కాలువలో పడిన టిప‍్పర్‌ : ముగ్గురు మృతి | tipper accident in nagar kurnool  | Sakshi
Sakshi News home page

కాలువలో పడిన టిప‍్పర్‌ : ముగ్గురు మృతి

Nov 18 2017 3:58 PM | Updated on Nov 18 2017 3:58 PM

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఫేజ్‌-1 దగ్గర శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

సాక్షి, నాగర్‌కర్నూల్‌: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఫేజ్‌-1 దగ్గర శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టుకు చెందిన కాలువలో టిప్పర్ బోల్తాకొట్టిన సంఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామం దగ్గర ప్రాజెక్టు పనుల్లో ఉపయోగిస్తున్న టిప్పర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో కాలువలో పడిపోయింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు.

Advertisement
 
Advertisement
Advertisement