హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి | Road Accident In Hanamkonda District | Sakshi
Sakshi News home page

హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

Jun 25 2023 7:29 PM | Updated on Jun 25 2023 7:31 PM

Road Accident In Hanamkonda District - Sakshi

హనుమకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కటాక్షపూర్‌-ఆత్మకూరు మధ్య టిప్పర్‌, కారు ఢీనడంతో  కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

సాక్షి, వరంగల్‌: హనుమకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కటాక్షపూర్‌-ఆత్మకూరు మధ్య టిప్పర్‌, కారు ఢీనడంతో  కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులు వరంగల్లోని కాశిబుగ్గకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

మేడారం వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ఆరుగురు ఉండగా నలుగురు మృతి చెందారు.. డ్రైవర్‌తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
చదవండి: బైక్‌కు అడ్డొచ్చిన కోతి.. భార్య కోమాలోకి.. భర్త పరిస్థితి విషమం

Advertisement
 
Advertisement
Advertisement