బైక్, టిప్పర్ ఢీ: ఇద్దరు మృతి | two dies of bike, tipper accident | Sakshi
Sakshi News home page

బైక్, టిప్పర్ ఢీ: ఇద్దరు మృతి

Apr 17 2015 6:43 PM | Updated on Sep 3 2017 12:25 AM

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో టిప్పర్, బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో టిప్పర్, బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. అశోక్‌సాగర్ సమీపంలో ద్విచక్ర వాహనం టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ముగ్గురిలో సురేశ్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటేశ్ అనే యువకుడు మృతి చెందాడు.

మూడో యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు నిరసనగా బాధితుల కుటుంబీకులు నిజామాబాద్-బోధన్ రహదారిపై ఎడపల్లి గ్రామం వద్ద బైఠాయించారు. దాదాపు మూడు గంటల నుంచి ఆందోళన కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement