Peter
-
ఓర్బన్ సామ్రాజ్యం బద్దలు.. హంగేరీ ప్రధానిగా పీటర్ మాగ్యార్
బుడాపెస్ట్: హంగేరీ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. 16 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన విక్టర్ ఓర్బన్ అధికార సామ్రాజ్యం బద్దలైంది. ‘తిస్జా’ (Tisza) పార్టీ వ్యవస్థాపకుడు 45 ఏళ్ల పీటర్ మాగ్యార్ హంగేరీ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వృత్తిరీత్యా లాయర్ అయిన మాగ్యార్, ఒకప్పుడు ఓర్బన్ రాజకీయ కోటరీలో అత్యంత కీలక వ్యక్తి. ఇప్పుడు ఆయనే ఆ కోటను బద్దలుకొట్టి, ఈ చారిత్రక విజయాన్ని నమోదు చేయడం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.పాలకునిగా కాదు.. సేవకుడిగానే ఉంటాశనివారం హంగేరీ పార్లమెంట్లో నూతన ప్రధానిగా మాగ్యార్ ప్రమాణ స్వీకారం చేశారు. ‘లక్షలాది మంది హంగేరీ ప్రజలు మార్పును కోరుకున్నారు కాబట్టే నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. నేను ప్రజలను పాలించడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను’ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2024లో స్థాపించిన మధ్య-మితవాద ‘తిస్జా’ పార్టీ గత నెల ఎన్నికల్లో ఏకంగా 199 స్థానాలకు గాను 141 సీట్లు కైవసం చేసుకుని మూడింట రెండొంతుల మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఓర్బన్కు చెందిన ఫైడెజ్-కేడీఎన్పీ కూటమి కేవలం 52 స్థానాలకే పరిమితమైంది.మారనున్న విదేశీ విధానం.. వేడుకకు ఓర్బన్ దూరంఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ప్రధాని విక్టర్ ఓర్బన్ హాజరుకాకపోవడం గమనార్హం. 1990 తర్వాత ఆయన ఒక పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండటం ఇదే తొలిసారి. కాగా మాగ్యార్ విజయంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో హంగేరీ సంబంధాలు మెరుగవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టబద్ధమైన పాలన, ఉక్రెయిన్‌కు మద్దతు వంటి అంశాల్లో ఈయూతో ఓర్బన్ సర్కార్‌కు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు స్పష్టమైన మెజారిటీ దక్కడంతో, పాత ప్రభుత్వ నిరంకుశ విధానాలను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు నూతన ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.బుడాపెస్ట్‌లో సంబరాలు.. చట్టసభలో మహిళా శక్తినూతన ప్రధాని ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో రాజధాని బుడాపెస్ట్‌లోని కొసుత్ స్క్వేర్ వద్దకు వేలాది మంది మద్దతుదారులు చేరుకుని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ‘పాలనా మార్పు’గా మాగ్యార్ అభివర్ణించారు. మరో ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే, ఈసారి హంగేరీ చట్టసభలో రికార్డు స్థాయిలో 54 మంది మహిళలు అడుగుపెట్టారు. దేశ శాసనసభ చరిత్రలో ఇదే అత్యధిక మహిళా ప్రాతినిధ్యం కాగా, వీరిలో అత్యధిక మంది మాగ్యార్‌కు చెందిన తిస్జా పార్టీ నుంచే ఎన్నికవడం విశేషం.ఇది కూడా చదవండి: శోకసంద్రంలో కర్ణాటక.. మంత్రి సుధాకర్ కన్నుమూత -
హంగేరిలో కొత్త గాలి
పశ్చిమాసియా మొదలుకొని ప్రపంచం నలుమూలల నుంచీ దుర్వార్తలే వింటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇది మరో పిడుగుపాటు. పదహారేళ్లుగా హంగేరిని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న కన్సర్వేటివ్ జాతీయవాది, ప్రధాని విక్టర్ ఒర్బాన్ ఘోరంగా ఓటమిపాలయ్యారు. 199 స్థానాలున్న పార్లమెంటుకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఫిడెస్కి కేవలం 55 స్థానాలు మాత్రమే రాగా, ఆయన్నుంచి విడిపోయి, మధ్యేవాద మితవాద పక్షం టీసా పార్టీని స్థాపించిన పీటర్ మాజార్కు అనూహ్యంగా 138 స్థానాలు లభించాయి. తీవ్ర మితవాద పక్షం అవర్ హోంల్యాండ్‌కు 6 దక్కాయి. తుది ఫలితాలు అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఎన్నికల సంఘం మొదలుకొని న్యాయవ్యవస్థ, మీడియా వరకూ అన్నిటినీ అధీనంలోకి తెచ్చుకుని తిరుగులేని అధికారం చలాయిస్తున్న ఒర్బాన్ ఓటమిని ఎవరూ ఊహించలేదు. ఆయనపై ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని స్వతంత్ర సర్వే సంస్థలు చెప్పినా ఎవరూ నమ్మలేదు. టీసా పార్టీ దాదాపు 6 శాతం పాయింట్ల ఆధిక్యత తెచ్చుకుంటేనే కనీసం సాధారణ మెజారిటీ కూడా అసాధ్యమని కొన్ని మీడియా సంస్థలు చెప్పగా... అధికార పార్టీకన్నా టీసా పది పాయింట్లు వెనకబడివుందని ప్రభుత్వ అనుకూల మీడియా ఢంకా బజాయించింది. ఈ ఎన్నికల సందర్భంగా హంగేరి ఏమాత్రం పొంతనలేని రెండు భిన్న ప్రపంచాలు చూసింది. అధికారపక్షం వైపు మొగ్గే ప్రపంచం ఒర్బాన్ మరో నాలుగేళ్లు ఏలబోతున్నారంటూ మోత మోగించింది. అందులో మీడియా సంస్థలూ, సామాజిక మాధ్యమాలూ, ‘సాధారణ పౌరులూ’ ఉన్నారు. అటు పీటర్ మజార్‌ను సమర్థించే ప్రపంచం అందుకు భిన్నమైన విశ్లేషణలు చేసింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ‘నిజమైన ప్రపంచం’ అయివుంటుందని అందరికీ తెలుసు. సోమవారం ఓట్ల లెక్కింపు తర్వాత ‘నకిలీ ప్రపంచం’ బట్టబయలైంది. ఒర్బాన్ హంగేరికి మాత్రమే పరిమితమైన సాధారణ నాయకుడు కాదు. ఆయన్ను అధికార పీఠం ఎక్కించిన ఫార్ములా దేశదేశాల నాయకులకూ శిరోధార్యంగా మారింది. సంప్రదాయవాదాన్నీ, జాతీయవాదాన్నీ నెత్తికెత్తుకుని ప్రజల భావోద్వేగాలను ఉచ్ఛస్థితికి తీసుకెళ్లటం ఎలాగో ఒర్బాన్ నేర్పారు. అమెరికాకు మాత్రమే కాదు... ప్రపంచానికంతకూ పెను సమస్యగా మారిన ట్రంప్ ఆయన స్ఫూర్తితోనే మాగా (మళ్లీ అమెరికాను మహోన్నతం చేద్దాం) ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ఒర్బాన్కు ట్రంప్, పుతిన్ సన్నిహితులు. వారిద్దరి మాదిరే ఈయూతో వైరం. ఒర్బాన్ మార్కు ఏలుబడికి ఇంటా బయటా శత్రువులు అవసరం. వారు– ఈయూ, కమ్యూనిస్టులు, వలసదారులు, శతకోటీశ్వరుడు, దాత జార్జి సోరోస్– ఎవరైనా కావొచ్చు. అభద్రతా భావన కూ. విదేశీ బెడదకూ, సమాజంలోని నైతిక పతనానికీ, ఇతరత్రా ప్రమాదాలకూ సర్వరోగ నివారిణి తాను మాత్రమేనని ఒర్బాన్ పదహారేళ్లపాటు నమ్మించగలిగారు. ‘సూపర్ మెజారిటీ’ వచ్చినా పాలనపై పూర్తిస్థాయి పట్టు సంపాదించటం టీసా పార్టీకి అంత సులభం కాదు. ఎందుకంటే సకల అధికార వ్యవస్థలూ ఒర్బాన్ అనుకూలురతో నిండివున్నాయి. ఆర్థిక సంస్థలూ, అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం, అవినీతి నిరోధక విభాగం వగైరాలన్నీ ఆయన మనుషుల చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. ఈయూ నుంచి బయటికొస్తేనే సకల సమస్యలూ పరిష్కారమవుతాయని ఆయన చెప్పిన మాటలు విశ్వసించబట్టే ఆర్థికంగా అధోగతిలోవున్నా జనం నమ్మారు. ఒర్బాన్ అనుకూల వ్యాపార సంస్థలు మాత్రమే లాభార్జనతో కళకళలాడాయి. నిరుద్యోగం పదేళ్ల రికార్డును అధిగమించింది. నిరుడు ఆర్థిక వృద్ధి 0.4 శాతం. కొన్నేళ్లుగా కష్టాల్లోవున్న పోలెండ్ సైతం 3.6 వృద్ధి రేటు సాధించగా... బల్గేరియా, రుమేనియా సైతం మెరుగ్గా ఉన్నాయి. ఇక అవినీతిలో హంగేరిది అగ్రస్థానం. ఇరాన్ శాంతి చర్చలకన్నా ముందు, ఒర్బాన్ గెలుపుకోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హంగేరి వెళ్లి ప్రచారం చేశారు. కానీ ఇరాన్ శాంతి చర్చల మాదిరే, ఒర్బాన్ కూడా కుప్పకూలారు. ఆయన ఓటమితో ఈయూ దేశాలు పండగ చేసుకుంటున్నాయి. హంగేరి ప్రజలు తమతోనే ఉన్నారని సంబరపడుతున్నాయి. కానీ అధోగతిలోవున్న హంగేరికి అందరూ ఆపన్న హస్తం అందించటం అత్యవసరం. -
హంగేరీ కొత్త ’హీరో’ పీటర్ మాగ్యార్ ఎవరు?
బుడాపెస్ట్: యూరప్ రాజకీయాల్లో అగ్రదేశమైన హంగేరీలో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా తిరుగులేని నేతగా ఏకఛత్రాధిపత్యం వహించిన ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్కు అక్కడి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ నేత, 45 ఏళ్ల పీటర్ మాగ్యార్ నేతృత్వంలోని ‘తిస్సా’ పార్టీ ప్రభంజనం సృష్టించింది. దీంతో హంగేరీ నూతన ప్రధానిగా పీటర్ మాగ్యార్ ఎన్నికయ్యారు.న్యాయశాస్త్రం అభ్యసించిన పీటర్ మాగ్యార్ ఒకప్పుడు ఓర్బన్ కు చెందిన ‘ఫిడెస్జ్’ పార్టీలోనే సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. బ్రస్సెల్స్‌లో దౌత్యవేత్తగా, ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత పదవులు చేపట్టారు. అయితే గతంలో జరిగిన లైంగిక వేధింపుల కేసును కప్పిపుచ్చిన వ్యక్తికి ఓర్బన్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పీటర్ 2024లో ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు. అదే ఏడాది ‘తిస్సా’ అనే కొత్త రాజకీయ ఉద్యమాన్ని స్థాపించి, యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో 30 శాతం ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.హంగేరీ ఎన్నికల ఫలితాలు కేవలం ఈ దేశంలోనే కాకుండా అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొత్తం 199 స్థానాలున్న హంగేరీ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 77 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి అద్దం పట్టింది. కమ్యూనిస్ట్ పాలన అంతమైన తర్వాత ఇంతటి పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు లెక్కించిన 97.35 శాతం ఓట్లలో, టిస్జా పార్టీ ఏకంగా 53.6 శాతం ఓట్లతో 138 సీట్లను కైవసం చేసుకుని, మూడింట రెండొంతుల మెజారిటీ దిశగా దూసుకెళ్లింది.మరోవైపు జాతీయవాద నేత ఓర్బన్కు చెందిన ‘ఫిడెజ్’ పార్టీ కేవలం 37.8 శాతం ఓట్లతో 55 సీట్లకే పరిమితమై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. తన ఓటమి అత్యంత బాధాకరమైనప్పటికీ స్పష్టమైనదని అంగీకరించిన ఓర్బన్.. పీటర్ మాగ్యార్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బుడాపెస్ట్‌లోని డాన్యూబ్ నది తీరాన వేలాది మంది మద్దతుదారుల మధ్య పీటర్ మాగ్యార్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ, ఈ రాత్రి అబద్ధాలపై నిజం గెలిచిందని వ్యాఖ్యానించారు. దేశంలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేసి, న్యాయవ్యవస్థకు, ఇతర సంస్థలకు పూర్తి స్వతంత్రతను తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ ఎన్నికల ఫలితం హంగేరీకే కాకుండా యూరోపియన్ యూనియన్, యుక్రెయిన్ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాన మిత్రుడిగా ఉన్న ఓర్బన్ ఓటమితో, పాశ్చాత్య దేశాలకు మరింత బలం చేకూరింది. ఓర్బన్ అడ్డుకుంటూ వస్తున్న, యుక్రెయిన్ కు ఇవ్వాల్సిన 90 బిలియన్ యూరోల రుణానికి ఇప్పుడు మార్గం సుగమం కానుంది. అలాగే, ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘన కారణంగా హంగేరీకి యూరోపియన్ యూనియన్ నిలిపివేసిన నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అమెరికాకు చెందిన జేడీ వాన్స్ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా, డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక మద్దతు ఇస్తామని ప్రకటించినా ఓర్బన్‌ను ప్రజలు గెలిపించకపోవడం గమనార్హం.ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక -
ఎప్స్టీన్ ఫైళ్ల కేసు.. మరో కీలక పరిణామం
లండన్: ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం తాలూకు టేపుల రగడ బ్రిటన్‌లో మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్స్టీన్తో సన్నిహిత సంబంధాలు నెరిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మండేల్సన్ (72)ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అయితే మండేల్సన్పై లైంగిక దుష్ప్రవర్తన వంటి ఆరోపణలేమీ లేవు. దాదాపు పదిహేనేళ్ల కింద బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆయన ఎప్స్టీన్కు చేరవేశారన్న అభియోగాలపై దర్యాప్తు సాగుతోంది. ఎప్స్టీన్ బాగోతానికి సంబంధించి బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ ఆండ్రూను ఐదు రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.2010లో జెఫ్రీ ఎప్స్టీన్కు ఆండ్రూ వాణిజ్య నివేదికలను పంపారన్న ఆరోపణలపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత, ప్రభుత్వ పదవిలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్నఆరోపణపై దర్యాప్తు ప్రారంభించామనీ, తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ నేరంపై విచారణ జరుపుతున్నప్పుడు, దర్యాప్తు సమగ్రతను, నిష్పాక్షికతను కాపాడటం చాలా ముఖ్యమని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్కు ఆండ్రూ రహస్య సమాచారం ఇచ్చాడనే నివేదికలపై విచారణకు కింగ్ చార్లెస్ III సహకరిస్తారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపిన సంగతి తెలిసిందే.మరోవైపు.. ఎప్స్టీన్ కేసులో బాధితురాలు రినా ఓహ్ ఎదుర్కొన్న చేదు అనుభవాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా బ్రిటీష్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్ట్ తరువాత లైంగిక వేధింపుల పర్వంపై 40 ఏళ్ల రీనా విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ఎప్స్టీన్ లాంటిపవర్పుల్ వ్యక్తి సామాన్యులను, మానసికంగా బలహీనంగా ఉన్నవారిని ఎలా లోబరుచుకుంటారో, ఎలాంటి వేధింపులకు గురిచేస్తారో వివరించింది. -
సిలికాన్ వ్యాలీని వీడనున్న ఇద్దరు బిలియనీర్లు!
ప్రపంచ టెక్నాలజీ రంగానికి కేంద్రంగా నిలిచిన సిలికాన్ వ్యాలీ.. దశాబ్దాలుగా ప్రముఖ వ్యాపారవేత్తలు & ఆవిష్కర్తలకు నిలయంగా ఉంది. అయితే తాజాగా వెలువడిన కొన్ని అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం.. ఇద్దరు ప్రముఖ టెక్ బిలియనీర్లు అక్కడి నుంచి వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం అంతర్జాతీయంగా.. చర్చనీయాంశంగా మారింది.సిలికాన్ వ్యాలీని వీడనున్న ఇద్దరు బిలియనీర్లలో ఒకరు పేపాల్ కో-ఫౌండర్ పీటర్ థీల్, మరొకరు గూగుల్ కో-ఫౌండర్ లారీ పేజ్.పీటర్ థీల్, లారీ పేజ్ ఇరువురూ.. సిలికాన్ వ్యాలీని విడిచిపెట్టడానికి కారణం క్యాలిఫోర్నియా ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ''బిలియనీర్ ట్యాక్స్'' అని తెలుస్తోంది. ఈ పన్ను ప్రకారం.. ఒక బిలియన్ డాలర్లకు మించిన ఆస్తి కలిగిన వ్యక్తులపై అదనపు సంపద పన్ను విధించాలనే యోచన ఉంది.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేందుకు ఉపయోగపడుతుందని పలువురు భావిస్తున్నప్పటికీ.. సంపన్నులు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పన్ను వల్ల తమపై భారీ ఆర్థిక భారం పడుతుందని, పెట్టుబడులు & వ్యాపార స్వేచ్ఛకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. ఈ కారణంగానే పీటర్ థీల్, లారీ పేజ్ వంటి బిలియనీర్లు సిలికాన్ వ్యాలీని విడిచిపెట్టడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.బిలియనీర్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఉన్న మార్గం.. క్యాలిఫోర్నియా నుంచి ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు వెళ్లిపోవడమే. ఈ పరిణామం సిలికాన్ వ్యాలీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవేళా ఈ బిలియనీర్లు నిజంగా నగరాన్ని విడిచిపెడితే, ఇతర టెక్ వ్యాపారవేత్తలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. ఫలితంగా క్యాలిఫోర్నియా రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గడమే కాకుండా, సిలికాన్ వ్యాలీకి ఉన్న ప్రపంచవ్యాప్త ప్రాధాన్యం కొంత మేర తగ్గే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.యూకే వీడిన లక్ష్మీ మిట్టల్ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల కారణంగా దేశం వీడిన బిలియనీర్ల జాబితాలో ప్రముఖ్ ఉక్కు వ్యాపారి లక్ష్మీ ఎన్ మిట్టల్ కూడా ఉన్నారు. యూకే ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు నిర్ణయం వల్ల.. ఆయన దేశం విదిచిపెట్టి దుబాయ్ చేరుకున్నారు. 2025 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' ప్రకారం ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వర్క్స్ ఫౌండర్ 15.4 బిలియన్ పౌండ్ల ఆస్తిని కలిగి ఉన్నారని అంచనా. దీంతో లక్ష్మీ మిట్టల్ యూకేలో ఎనిమిదవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇదీ చదవండి: లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. కుటుంబం లోన్ చెల్లించాలా? -
గాజు డిస్క్: చిన్నదేగానీ..చిరంజీవి
‘సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు’ అన్న మాటను ఇప్పుడు ఒక చిన్న గాజు ఫలకం అబద్ధం చేసింది. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పీటర్ కజాన్ స్కీ, అతని బృందం రూపొందించిన ఈ గాజు డిస్క్, మొత్తం చరిత్ర జ్ఞాపకాలను శాశ్వతంగా బంధించగల అద్భుతం. దీని పేరు ‘సూపర్మాన్ మెమరీ క్రిస్టల్’. ఇందులో మూడు వందల అరవై టెరాబైట్ల డేటాను స్టోర్ చేయొచ్చు. అంటే చరిత్ర, గ్రంథాలు, సినిమాలు, సంగీతం అన్నీ ఒకే డిస్క్‌లో ఇమిడిపోతాయి. సాధారణ హార్డ్‌డ్రైవ్ లేదా పెన్‌డ్రైవ్ కొంతకాలానికే దెబ్బతింటుంది. ప్రత్యేకమైన గాజుతో రూపొందిన ఈ డిస్కును మాత్రం తీవ్రస్థాయిలోని ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు, ప్రకృతి విపత్తులు వంటివేవీ దీనిని తాకలేవు. అణు స్థాయిలో ఉండే నానో నిర్మాణాల ద్వారా పరిమాణం, దిశ, స్థానం వంటి ఐదు మార్గాల్లో ఇందులో డేటా స్టోర్ అవుతుంది. కోట్ల ఏళ్ల తరువాత కూడా మన కథలను ఈ గాజు డిస్క్ ఒక్కటే చెప్తుంది. మొత్తానికి, ఇది ఉత్త గాజు బిళ్ల కాదు, మానవ జ్ఞాపకాలకు కాలాతీత బీమా పథకం! పరిమాణంలో ఇది చిన్నదే గాని, మనుగడలో మాత్రం చిరంజీవి. త్వరలోనే దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురానున్నారు. (చదవండి: Ukrainian Inventor Valentyn Frechka: రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..) -
పడి లేచి... మళ్లీ పడిన కెరటం
బ్రిటిష్ వార్తలు అమితా సక్తితో చదివే వారైతే తప్ప మీకు పీటర్ మ్యాండెల్సన్ ఎవరో తెలిసే అవకాశం లేదు. ఆయన మూడుసార్లు ఉన్నత ప్రభుత్వ పదవి అలంకరించి, ఆ మూడు సార్లూ ఎంతో అవమాన కరంగా వైదొలగిన వ్యక్తి. నాకు తెలిసిన అలాంటి రాజకీయవేత్త ఆయన ఒక్కడే! చివరిసారి, అమెరికాలో బ్రిటన్ రాయబారి పదవి నుంచి సెప్టెంబర్ 11న డిస్మిస్ అయ్యాడు. ఎంతో కష్టపడి అధిరోహించిన విజయ శిఖరం నుంచి అమాంతం జారిపోయాడు. ఇది ఆయనకు కొత్తేం కాదు. అయితే ఎందుకిలా జరుగు తోంది? ఈ ప్రశ్న నన్ను ఆలోచనలో పడేస్తోంది. ఒకానొకప్పుడు ఆయన నాకు మంచి మిత్రుడు. సెక్స్ నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్తో దోస్తీ ఆయన తాజా ఎపిసోడ్‌కు ముగింపు నిచ్చింది. రాయబారిగా నియమితుడయ్యే సమయంలో ఈ మైత్రీబంధం ఎలాంటిదో ఆయన వివరించినట్లు లేడు. 18 ఏళ్లు నిండని బాలికను వ్యభిచారానికి ప్రేరేపించినట్లు 2008లో నేరం రుజువు అయిన తర్వాత, తన ‘ప్రియ మిత్రుడు’ ఎప్స్టీన్కు అదే ఏడాది జూలైలో పీటర్ ఒక లేఖ రాశారు. ‘‘నీ ప్రపంచం గురించి ఆలోచించాను. జరిగిన దానికి నాకు కోపం వస్తోంది, నిరాశా కలుగుతోంది’’ అని ఈ లేఖలో ఉంది. ‘‘నీ మిత్రులు నీతోనే ఉంటారు, నిన్ను ప్రేమిస్తారు’’.ఈ లేఖ బయట పడిన గంటల వ్యవధిలోనే బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆయనకు ఉద్వాసన పలికారు.మళ్లీ మళ్లీ రాజీనామాలుమ్యాండెల్సన్ను దురదృష్టం వెన్నాడటం ఇది మూడోసారి. డిసెంబర్ 1998లో అప్పటి ప్రధాని టోనీ బ్లెయిర్ మంత్రి మండలిలో వాణిజ్యం, పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి దెబ్బ తిన్నాడు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ప్రభుత్వ చెల్లింపుల ముఖ్య అధికారి’ (పే మాస్టర్ జనరల్) జ్యాఫ్రీ రాబిన్సన్ నుంచి 3,73,000 పౌండ్ల అన్సెక్యూర్డ్ రుణం తీసుకున్నట్లు బయటపడటంతో ప్రధాని ఆయనతో రాజీనామా చేయించారు.ఇది జరిగిన రెండేళ్లలోనే పీటర్ మళ్ళీ ఉన్నత పదవి అలంకరించ గలిగాడు. ఈసారి ఉత్తర ఐర్లాండ్ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యాడు. శ్రీచంద్ హిందూజాకు బ్రిటిష్ పౌరసత్వం ఇప్పించేందుకు అధికార దుర్వినియోగం చేశాడని ఆరోపణలు రావడంతో 2001 జనవరిలో మ్యాండెల్సన్ మళ్లీ రాజీనామా చేయవలసి వచ్చింది.ఏమయినప్పటికీ, అంతటి దురదృష్టం కూడా పీటర్ రాజకీయ జీవితాన్ని అంతం చేయలేక పోయింది. యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కమిషనర్‌గా పని చేశాడు. ఆ తర్వాత గోర్డాన్ బ్రౌన్ కేబినెట్లో బిజినెస్ సెక్రటరీగా చేరాడు. ఫస్ట్ సెక్రటరీ(ఉప ప్రధాన మంత్రి)గా పదోన్నతి కూడా పొందాడు. ఆయనకు దేవుడి ఆశీస్సులు, సాతాను శాపాలు... రెండూ ఉన్నట్టుంది. ఒకరు శిఖరం మీదకు చేర్చితే, మరొకరు పాతాళానికి లాగేస్తారు.నాకాయన తెలిసున్న రోజుల్లో ఇలాంటి ఆటు పోట్లు ఏవీ లేవు. అది 1980ల నాటి విషయం. ఆయన వయస్సు 30 పైన ఉంటుంది. మేం అప్పుడు లండన్ వీకెండ్ టెలివిజన్‌లో టీవీ ప్రొడ్యూసర్లుగా పని చేస్తున్నాం. బహుశా బ్రిటన్‌లో బాగా పేరు పొందిన ‘వీకెండ్ వరల్డ్’ కరెంట్ ఎఫైర్స్ అనే ప్రోగ్రామ్ చేసే వాళ్ళం. లెజెండరీ బ్రియాన్ వాల్డెన్ దానికి యాంకర్.ఆ రోజుల్లో పీటర్ పొడవుగా సన్నగా ఉండి కులీనుడిలా కనబడే వాడు. పీటర్ తాత క్లెమెంట్ అట్లీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నాడు. కొంతమంది పీటర్‌ను అహంభావి అనుకునేవారు. మితభాషి కావడంతో ఆ అపవాదు వచ్చి ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం... ఆయన అంత త్వరగా దగ్గరయ్యే మనిషి కాడు. చాలామందిని దూరంలో ఉంచేవాడు. అప్పట్లో జరిగిన ఒక సంగతి చెబుతాను. ఏదో వివరించే ప్రయత్నం చేస్తూ, ఆ ఉత్సాహంలో పీటర్ తన కుడి చేతిని విసురుగా కదిలించాడు. అంతే... అది కాస్తా కాఫీ కప్పును తాకింది. కాఫీ ఒలికిపోయింది. నేను రాస్తున్న స్క్రిప్ట్ తడిసిపోయింది. అతడు చేసింది ఘోర తప్పిదం. ప్రోగ్రామ్ ఎయిర్ అయ్యేందుకు ఎంతో సమయం లేదు.పీటర్ తక్షణం క్షమాపణలు చెప్పాడు. ఇరకాటంలో పడినందుకో, తన మీద తనకే వచ్చిన కోపంతోనో... ముఖం కందగడ్డ అయ్యింది. తనే టైప్ చేసి పెట్టాడు. పూర్తి చేసి ఇచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. టైప్ చేస్తూ కొన్ని మార్పులు కూడా చేశాడు. స్క్రిప్ట్ మరింత బాగా వచ్చింది. విజయం ఆయన్ను అత్యున్నత శిఖరాలకు చేర్చింది. అంత ఎత్తున నిలిచిన పీటర్‌ను నిశితంగా చూడగలిగినవారు, ఆయన ఆత్మీయ స్వభావం గుర్తించగలిగిన వారు... ఎంతమంది ఉంటారు? నేను మాత్రం ఆయన్ని ఆత్మీయ వ్యక్తిగానే గుర్తు చేసుకుంటాను. ఆయన ఎప్పటి లాగా ఉవ్వెత్తున ఎగిసి మరో విజయ శిఖరం అందుకుంటాడు... ఇది నా నమ్మకం. పీటర్‌ను మరోసారి అదృష్టం వరిస్తుందనీ, త్వరలోనే మేం కలుసుకుంటామనీ ఆశిస్తున్నాను.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భారత్‌పై విషం చిమ్మిన ట్రంప్ సలహాదారు.. మోదీ, పుతిన్, జిన్‌పింగ్ దోస్తీ టార్గెట్
వాషింగ్టన్: రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు పీటర్ విషం చిమ్మారు. రష్యా , చైనాలతో ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న సాన్నిహిత్యంపై నవారో పలు ప్రశ్నలు సంధించారు. ట్రంప్ సలహాదారు పీటర్ నవారో తరచూ భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారు. భారతదేశంలోని కొన్ని వర్గాలు ఈ రష్యన్ చమురు నుండి లాభార్జన చేస్తున్నాయని, ఫలితంగా సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని తాజాగా నవారో ఆరోపించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవారో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా, చైనాలతో పెరుగుతున్న సాన్నిహిత్యంపై ప్రశ్నించారు. ‘మోదీ గొప్ప నాయకుడు. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నేత.. అలాంటప్పుడు పుతిన్, షీ జిన్‌పింగ్ సరసన ఎందుకు నిలబడుతున్నారో అర్థం కావడంలేదు. ఈ విషయంలో ఏమి జరుగుతున్నదో భారత ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొంతమంది బ్రాహ్మణులు తమ సొంత ప్రయోజనాల కోసం సామాన్యులకు హాని చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగిపోవాలి’ అని వ్యాఖ్యానించారు. ‘Brahmins Profiteering...’: Trump Advisor Peter Navarro’s Shocker On India’s Russian Oil Purchaseshttps://t.co/cKaJH1LrnEThis the lowest level of comment..one could make .. in the International politics ….Or may be they are trying to divide us .. as they know our weakness..— Aby (@abyindya) September 1, 2025ఇదేవిధంగా గత ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు.. రష్యా నుండి భారతదేశ చమురు కొనుగోళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, అయితే ఆ తర్వాత భారత్ చమురు దిగుమతులను అనేక రెట్లు పెంచిందని నవారో ఆరోపించారు. భారత్.. రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసి, దానిని శుద్ధి చేసి, ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని పలు దేశాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నదని, ఇది రష్యా ‘యుద్ధ యంత్రాంగానికి’ బలాన్నిస్తుందని ఆరోపించారు. -
‘దైవ కణం’ ఉందన్న శాస్త్రవేత్త... కన్నుమూశాడు!
ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ (94) కన్నుమూశారు. విశ్వం ఎలా ఉద్భవించిందనేది వివరించడంలో సహాయపడే ‘హిగ్స్ బాసన్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పీటర్ హిగ్స్ అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 8న తన ఇంట్లో మరణించినట్లు స్కాటిష్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. హిగ్స్ బాసాన్ సిద్ధాంతానికి బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఇంగ్లెర్ట్‌తో కలిసి హిగ్స్ నోబెల్ అవార్డు అందుకున్నారు. యాభై ఏళ్లుగా స్కాటిష్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిగ్స్ మరణంతో భౌతిక శాస్త్ర ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందనడంలో సందేహం లేదు. హిగ్స్ గొప్ప అధ్యాపకుడని, యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాత అని స్కాటిష్ యూనివర్సిటీ పేర్కొంది. హిగ్స్ మహనీయుడని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పీటర్ మాథిసన్ అన్నారు. అతని దార్శనికత, ఊహా ప్రపంచం మన విజ్ఞానాన్ని సుసంపన్నం చేశాయని, వేలాది మంది శాస్త్రవేత్తలు అతని రచనల నుంచి ప్రేరణ పొందారని పేర్కొన్నారు. హిగ్స్ బాసన్ సిద్ధాంతం అంటే ఏమిటి? సుమారు 1300 కోట్ల ఏళ్ల క్రితం ఓ మహా విస్ఫోటంతో ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు చాలామంది అంగీకరించే సిద్ధాంతం. అయితే ఈ మహా విస్ఫోటం కచ్చితంగా ఎలా జరగింది? అణువులు, పరమాణువులు ఎలా పుట్టుకొచ్చాయి? ఆ తరువాతి క్రమంలో నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పాడ్డాయి అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశం. 1964లో పీటర్ హిగ్స్ మరో ఐదుగురు శాస్త్రవేత్తలతో కలిసి విశ్వ ఆవిర్బావ క్రమానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కణాలన్నింటికీ ద్రవ్యరాశిని సమకూర్చే కణం ఒకటి ఉందని ఆయన ప్రతిపాదించారు. విశ్వవ్యాప్తమైన ఒక క్షేత్రంలో (హిగ్స్ ఫీల్డ్)లో కదులుతూ ఈ బోసాన్ ఇతర కణాలకు ద్రవ్యరాశిని అందిస్తుందన్న ప్రతిపాదనపై హిగ్స్తోపాటు అనేక ఇతర శాస్త్రవేత్తలూ చాలా పరిశోధనలు చేశారు. అయినప్పటికీ ఈ కణం ఉనికి స్పష్టం కాకపోవడంతో దీన్ని ‘దైవ కణం’ అని పిలిచేవారు కూడా. ఈ దైవ కణం ఉనికిని గుర్తించేందుకు స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఓ భారీ పరిశోధన ఒకటి చేపట్టారు శాస్త్రవేత్తలు. వందల కోట్ల రూపాయల ఖర్చుతో భూగర్భంలో నిర్మించిన ప్రయోగశాలల ద్వారా అసలు ఈ హిగ్స్ బాసాన్ కణం ఉందా? లేదా? నిర్ధారించేందుకు ప్రయత్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫ్రిజరేటర్ కూడా ఉన్న ఈ ప్రయోగశాలలో రెండు ఫొటాన్లను కాంతి వేగంతో పరుగెత్తించి ఢీకొట్టించడం ఫలితంగా అతిసూక్ష్మ సమయంపాటు ఏర్పడే మహా విస్ఫోట కాలం నాటి పరిస్థితులను విశ్లేషించడం ద్వారా బాసాన్ ఉనికిని 2012లో నిర్ధారించగలిగారు కూడా. -
ప్రకృతి సిద్ధ వైద్యుల నేపథ్యంతో వస్తున్న 'బెల్'
ప్రొగన్ మూవీస్ పతాకంపై పీటర్ రాజ్ నిర్మించి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం 'బెల్'. వెంకట్ భువన్ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు గురుసోమసుందరమ్, శ్రీధర్ మాస్టర్, నితీష్ వీరా, దుర్గ, శ్వేతా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భరణీ కన్నన్ ఛాయాగ్రహణం, రాబర్ట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. (ఇది చదవండి: డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!) ఈ సందర్భంగా మంగళవారం చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు వెంకట్ భువన్ మాట్లాడుతూ చిత్రానికి నిర్మాతనే ముఖ్యమన్నారు. ఈ చిత్ర నిర్మాత పీటర్ రాజ్ తనకు మంచి మిత్రుడన్నారు. తాను చిత్రాన్ని నిర్మిస్తాను మీరు దర్శకత్వం వహించండి అని చెప్పడంతో ముందుగా కాస్త భయం అనిపించిందన్నారు. దీంతో కథపై దృష్టి పెట్టి చాలా పరిశోధనలు చేసి బెల్ చిత్ర కథను సిద్ధం చేసినట్లు చెప్పారు. పీటర్ రాజ్ ఈ చిత్రానికి నిర్మాత మాత్రమే కాకుండా, ఒక సహాయ దర్శకుడిగా తనతోనే ఉంటూ ఎంతగానో సహకరించారని చెప్పారు. ఇది ప్రకృతి సిద్ధ వైద్యుల నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రమని చెప్పారు. కాగా ఇందులో ప్రతి నాయకుడిగా ప్రధాన పాత్రను పోషించిన నటుడు గురు సోమసుందర్ మాట్లాడుతూ ఈ చిత్రం నిర్మాత పీటర్రాజ్కు పెట్టిన పెట్టుబడి తిరిగిరావాలన్నారు. చాలా పోటాన్షియల్ ఉన్న కథ కావడం, తన పాత్ర కొత్తగా ఉండటంతో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. చిత్ర సంగీతం కూడా బాగా వచ్చిందనీ, కచ్చితంగా బెల్ చిత్రం సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!) -
చనిపోయింది నా మూడో భర్త కాదు, నేను సంతోషంగా ఉన్నా: వనిత
నిత్యం ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో ఉండే వ్యక్తి నటి వనితా విజయ్ కుమార్. తండ్రితో ఆస్తి గొడవలు, ఫ్యామిలీకి దూరంగా ఉండటం, పెళ్లిళ్లు,-విడాకులు.. ఇలా ఏదో ఒక విధంగా తమిళనాట వార్తల్లో వనిత పేరు తరచూ వినిపిస్తుంది. వనితతో గతంలో రిలేషన్షిప్ మెయింటెన్ చేసిన పీటర్ పాల్ ఇటీవల కన్నుమూశాడు. దీంతో వనిత మూడో భర్త మరణించాడని తమిళ మీడియా రాసుకొచ్చింది. తాజాగా దీనిపై వనిత స్పందించింది. పీటర్‌తో తనకు చట్టప్రకారం పెళ్లి జరగలేదని కుండబద్ధలు కొట్టింది. 'పీటర్ పాల్‌తో నాకు న్యాయబద్ధంగా వివాహం జరగలేదు. కాకపోతే 2020లో మేము రిలేషన్షిప్లో ఉన్నాం. అదే ఏడాది విడిపోయాం కూడా! అతడు నా భర్త కాదు, నేను అతడికి భార్యను కాదు. నేనసలు వైవాహిక జీవితంలోనే లేను. ఏ విషయానికీ నేను బాధపడటం లేదు. సింగిల్‌గా జీవిస్తున్నా. సంతోషంగా బతుకుతున్నా' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. కాగా లాక్డౌన్లో వనిత, పీటర్ల పెళ్లి జరిగినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తనకు విడాకులివ్వకుండా పీటర్ మరో పెళ్లి చేసుకున్నట్లు అతడి మొదటి భార్య ఎలిజబెత్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. వనిత- పీటర్ల పెళ్లి చెల్లదని పేర్కొంది. కానీ కొంతకాలానికే వారు విడిపోయారు. ఆతర్వాత సింగిల్‌గా ఉన్న వనిత ఓసారి తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా పెద్ద దుమారమే చెలరేగింది. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం జోరుగా సాగింది. దీనిపై స్పందించిన వనిత.. ఇది కేవలం పికప్ డ్రాప్ సినిమాకు సంబంధించిన ఫోటో మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయినా ఒక మగవాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా పట్టించుకోని జనాలు ఆ పని మహిళ చేస్తే మాత్రం తప్పు పడుతున్నారు. నేను నాలుగు కాదు, 40 పెళ్లిళ్లు చేసుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం అని కొట్టిపారేసింది. కానీ ఇప్పుడేమో తనకసలు మూడో పెళ్లే జరగలేదని మాట్లాడటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. #VanithaVijayakumar & #PeterPaul Wedding Photos ❤️ #VanithaMarriage #VanithaWedding #VanithaVijayakumarMarriage ❤️ pic.twitter.com/ru1PRZBiOb — Happy Sharing By Dks (@Dksview) June 27, 2020 View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) చదవండి: స్టార్ హీరో విక్రమ్‌కు తీవ్ర గాయాలు -
వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పీటర్స్ మృతి
కడప కార్పొరేషన్ : కడప నగర పాలక సంస్థ 23వ డివిజన్ కార్పొరేటర్ జోసెఫ్ చంద్రభూషణం పీటర్స్ (71) మృతి చెందారు. కొంత కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేనత్త కుమారుడు పీటర్స్. 1947 నవంబర్ 23న ఎంఎస్ పీటర్, సుగుణమ్మ దంపతులకు జేసీబీ పీటర్స్ జన్మించారు. ఆయన కెమిస్ట్రీ అధ్యాపకునిగా పలమనేరు, జిల్లాలోని ప్రభుత్వ పురుషుల కళాశాలల్లో పని చేశారు. వైఎస్ఆర్ తొలిసారి మంత్రి పదవి చేపట్టినపుడు ఆయనకు వ్యక్తిగత సలహాదారునిగా పని చేశారు. తర్వాత వయోజన విద్య సహాయ సంచాలకులుగా, పులివెందుల, సింహాద్రిపురం కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. అనంతరం స్వచ్ఛందంగా పదవీ విరమణ పొంది, రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2005లో కడప నగర పాలక సంస్థ కో ఆప్షన్ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2014లో మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున 23వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. కో ఆప్షన్ సభ్యునిగా, కార్పొరేటర్‌గా ఆ ప్రాంత అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. పలువురి సంతాపం : కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా.. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారితోపాటు టీడీపీ నాయకులు పుత్తా నరసింహారెడ్డి, హరిప్రసాద్, గోవర్థన్‌రెడ్డి, సుభాన్‌బాషా, కార్పొరేటర్లు బోలా పద్మావతి, వైఎస్ఆర్సీపీ నగర అ««ధ్యక్షుడు పులి సునీల్ నివాళులు అర్పించారు. పీటర్స్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
మరోసారి కవలలకు జన్మనివ్వనున్న నటి!
ముంబై: నటి సెలీనా మరోసారి కవలలకు జన్మనివ్వబోతోంది. ఐదేళ్ల క్రితం తొలి కాన్పులో కవలలకు జన్మనిచ్చింది సెలీనా. వారికి విన్స్టన్, విరాజ్ అని పేర్లు పెట్టింది. తాజాగా భర్త పీటర్‌తో కలిసి దుబాయ్‌లోని ఓ ఆసుపత్రికి చెకప్ కోసం వెళ్లింది సెలీనా. ఆమెకు వైద్య పరీక్షల్లో భాగంగా ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తున్న సమయంలో ఈ సారి కూడా కవలలేనా? అని భర్త పీటర్ డాక్టర్‌ను ప్రశ్నించగా.. అవును! అని డాక్టర్ సమాధానం ఇచ్చారని సెలీనా తెలిపింది. ఆ మాట వినగానే భార్యభర్తలిద్దరూ ఒక్క క్షణంపాటు షాక్ తిన్నట్లు చెప్పింది. ఆ తర్వాత ఆనందంలో మునిగిపోయామని వివరించింది. త్వరలో ఓ యాడ్ షూట్ కోసం ఇండియా రానున్నట్లు వెల్లడించింది సెలీనా. -
ఇంద్రాణి, పీటర్‌పై హత్యాభియోగాలు
ముంబై: సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో విచారణకు వీలుగా ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జియా, సంజీవ్ ఖన్నాలపై సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం హత్యా నేరం కింద అభియోగాలు నమోదు చేసింది. ఈ ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120 (బి) (నేరపూరిత కుట్ర), 302 (హత్య), 364 (కిడ్నాప్), 203 (తప్పుడు సమాచారం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) ప్రకారం కేసు నమోదైంది. ఇవికాకుండా షీనా సోదరుడు మిఖాయిల్ బోరా హత్యకు కుట్ర పన్నినందుకు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాలపై ఐసీపీ 307 (హత్యాప్రయత్నం), 120 (బి) సెక్షన్ల ప్రకారం అదనంగా కేసు నమోదు చేశారు. ఈ కేసును ఫిబ్రవరి 1న విచారిస్తామని జడ్జి హెచ్ మహాజన్ తెలిపారు. కాగా, తనకు పీటర్ నుంచి విడాకులు కావాలని ఇంద్రాణి కోరగా.. ఈ విషయంలో కోర్టు చేయగలిగేది ఏమీ లేదని జడ్జి తెలిపారు. ఇంద్రాణి ముఖర్జియా తన కుమార్తె షీనాను 2012లో హత్య చేసి మృతదేహాన్ని రాయ్‌గడ్ జిల్లాలోని అడవుల్లో కాల్చివేసిన విషయం తెలిసిందే. -
షీనా హత్య కేసులో కీలక విషయాలు
దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీతో కలిసి పీటర్ ముఖర్జీ తన తనయుడు రాహుల్‌ను తప్పుదోవ పట్టించిన టేపులు బహిర్గతమయ్యాయి. షీనా అదృశ్యమైనప్పుడు రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు తండ్రి, పిన్నతల్లితో సంభాషించిన రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఈ రికార్డుల ద్వారా పీటర్ ముఖర్జీ కూడా షీనా హత్య కేసులో కుట్రదారుడేనని తేలింది. రాహుల్ ఈ సంభాషణలను తన బ్లాక్ బెర్రీ స్మార్ఫోన్లో రికార్డు చేశాడు. ఈ ఆధారాలే కేసు విచారణకు కీలకంగా మారాయి. మొదట ఈ టేపులను ఖార్ పోలీసులకు అనంతరం సీబీఐకు రాహుల్ సమర్పించాడు. రాహుల్ సమర్పించిన టేపుల సంభాషణలతో పీటర్‌కు ఈ హత్య, నేరపూరిత కుట్రలో భాగమున్నట్టు తేలింది. మొత్తం 20 రికార్డింగ్‌లో 7 టేపులు అవసరమైనవిగా, మిగతా 13 టేపులు కేసుకు సంబంధం లేనివిగా సీబీఐ అధికార ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్‌కు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. సీబీఐ విచారణలో ఈ టేపులను ఇప్పటికే కీలక ఆధారాలుగా పరిగణించినట్టు పేర్కొన్నారు. సంభాషణలో కొన్ని భాగాలు... పీటర్, రాహుల్ సంభాషణలో... షీనా గురించి తన తండ్రిని రాహుల్ అడిగాడు. కానీ తనకేమీ తెలియదని జవాబు ఇచ్చాడు. కానీ షీనా చివరి మెసేజ్ ఇంద్రాణికే పంపించిందని తెలియగానే, ఈ విషయంపై చర్చించడానికి గోవాకు రావాలని రాహుల్‌ను పీటర్ ఆదేశించాడు. షీనా ఎవరికీ చెప్పకుండా ఎటు వెళ్లదు. తను అలాంటి వ్యక్తి కాదు. షీనా కనిపించకుండా పోవడంపై కొంత బాధను రాహుల్ వ్యక్తపరిచాడు. ఎవరికీ టచ్ లేదు. కనీసం సోషల్ మీడియా అకౌంట్లలో కూడా యాక్టివ్‌గా లేదు. మరో టేపు సంభాషణ.. షీనా తన కంపెనీ హెచ్ఆర్ మేనేజర్‌కు కాంటాక్ట్‌లోనే ఉందని రాహుల్‌కు ఇంద్రాణి చెప్పింది. షీనా లీవ్ తీసుకుంటున్నట్టు హెచ్ఆర్ తెలిపినట్టు ఇంద్రాణి రాహుల్‌కు తెలిపింది. కానీ అధికారికంగా రాజీనామా చేయలేదని వెల్లడించింది. షీనా తన సెల్‌ఫోన్‌ను వాడితే తాము కనుక్కుంటామని పోలీసులు వెల్లడించినట్టు కూడా ఇంద్రాణి పేర్కొంది. నీ నుంచి విడిపోవాలని షీనా భావించిదేమో.. డబ్బున్న మరో వ్యక్తి తనకు దొరికాడేమో అని రాహుల్‌ను ఇంద్రాణి ఓదార్చింది.. తన దగ్గర్నుంచి కూడా డబ్బులు రాబట్టుకున్నాక అసలు కాంటాక్టులోనే లేకుండా పోయిందని ఇంద్రాణి నాటకాలు ఆడింది. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి వెళ్లింది. షీనాను మరచిపోవాలని రాహుల్‌కు పీటర్, ఇంద్రాణి సూచించారు. షీనా బోరా హత్య జరిగిన వెంటనే ఇంద్రాణి తన భర్త పీటర్‌కు ఫోన్ చేసినట్టు సీబీఐ దర్యాప్తులో కూడా వెల్లడైంది. షీనా, రాహుల్ ప్రేమను అటు ఇంద్రాణి, ఇటు పీటర్ వ్యతిరేకించారు. విడిపోయేందుకు ఇద్దరు అంగీకరించకపోవడంతో హత్య చేసినట్టు సీబీఐ గుర్తించింది. కన్న కూతురు హత్య కేసులో తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్రాయ్ను తొలుత అరెస్టు చేశారు. పీటర్ అమాయకుడని తొలుత భావించినప్పటికీ, హత్యలో పీటర్‌కు ప్రమేయం ఉన్నట్టు తాజా రికార్డులో కూడా వెల్లడైంది. 2012 ఏప్రిల్ 24న షీనా కనిపించకుండా అయింది. మూడేళ్ల తర్వాత ముంబై పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని అరెస్టు చేశారు. అనంతరం ఈ కుట్రలో భాగమైనందున పీటర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. షీనాను హత్య చేసేందుకు ఇంద్రాణి, పీటర్ ముందే కుట్ర చేశారని ఇంద్రాణి ముఖర్జీ మాజీ డ్రైవర్ శ్యామ్వార్ రాయ్ తన వాంగ్ములంలో తెలిపాడు. -
వందేళ్ల కవలలు
బెల్జియం : నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలని అందరూ కోరుకుంటారు. కాని మారుతున్న ఆహారపు అలవాట్లు, దానికి తోడు రకరకాల రోగాలు, కాలుష్యం వంటి కారణాలతో మనిషి జీవిత కాలం రానురానూ తగ్గిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 60 ఏళ్లు బతకడమే గగనమవుతోంది. అలాంటిది 100 ఏళ్లు బతకడమంటేనే ఆశ్చర్యం. కాని బెల్జియంకు చెందిన పీటర్, పౌలస్ లాంగ్రాక్ అనే ఇద్దరు కవల సోదరులు 103వ పడిలోకి అడుగుపెట్టారు. రెండు సంవత్సరాల్లో వీరు 105 ఏళ్లు బతికిన అమెరికాకు చెందిన కవల సోదరులు గ్లెన్, డేల్ మోయర్ రికార్డును బద్దలుగొట్టి, ప్రపంచంలోనే ఎక్కువ సంవత్సరాలు బతికిన కవలలుగా అవతరించబోతున్నారు. ఇప్పటికీ వారు ఒకరినొకరు వదిలి ఉండలేరు. అందుకే అన్నదమ్ములు పెళ్లి కూడా చేసుకోలేదు. వారు తమ పుట్టిన రోజును వారుండే నర్సింగ్ హోంలోనే ఆనందంగా జరుపుకున్నారు. వారి 103 ఏళ్ల అనుబంధాన్ని చూసి అన్నదమ్ములెవరైనా అసూయ పడాల్సిందే. -
దీని ‘దుంప’తెగ.. ఏం రేటు!!
ఈ బంగాళదుంప ఫొటోను చూస్తే సాదాసీదాగా కనిపిస్తోంది కదూ. కానీ ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫొటోల్లో ఒకటి. దీన్ని గతేడాది 10 లక్షల డాలర్లకు విక్రయించారు. కెవిన్ అబోస్ అనే ఫొటో గ్రాఫర్ దీన్ని చిత్రీకరించారు. ఆయన సిలికాన్ వ్యాలీ టెక్‌లోని ప్రముఖ వ్యాపారులకు ఫొటో షూట్ తీసి భారీ మొత్తంలో వసూలు చేస్తుంటాడు. ఒక ఫొటో షూట్ కోసం లక్షా 50 వేల డాలర్ల నుంచి అత్యధికంగా 5 లక్షల డాలర్ల వరకు తీసుకుంటాడు. ఇతనిలో దీంతో పాటు ఫైన్ ఆర్ట్ ఫొటో గ్రాఫర్(లలిత కళా ఛాయాకారుడు) కూడా దాగి ఉన్నాడు. దాని మూలంగానే ఈ ఫొటో రూపుదిద్దుకుంది. ఎన్ని రకాలుగా ఉన్నా మనుషులుగా గుర్తించవచ్చని.. అలాగే బంగాళదుంపలను కూడా అని.. అందుకే తనకు ఇవి ఇష్టమని ఆయన తెలిపాడు. కాగా, ఇలాంటి ఫొటోలను సేకరించే పీటర్ అనే ఒక సంపన్న వ్యక్తి 2015లో కెవిన్ ఇంటిని సందర్శించినప్పుడు ఈ బంగాళ దుంప ఫొటోను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం టాప్ 20 అత్యంత విలువైన ప్రారంభ కొనుగోలు ధరల్లో దీనికి చోటు లభించింది. - పారిస్ -
హోం ఫుడ్ తినేందుకు కోర్టు అనుమతి
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఇంద్రాణి ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాకు ఇంటి నుండి తీసుకొచ్చిన ఆహారాన్ని తీసుకోవడానికి శుక్రవారం కోర్టు అనుమతించింది. షీనా బోరా హత్య కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న ముఖర్జియాను నవంబర్ 19 న అరెస్టు చేసి సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన ఆర్థర్ రోడ్డులోని జైలులో ఉన్నారు. తనకు గుండె సంబంధిత సమస్యలున్నాయని, వృద్దాప్యంలో ఉన్నందున హోం ఫుడ్ తీసుకునేందుకు అనుమతించాలని కోరుతూ ముఖర్జియా కోర్టును అభ్యర్థించారు. అయితే ముఖర్జియా అభ్యర్థనను సీబీఐతో పాటు జైలు అధికారులు వ్యతిరేకించారు. ఆయనకు అవసరమైనటువంటి తక్కువ ఆయిల్‌తో వండిన అహారాన్ని తాము అందించగలమని కోర్టుకు తెలిపారు. కాగా, ముఖర్జియా అభ్యర్థనను మానవతా దృక్పథంతో ఆలోచించిన మేజిస్ట్రేట్ కోర్టు.. ఇంటి నుండి తీసుకువచ్చిన ఆహారాన్ని.. జైలు అధికారి పర్యవేక్షణలో తీసుకోవడానికి ఆయనకు అనుమతిచ్చింది. -
హర్యానా యువతిపై అత్యాచారం
హాలెండ్ వ్యక్తి అరెస్ట్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పీఎస్‌లో కేసు నమోదు నెట్ చాటింగ్‌లో పరిచయం 8 నెలలుగా అత్యాచారం చేశాడని ఫిర్యాదు దొడ్డబళ్లాపురం : హర్యానా చెందిన యువతిపై అత్యాచారం ఆపై మోసం చేసాడన్న ఆరోపణపై హాలెండ్‌కు చెందిన వ్యక్తిని ఇక్కడి కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని డచ్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ సంస్థలో డెరైక్టర్‌గా పని చేస్తున్న హాలెండ్‌కు చెందిన పీటర్(45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన యువతి (25) ఇతనిపై మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పీటర్‌ను బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించి డీసీపీ వికాస్ కుమార్ మాట్లాడుతూ... హర్యానాకు చెందిన యువతికి జనవరిలో నెట్ చాటింగ్ ద్వారా పీటర్ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో పీటర్ ఆమెను వివాహం చేసుకుంటానని బెంగళూరుకు రప్పించి, ఎయిర్ పోర్టు రోడ్డులో ఉన్న స్విస్టౌన్ రిసార్ట్‌లో కొన్నాళ్లు సహజీవనం చేశాడు. బాధితురాలు గర్భవతి కాగా, ఆమెను అబార్షన్ చేసుకోమని బెదిరించాడని, తన ను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి 8 నెలలుగా అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పీటర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.


