యువకుడి ప్రాణాలు బలిగొన్న టిప్పర్ | Tipper hits youngster at Hyderabad | Sakshi
Sakshi News home page

యువకుడి ప్రాణాలు బలిగొన్న టిప్పర్

Apr 10 2015 8:58 PM | Updated on Aug 1 2018 2:10 PM

హైదరాబాద్ శివార్లలో ఓ టిప్పర్ విధ్వంసం సృష్టించింది.

హయత్‌నగర్: హైదరాబాద్ శివార్లలో ఓ టిప్పర్ విధ్వంసం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఓ టిప్పర్ వేగంగా దూసుకువచ్చి ముందు వెళుతున్న ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న మల్లేశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా కుంట్లూరు గ్రామానికి చెందిన మల్లేశ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement