృదయ విదారక దృశ్యాలు..⇒ ప్రమాదానికి గురైన బస్సు సోమవారం తెల్లవారుజామున 4.59 గంటలకు తాండూరు బస్‌స్టాండు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. 72 మందితో కిక్కిరిన బస్సు ఉదయం 6.40 గంటలకు చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ టిప్పర్ పటాన్చెరు లక్డారం నుంచి కంకర లోడ్‌తో వికారాబాద్ దగ్గర్లోని చిట్టెంపల్లికి వెళ్తోంది. రోడ్డుపై ముందు ఉన్న గుంతను తప్పించబోయిన టిప్పర్ డ్రైవర్.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. టిప్పర్ ఢీకొన్న వేగానికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. కంకర కింద పడి ప్రయాణికులు సజీవ సమాధి అయ్యారు. బస్సు సీట్ల కింద ఇరుక్కుపోయిన మరికొందరు ప్రయాణికులు కంకర కింద చిక్కుకుపోయారు. తాండూరు బస్టాండ్ నుంచి బయలుదేరుతున్న బస్సు క్షతగాత్రుల హాహాకారాలతో ఆ పరిసరాలు భీతావహంగా మారాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కంకర కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీశారు. వారిలో కొందరు అప్పటికే మృతి చెందగా.. కొన ఊపిరితో ఉన్న కొందరిని బతికించేందుకు సీపీఆర్ సహా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్లు ఇద్దరూ మరణించారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి, పీఎంఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు కండక్టర్ రాధ ఇచ్చిన ఫిర్యాదుతో (క్రైమ్ నెం. 723/2025యు/ఎస్ 106(1)బీఎన్ఎస్ చట్టం కింద) చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా ధ్వంసమైన బస్సు మృతులు వీరే.. ⇒ బోరబండ కార్మికనగర్‌కు చెందిన కల్పన (42), గున్నమ్మ (60), వికారాబాద్ జిల్లా దన్నారం తండాకు చెందిన హౌస్‌కీపింగ్ వర్కర్ తారీబాయి (44), యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన విద్యార్థిని గుర్రాల అఖిల (23), కర్ణాటక రాష్ట్రం గుల్బార్గాకు చెందిన బచ్చన్ నాగమణి (54), దౌల్తాబాద్ మండలం నీటూరుకు చెందిన రైతు మగళ్ల హన్మంతు (44), తాండూరు ఇంద్రానగర్ కాలనీకి చెందిన ఎండీ ఖాలీద్ (43), తాండూరు బృందావన్‌కాలనీకి చెందిన గృహిణి తబస్సుమ్ జాన్ (38), యాలాల మండలం పెర్కంపల్లికి చెందిన విద్యార్థులు ఈడిగ నందిని (22), సాయిప్రియ (18), తనూష (20), బషీరాబాద్ మండలం మంతాటికి చెందిన బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, తాండూరులోని వాల్మీకినగర్‌కు చెందిన కిష్టాపూర్ వెంకటమ్మ (21), యాలాల్ మండలం హాజీపూర్‌కు చెందిన లక్ష్మీ(40), కె.బందెప్ప (42), తాండూరు ఇంద్రానగర్‌కు చెందిన సెలా (20), తాండూరుకు చెందిన జహీరా ఫాతిమా (40 రోజుల బేబీ), తాండూరు గౌత్పూర్కు చెందిన విద్యార్థిని ముస్కన్ బేగం (21), టిప్పర్ డ్రైవర్ ఆకాష్కాంబ్లే (24).ప్రమాదానికి కారణాలివి.. రోడ్డుపై గుంతలు.. చేవెళ్ల నుంచి తాండూరు వెళ్లే రోడ్డు గుంతలమయంగా ఉండడంతోపాటు ఎన్నో ప్రమాదకర మలుపులు ఉన్నాయి. తాండూరు వైపు వేగంగా వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లే రోడ్డుపై గుంతను గమనించి వాహనాన్ని అంతే వేగంతో కుడివైపుకు తిప్పాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టాడు. దీంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్..టిప్పర్‌లో కంకర తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని తెలిసింది. ప్రమాద సమయంలో టిప్పర్‌లో మొత్తం 60 టన్నులకు పైగా కంకర ఉందని సమాచారం. ఓవర్ లోడ్‌తో ఉన్న టిప్పర్ బలంగా ఢీకొట్టడం ప్రమాద తీవ్రత పెరిగిందని ఘటనా స్థలాన్ని పరిశీలించిన సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ‘సాక్షి’కి తెలిపారు. ఆర్టీసీ బస్సు సైతం ఓవర్ కెపాసిటీతోనే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. టిప్పర్ బస్సును ఢీకొట్టిన తర్వాత దాదాపు 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది.టార్పాలిన్ కప్పి ఉంటే.. కొంత ముప్పు తప్పేది కంకర లోడ్‌తో వెళ్లే వాహనాలు విధిగా టార్పాలిన్ పట్టాను కంకరపై కప్పాలి. కంకర, ఇసుక, ఇతర సామగ్రితో వెళ్లే వాహనాల కారణంగా దుమ్ము ఇతర వాహనదారులను ఇబ్బంది పెట్టకుండా, అందులోని మెటీరియల్ బయటికి రాకుండా ఈ జాగ్రత్త తీసుకోవాలి. కానీ, ప్రమాదానికి కారణమైన టిప్పర్‌లో కంకరపై టార్పాలిన్ పట్టా కట్టకపోవడంతో ప్రమాదం జరిగిన తర్వాత అందులోని కంకర అంతా ప్రయాణికులపై ఒక్కసారిగా పడింది. దీంతో వారు దానికి కింద చిక్కుకుపోయారు.ఊపిరాడనివ్వని దుమ్ము టిప్పర్ ఢీకొట్టగానే డ్రైవర్ సహా..అదే వైపు సీట్లలో ఉన్న ప్రయాణికులు చెల్లాచెదురుగా పడ్డారు. కొందరు సీట్ల కింద చిక్కుకుపోయారు. ఏం జరుగుతుందో గ్రహించే లోపే టిప్పర్లోని కంకర వారిని కప్పేసింది. ఓవైపు కంకర బరువుకు బయటికి రాలేక కొట్టుకుంటున్న వారికి కంకరలోని దుమ్ము ఊపిరాడనివ్వలేదు. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. ఆర్టీసీ బస్సును ఢీకొని దానిపై పూర్తిగా ఒరిగిపోయిన కంకర లోడుతో ఉన్న టిప్పర్ సీట్ల కెపాసిటీకి మించి ప్రయాణికులుతాండూరు నుంచి హైదరాబాద్‌కు సోమవారం ఉదయం సమయంలో మూడు బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రయాణికులు అందుబాటులో ఉన్న బస్సులో సీట్లు నిండిపోయినా త్వరగా వెళ్లాలన్న తొందరలో ప్రమాదానికి గురైన బస్సు ఎక్కినట్టు తెలుస్తోంది. వాస్తవానికి బస్సులో సీట్ల కెపాసిటీ 51 ఉండగా.. 72 మంది ప్రయాణికులు బస్సెక్కారు. కిక్కిరిసిన బస్సులో నుంచి తప్పించుకోవడం కష్టమైందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి ముందు మారిన డ్రైవర్లచ్చానాయక్ తన భార్య ఉదిత్య అనిత పేరిట ఉన్న టిప్పర్‌లో కంకర సరఫరా చేస్తుంటాడు. ఓనర్ కమ్ డ్రైవర్‌గా పనిచేసే లచ్చానాయక్ తనతోపాటు మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ కాంబ్లేను డ్రైవర్‌గా నియమించుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున కంకర లోడ్ వేసుకుని కాంబ్లేతోపాటు బయలు దేరిన లచ్చానాయక్..తొలుత చేవెళ్ల వరకు టిప్పర్ నడిపాడు. చేవెళ్లలో ఆకాశ్ కాంబ్లేకు టిప్పర్‌ను నడిపేందుకు ఇచ్చాడు. ప్రమాద స్థలికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో స్టీరింగ్ అందుకున్న కాంబ్లే టిప్పర్‌ను మృత్యుశకటంగా మార్చాడు. ప్రమాద సమయంలో టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లే మద్యం సేవించి ఉన్నాడా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ తప్పులేదు: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఎదురుగా ఓవర్ స్పీడ్‌తో టిప్పర్ రావడాన్ని గమనించి డ్రైవర్ బస్సు వేగాన్ని తగ్గిచడంతోపాటు సైడ్‌కు తప్పించే ప్రయత్నం చేసినట్టు కండక్టర్ ద్వారా తెలిసింది. బస్సు డ్రైవర్ సురక్షితంగా డ్రైవ్ చేస్తున్నప్పటికీ టిప్పర్ అదుపు తప్పి వేగంగా రావడంతో ప్రమాదాన్ని తప్పించలేకపోయారని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. బస్సు డ్రైవర్ దస్తగిరి ఎంతో కాలంగా పనిచేస్తున్నారని, గతంలో ఎలాంటి ప్రమాదాలు చేసిన దాఖలాలు లేవని చెప్పారు. తాండూరు నుంచి హైదరాబాద్‌కు చాలా బస్సులు ఉన్నా.. ప్రయాణికులు త్వర గా వెళ్లాలన్న తొందరలోనే ఎక్కువ మంది బస్సు ఎక్కినట్టు పేర్కొన్నారు. కారణాలు ఇప్పుడే నిర్ధారించలేం ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించాం. అయితే, ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై ఇప్పుడు కచ్చితమైన కారణాలు చెప్పలేం. దర్యాప్తు కొనసాగుతోంది. టిప్పర్ వేగంగా, ఓవర్ లోడ్‌తో వచ్చి బస్సును ఢీకొట్టినట్టుగా క్రైం సీన్ చూస్తే తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాం. – అవినాశ్ మహంతి, సీపీ, సైబరాబాద్ రెండు వాహనాలపై చలాన్లు ప్రమాదానికి కారణమైన టిప్పర్ ఈ ఏడాది జనవరి 9న జహీరాబాద్ ఆర్టీఏ కార్యాలయం పరిధిలో రిజిస్టర్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్నెస్ 2027 వరకు ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గురైన టిప్పర్‌తోపాటు బస్సుపై కూడా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. బస్సుపై నాంపల్లి, అబిడ్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో రూ.2,305 చలాన్లు జారీ చేశారు. సిగల్న్ జంప్, స్టాప్‌లైన్ క్రాసింగ్ ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఈ చలాన్లు జారీ అయ్యాయి. టిప్పర్‌పై హైదరాబాద్‌లోని రామచంద్రాపురం, మియాపూర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు రూ.3,600 చలాన్లు విధించారు. టిప్పర్ ఓనర్‌కు తీవ్ర గాయాలు అనంతగిరి: ప్రమాద సమయంలో టిప్పర్ ఓనర్ లక్ష్మణ్‌నాయక్ తన వాహనంలోనే ఉన్నారు. డ్రైవర్ వాహనం నడుపుతుంగా పక్క సీట్లో కూర్చున్నారు. ప్రమాదంలో లక్ష్మణ్ కుడి కన్నుకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఉస్మానియా నుంచి వైద్యబృందం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు ఉస్మానియా ఆస్పత్రి నుంచి పది మంది ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని, సహాయక సిబ్బందిని పంపారు. ఉస్మానియా మార్చురీ ప్రాంగణంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగం అధిపతి డా.యాదయ్య ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు సరేంద్ర, లక్ష్మీనారాయణ, వైద్యులు రాహుల్, దీన్‌దయాల్, రాజ్‌కుమార్, విష్ణు, ఫజిల్, తుదీక, అవినాష్, సహాయక సిబ్బంది రవి, ధన్‌రాజ్, సుధార్, రాజు, గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యుడు లక్ష్మీకాంత్‌ను చేవెళ్లకు పంపించారు. ఊపిరాడకనే మృతి తలకు గాయాలు, కంకర మీదపడి ఊపిరాడక మృతి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. గాయాలు బలంగా తగిలాయి. మా వైద్యం బృందం సహకారంతో చేవెళ్ల ఆస్పత్రిలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించాం. – డా.రాజేంద్రప్రసాద్, సూపరింటెండెంట్, చేవెళ్ల ఆస్పత్రి -
టీడీపీ నేత ఇసుక అక్రమ రవాణాకు ఏడుగురు బలి
సాక్షి, నెల్లూరు: టీడీపీ నేత ఇసుక అక్రమ రవాణాకు ఏడుగురు బలైయ్యారు. ప్రమాదానికి కారణమైన ఇసుక టిప్పర్ టీడీపీ నేతదిగా గుర్తించారు. అప్పారావు పాలెం రీచ్ నుంచి నెల్లూరుకు రోజూ ట్రిప్పులు వేస్తున్నారు. మంత్రి ఆనం ప్రధాన అనుచరుడికి చెందిన టిప్పర్గా సమాచారం. ఇసుక టిప్పర్.. రాంగ్ రూట్లో వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కారును టిప్పర్ ఢీకొట్టిన తర్వాత.. వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు.కారు నుంచి మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది రెండున్నర గంటలపైగా శ్రమించారు. మృతులను నెల్లూరు పట్టణంలోని ముత్తుకూరు గేట్, గుర్రం వారి వీధికి చెందిన తాళ్లూరు రాధ(38), శ్రీనివాసులు (40), సారమ్మ(40), వెంగయ్య(45), లక్ష్మి(30), డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు.ఈ రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
సాక్షి, వరంగల్: హనుమకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కటాక్షపూర్-ఆత్మకూరు మధ్య టిప్పర్, కారు ఢీనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులు వరంగల్‌లోని కాశిబుగ్గకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మేడారం వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ఆరుగురు ఉండగా నలుగురు మృతి చెందారు.. డ్రైవర్‌తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చదవండి: బైక్‌కు అడ్డొచ్చిన కోతి.. భార్య కోమాలోకి.. భర్త పరిస్థితి విషమం -
రెండ్రోజుల క్రితం విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ బీభత్సం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
-
అధిక వేగంతో టిప్పర్ బీభత్సం
-
సిగ్నల్ జంపింగ్.. ప్రాణాలు తీసింది
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి/గన్‌ఫౌండ్రీ: వీకెండ్ పార్టీలో ఎంజాయ్ చేద్దామనుకున్నారు. కారులో జాయ్ రైడ్ చేస్తున్నారు. కానీ, మృత్యువు టిప్పర్ రూపంలో కాటేసింది. అప్పటిదాకా ఆనం దంగా గడిపినవారు అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని ఐటీ కారిడార్‌లో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు విగతజీవులయ్యారు. విప్రో జంక్షన్లో సిగ్నల్ జంప్ చేసిన వీరి స్విఫ్ట్ కారును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ధాటికి టిప్పర్ సైతం బోల్తా కొట్టింది. స్టాప్‌లైన్ వద్ద ఐదు సెకన్లు ఆగినా టిప్పర్ ముందుకు వెళ్లిపోయి ప్రాణాలు దక్కేవని, మృతులంతా 25 ఏళ్లలోపు యువకులేనని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్‌రావు తెలిపారు. 1.మనోహర్ 2.రోషన్ 3. భరద్వాజ్ ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయ్గూడానికి చెందిన కాట్రగడ్డ సంతోష్(25) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెల్లూరుకు చెందిన నాగిశెట్టి రోషన్(23), ఫస్ట్ లుక్ 3డీ యానిమేషన్లో పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి గణేష్ కాలనీకి చెందిన చింతా మనోహర్ (23), విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన పప్పు భరద్వాజ్ (20) మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని మారుతి పీజీ మెన్స్ హాస్టల్లో ఉంటున్నారు. నెల్లూరు జిల్లా వేదాయపాలెంకు చెందిన పవన్ కుమార్ (24) తన స్నేహితుడైన రోషన్‌ను కలిసేందుకు వచ్చాడు. పవన్ సోమవారం సాయంత్రం తన స్వస్థలానికి తిరిగి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఐదుగురూ తమ స్విఫ్ట్ కారులో వీకెండ్ పార్టీకని బయలుదేరారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రోషన్ మినహా మిగిలిన నలుగురూ హాస్టల్‌కు తిరిగి వచ్చారు. మళ్లీ 9.26 గంటలకు ఆ నలుగురు బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. (సెటిలయ్యాక వస్తానన్నాడు.. ఇంతలోనే విషాదం) విప్రో సర్కిల్లో బోల్తా పడిన టిప్పర్.. నుజ్జునుజ్జయిన కారు కారు నడిపిందెవరంటే... ప్రమాద సమయంలో కారును సంతోష్ నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ దీపేందర్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని శ్వాస పరీక్ష నిర్వహించగా మద్యం తాగిన ఆనవాళ్లు కనిపించలేదు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి సంబంధీకులకు మృతదేహాలను అప్పగించారు. అంతిమ సంస్కారాల నిమిత్తం స్వస్థలాలకు తరలించారు. జాయ్ రైడ్ కోసమేనా? రాత్రి 9.26కు బయటకు వెళ్లిన ఐదుగురు స్నేహితులు తెల్లవారు జామున 2.48 గంటల వరకు ఎక్కడికి వెళ్లారనే ప్రశ్నకు పోలీసులకు కూడా సరైన సమాధానం దొరకట్లేదు. కారులో పగిలిపోయిన కొన్ని బాటిళ్ల ఆనవాళ్లు పోలీసులకు కనిపించాయి. ఈ నేపథ్యంలో వీళ్లు ఎక్కడైనా పార్టీ చేసుకొని జాయ్ రైడ్ కోసం అటు వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతులు మద్యం సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తేనే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రమాదం ఇలా..? వీరు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారుజామున 2.48 గంటల ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న విప్రో జంక్షన్ వద్దకు చేరుకుంది. ట్రిపుల్ ఐటీ వైపు నుంచి వచ్చిన ఈ కారు ఆ జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి గౌలిదొడ్డి వైపు వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో రెడ్ సిగ్నల్ పడటంతో ట్రిపుల్ ఐటీ వైపు నుంచే వచ్చిన మరో కారు ఆగి ఉంది. అయితే, రెడ్ సిగ్నల్‌ను బేఖాతరు చేసిన ఈ స్విఫ్ట్ కారు గౌలిదొడ్డి వైపు వెళ్లేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో కోకాపేట వైపు నుంచి ట్రిపుల్ ఐటీ వైపు వెళ్ళేందుకు వేగంగా వస్తున్న టిప్పర్ (టీఎస్ 5 యుబి 2451) ఈ కారును ఢీ కొట్టింది. కారును రోడ్డు పక్కన తోసుకుంటూ వెళ్లిన టిప్పర్ కూడా బోల్తా కొట్టింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు కావడంతో ఐదుగురూ అందులో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకుని అక్కడకు పోలీసులు వచ్చి.. కారులో ఇరుక్కున్నవారిని బయటకు తీశారు. అప్పటికే సంతోష్, రోషన్, పవన్, మనోహర్ విగతజీవులయ్యారు. తీవ్రరక్తస్రావం అవుతున్న భరద్వాజ్‌ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచాడు. కారులో లభించిన సెల్ఫోన్ల ఆధారంగా పోలీసులు మృతుల వివరాలను తెలుసుకున్నారు. అంతుచిక్కని ఈ–చలానా! ప్రమాదానికి ముందు దృశ్యం ప్రమాదస్థలంలో నుజ్జునుజ్జై పడి ఉన్న వాహనంపై ఈ–చలాన్ జారీ అయి ఉంది. అదీ ఈ ప్రమాదం జరిగిన దాదాపు రెండున్నర గంటల తర్వాత కావడం గమనార్హం. తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రమాదం జరిగితే, ఆదివారం ఉదయం 5.29 గంటలకు కొత్తగూడ జంక్షన్లో ఈ కారు క్యారేజ్ వేలో రాంగ్ పార్కింగ్ చేసినట్లు రూ.100 జరిమానాతో ఈ–చలానా జారీ అయింది. ఈ చలానా ప్రకారం.. ప్రమాదం జరిగిన 2 గంటల 41 నిమిషాల తర్వాత... ఘటనాస్థలికి సుమారు ఆరు కిలోమీటర్ల వెనుక సదరు కారు రాంగ్ పార్కింగ్‌లో ఉందన్నమాట. ఈ చిక్కు ప్రశ్నకు పోలీసులే సమాధానం చెప్పాలి. ప్రతి ఈ–చలానాతోపాటు ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోనూ సదరు వెబ్సైట్ పొందుపరుస్తుంది. అయితే ఈ ఈ–చలానాకు సంబంధిత ఫొటోను మాత్రం జత చేయలేదు. -
నిద్రిస్తున్న కార్మికులపై దూసుకెళ్లిన టిప్పర్
సిరిసిల్ల క్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న ప్రాణహిత – చేవెళ్ల ప్యాకేజీ అండర్ టన్నెల్ పనుల్లో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున ఎప్పటిలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన చందన్ రాయ్ (20), మధ్యప్రదేశ్‌కు చెందిన సుఖ్‌దేవ్ సింగ్(29) డ్రిల్లింగ్ పనులకు వెళ్లారు. అక్కడ మిగతా కార్మికులు పని చేస్తుండగా.. రాయ్, సింగ్ మాత్రం పక్కన పడుకుని నిద్రలోకి వెళ్లారు. ఈ సమయంలో బయట నుంచి టిప్పర్‌తో వచ్చిన డ్రైవర్.. పడుకున్న ఇద్దరు కార్మికులను గమనించక నడపడంతో వీరిపైకి టిప్పర్ ఎక్కగా అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పా ట్లు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
కూలిన బతుకులు
వారివి రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. ఉపాధి కోసం భార్యలు కువైట్ వెళ్లారు. భర్తలు కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. వారిపై విధి చిన్నచూపు చూసింది. కూలి పనులు చేసుకుని ఇంటికి వెళుతున్న వారిని టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీంతో వారి కుటుంబాలు కూలిపోయాయి. చిత్తూరు , పెద్దమండ్యం: మండలంలోని పెద్దమండ్యం–చిన్నమండ్యం రోడ్డులోని మొరాలవంక మలుపు వద్ద ఆదివారం టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతులు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వారు. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా చిన్నమండ్యం మండలం చన్నరసుపల్లె, వడ్డిపల్లెకు చెందిన కూలీలు పెద్దమండ్యంలో జరిగిన కాంక్రీట్ పనులకు వచ్చారు. పనులు ముగించుకుని కొందరు కూలీలు ఆటోలో వెళ్లిపోయారు. చిన్నరసుపల్లెకు చెందిన భైనిమేని బండయ్య, (36), డేరంగుల రాజు (32), వేల్పుల పిచ్చయ్య (41) ద్విచక్ర వాహనంలో గ్రామానికి బయలుదేరారు. పెద్దమండ్యం– చిన్నమండ్యం రోడ్డులోని మొరాలవంక మలుపు వద్ద చిన్నమండ్యం నుంచి పెద్దమండ్యం వైపు రోడ్డుకు వేసే తారు లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొంది. సంఘటనలో బండయ్య, రాజు టిప్పర్ టైరు కింద పడి ఆక్కడికక్కడే దుర్మరణం చెందారు. టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని కొద్ది దూరం ఈడ్చుకువెళ్లింది. ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చున్న పిచ్చయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108లో వైఎస్సార్ కడప జిల్లా రాయచోటికి తరలించారు. తంబళ్లపల్లె ఎస్ఐ శివకుమార్ టిప్పర్‌ను వెనక్కు తీయించి మృతదేహాలను బయటకు తీశారు. టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాద వార్త తెలియడంతో పెద్దమండ్యం, చిన్నమండ్యం సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం మదనపల్లెకు తరలించారు. మృతుల కుటుంబాల్లో విషాదం రోడ్డు ప్రమాదం భైనిమేని బండయ్య, డేరంగుల రాజు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బండయ్యకు భార్య ఆనందమ్మ, కుమార్తె అశ్విని, కుమారుడు ఆంజినేయులు ఉన్నారు. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. ఆనందమ్మ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. అలాగే డేరంగుల రాజుకు భార్య నాగేశ్వరమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నాగేశ్వరమ్మ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. మృతదేహాల మృతుల పిల్లలు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వారిని చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. -
ఆదుకోని ఆపద్బంధువు
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : కత్తిపూడి శివారు 216వ జాతీయ రహదారి పక్కన ఇటీవల 108 సేవలు సకాలంలో అందకపోవడంతో నడిరోడ్డుపైనే మతి స్థిమితం లేని మహిళ ప్రసవించింది. ఫోన్ చేసినా సకాలంలో 108 రాకపోవడంతో జన్మించిన శిశువుకు వైద్యం అందలేదు. దీంతో శిశువు వెంటనే కన్నుమూసింది. ఘటన జరిగిన 3 గంటల తర్వాత 108 వాహనం అక్కడికి చేరుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోమవారం కూడా అదే తరహా జాప్యం పునరావృతమైంది. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో టాటా మేజిక్ వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేయగా వెంటనే రాలేదు. ఫోన్ చేసిన 2 గంటల తర్వాత వాహనం చేరుకుంది. ఈలోపు తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరు మృతి చెందారు. 108 వచ్చేలోపు పోలీసు జీపు, ఇతర వాహనాల్లో క్షతగాత్రులను పిఠాపురం ఆసుపత్రికి తరలించారు. ఇలా చెప్పుకునిపోతే గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. కానీ, ప్రభుత్వంలో చలనం లేదు. వైఎస్సార్ హయాంలో ఎన్నో ప్రాణాల్ని కాపాడిన ఆపద్బంధువు ఇప్పుడేమాత్రం ఆదుకోలేకపోతోంది. ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత గానీ రాని పరిస్థితి నెలకొంది. ఈలోపే క్షతగాత్రులు, ఆపదలో ఉన్న వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒకప్పుడు ప్రథమ చికిత్సతోప్రాణాల్ని నిలబెట్టేవి. తదుపరి వైద్యసేవలు అందేవరకు మెరుపు వేగంతో తరలి వచ్చి పునర్జన్మ ప్రసాదించేవి. ఇప్పుడా పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. సమయానికి రాకపోగా, వచ్చేవి కూడా ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితిలో 108 ఉంది. ఆక్సిజన్ కూడా 108 వాహనాల్లో లేని దుస్థితి నెలకొంది. జిల్లాలో 42 వాహనాలుండేవి. ఇందులో ప్రస్తుతం 33 పని చేస్తున్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికైతే క్షేత్రస్థాయిలో 29 మాత్రమే తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మిగతా వన్నీ మూలకు చేరిపోయాయి. ప్రస్తుతం పనిచేస్తున్న వాటిలో 20 వరకు చిన్న,చిన్న మరమ్మతులతో ఉన్నాయి. ఎప్పుడేది ఆగిపోతుందో తెలియదు. ఇక, ఆక్సిజన్ లేక, ఇంజన్ ఆయిల్ మార్చక, టైర్లు ఆరిగిపోయి తిరుగుతున్న వాహనాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాస్తవ పరిస్థితి బయటకు చెబితే ప్రభుత్వం కన్నెర్ర చేస్తుందని అధికార వర్గాలు బయటికి చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 108 వాహనాలు వచ్చి ఆదుకుంటాయనే ఆశ ప్రజలకు లేకుండా పోయింది. అందుకు ఉదాహరణే తాజాగా గొల్లప్రోలు వద్ద జరిగిన ప్రమాదం. కత్తిపూడిలో అదే నిర్లక్ష్యం... మొన్న కత్తిపూడిలో ఫోన్ చేసిన 3 గంటల తర్వాత 108 వాహనం రావడంతో రోడ్డుపై మతి స్థిమితం లేని మహిళ జన్మనిచ్చిన శిశువు చనిపోగా సోమవారం చేబ్రోలులో జరిగిన రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సేవలందించే విషయంలో కూడా అదే తరహా జాప్యం చోటుచేసుకుంది. దీనికంతటికీ ప్రమాదం జరిగిన గొల్లప్రోలు మండలంలో 108 వాహనం లేకపోవడమే కారణం. గతంలో ఇక్కడ 108 వాహనం ఉండేది. కాకినాడ రూరల్‌లోని వాహనం పాడైందని గొల్లప్రోలులో ఉండే వాహనాన్ని తరలించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గమంతటికీ రెండే వాహనాలున్న పరిస్థితి నెలకొంది. అసలే అరకొరగా పనిచేస్తుండగా, ఆపై వాహన కొరత ఉండటంతో ఫోన్ చేసిన వెంటనే ఘటన జరిగిన చేబ్రోలుకు 108 రాలేకపోయినట్టు తెలుస్తోంది. సుమారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రమాదం జరగ్గా 108 వచ్చే సరికి రెండు గంటలు ఆలస్యమైంది. ఈలోపే తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు సకాలంలో వైద్యసేవలందక మృతి చెందారు. సమయానికి వచ్చి ఉంటే వారిద్దరూ బతికేవారేమోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలను పణంగా పెట్టక తప్పదన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జాప్యానికి కారణంపరిశీలిస్తా... ఫోన్ చేసిన వెంటనే 108 వాహనం ఎందుకు రాలేకపోయిందో పరిశీలిస్తాను. ఏ కారణం చేత రాలేదో తెలుసుకుంటాను. కాకినాడ రూరల్ 108 వాహనం చెడిపోయిన కారణంగా గొల్లప్రోలు వాహనాన్ని అక్కడికి తరలించాం. 108 వాహనాల కొరత ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో వాహనాలు రానున్నాయి.– బాలాజీ, 108 సేవల జిల్లా మేనేజర్ -
టిప్పర్ కింద పడి వీఆర్ఏ మృతి
చిగురుమామిడి(హుస్నాబాద్): మండలంలోని ఇందుర్తికి చెందిన వీఆర్ఏ కూన మహేందర్(43) ప్రమాదవశాత్తు టిప్పర్ కింద పడి మృతిచెందాడు. మహేందర్ సోమవారం తన భార్య భాగ్యవ్వను వ్యవసాయ బావి వద్దకు దింపేందుకు తన మోపెడ్‌పై వెళ్లాడు. ఆమెను బావి వద్ద దింపి తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో ఎదురుగా టిప్పర్ వస్తుండడం గమనించి రోడ్డు పక్కకు మోపెడ్‌ను ఆపి నిలిచాడు. అయితే టిప్పర్ డ్రైవర్ మహేందర్‌ను దాటి ముందుకెళ్లి, తిరిగి వెనక్కి వేగంగా రావడంతో వెనుక టైర్‌తోపాటు ముందు టైర్లు ఎక్కాయి. తీవ్రంగా గాయపడ్డ మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. తల నుజ్జునుజ్జయ్యింది. ఇతనికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలంటూ గ్రామస్తులు, బంధువులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళన సాయంత్రం వరకు కొనసాగింది. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ గడ్డం సుధాకర్, ఎల్ఎండీ సీఐ కరుణాకర్‌రావు అక్కడికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. చిగురుమామిడి జెడ్పీటీసీ వీరమల్ల చంద్రయ్య మృతదేహం వద్ద నివాళి అర్పించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ మహేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆందుకుంటుందన్నారు. ఆపద్బంధు పథకం ద్వారా ఆర్థికం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఎంపీటీసీలు అందె సుజాత, ఆకుల మొగిలి, టీఆర్ఎస్ మైనార్టీసెల్ మండలాధ్యక్షుడు ఎస్.కె. సిరాజ్ తదితరులు నివాళులర్పించారు. -
బిస్కెట్లు కొందామని వెళుతుండగా...
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పండక్కు వచ్చిన మనవడికి బిస్కెట్లు కొనేందుకు దుకాణానికి వెళుతుండగా బొగ్గు లోడుతో వెళుతున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో జగదీష్(10) అనే బాలుడు అక్కడికక్కడే మతిచెందగా బాలుడి తాత గాంధీరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. గాంధీరెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మనవడు బిస్కెట్ కావాలనడంతో గాంధీరెడ్డి మనవడిని తోడ్కొని అంగడికి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆగ్రహంతో టిప్పర్‌ను ధ్వంసంచేయడమేకాక రోడ్డుపై బైటాయించి ఆందోళన చేశారు. జనాన్ని చూసిన డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆస్పరి: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆస్పరి మండలం చిన్నహోతూరు వద్ద టిప్పర్ బోల్తాపడి ఆరుగురు మహిళలు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కూలి పనుల కోసం నల్లగొండకు వెళ్లి హోళగొందకు టిప్పర్‌లో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు హోళగొంద మండలం కొత్తపేట వాసులు. వీరిని షేకమ్మ, హన్మంతమ్మ, గోవిందమ్మ, నర్సమ్మ, స్రవంతి, ఈరమ్మలుగా గుర్తించారు. -
బ్రిడ్జిపై నుంచి కిందపడిన టిప్పర్... క్లీనర్ మృతి
సాక్షి, భూపాలపల్లి: ప్రమాదవశాత్తూ బొగ్గు టిప్పర్ బ్రిడ్జిపై నుంచి కింద పడడంతో క్లీనర్ మృతిచెందాడు. భూపాలపల్లి- కాళేశ్వరం ప్రధాన రహదారిలో బొగ్గులవాగుపై ఉన్న బ్రిడ్జిపై నుంచి టిప్పర్ బోల్తా కొట్టింది. దీంతో టిప్పర్ క్లీనర్ ధనం గోపీ(24) అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే టిప్పర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో పడిన టిప్పర్ : ముగ్గురు మృతి
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఫేజ్-1 దగ్గర శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టుకు చెందిన కాలువలో టిప్పర్ బోల్తాకొట్టిన సంఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామం దగ్గర ప్రాజెక్టు పనుల్లో ఉపయోగిస్తున్న టిప్పర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో కాలువలో పడిపోయింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు. -
నిద్రిస్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన టిప్పర్
కాపలాగా నిద్రిస్తున్న వ్యక్తిపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్కక్తి టిప్పర్ కింద నుజ్జునుజ్జయి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం దుద్దెబండ వద్ద మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. హంద్రీనీవా కాలువ పనుల వద్ద వెంకటరాములుఅనే వ్యక్తి రాత్రి పూట కాపలా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న అతడిపైకి మంగళవారం తెల్లవారుజామున ఓ టిప్పర్ ఎక్కేసింది. దీంతో అతడు మృతి చెందాడు. పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
దంపతులపైకి దూసుకెళ్లిన టిప్పర్: భార్య మృతి
హైదరాబాద్: నగరంలోని నాగోలులో శనివారం టిప్పర్ బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో వెళ్తున్న టిప్పర్ పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆ క్రమంలో భార్య మృతి చెందింది. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్, టిప్పర్ ఢీ: ఇద్దరు మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో టిప్పర్, బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. అశోక్‌సాగర్ సమీపంలో ద్విచక్ర వాహనం టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ముగ్గురిలో సురేశ్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటేశ్ అనే యువకుడు మృతి చెందాడు. మూడో యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు నిరసనగా బాధితుల కుటుంబీకులు నిజామాబాద్-బోధన్ రహదారిపై ఎడపల్లి గ్రామం వద్ద బైఠాయించారు. దాదాపు మూడు గంటల నుంచి ఆందోళన కొనసాగుతోంది. -
యువకుడి ప్రాణాలు బలిగొన్న టిప్పర్
హయత్‌నగర్: హైదరాబాద్ శివార్లలో ఓ టిప్పర్ విధ్వంసం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఓ టిప్పర్ వేగంగా దూసుకువచ్చి ముందు వెళుతున్న ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న మల్లేశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా కుంట్లూరు గ్రామానికి చెందిన మల్లేశ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


