ఇంద్రాణి, పీటర్‌పై హత్యాభియోగాలు | Sheena Bora Case: Indrani, Peter Mukerjea Charged With Murder | Sakshi
Sakshi News home page

ఇంద్రాణి, పీటర్‌పై హత్యాభియోగాలు

Jan 18 2017 3:42 AM | Updated on Sep 5 2017 1:26 AM

ఇంద్రాణి, పీటర్‌పై హత్యాభియోగాలు

ఇంద్రాణి, పీటర్‌పై హత్యాభియోగాలు

సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో విచారణకు వీలుగా ఇంద్రాణి ముఖర్జియా, పీటర్‌ ముఖర్జియా, సంజీవ్‌ ఖన్నాలపై సీబీఐ ప్రత్యేక కోర్టు

ముంబై: సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో విచారణకు వీలుగా ఇంద్రాణి ముఖర్జియా, పీటర్‌ ముఖర్జియా, సంజీవ్‌ ఖన్నాలపై సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం హత్యా నేరం కింద అభియోగాలు నమోదు చేసింది. ఈ ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120 (బి) (నేరపూరిత కుట్ర), 302 (హత్య), 364 (కిడ్నాప్‌), 203 (తప్పుడు సమాచారం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) ప్రకారం కేసు నమోదైంది.

ఇవికాకుండా షీనా సోదరుడు మిఖాయిల్‌ బోరా హత్యకు కుట్ర పన్నినందుకు ఇంద్రాణి, సంజీవ్‌ ఖన్నాలపై ఐసీపీ 307 (హత్యాప్రయత్నం), 120 (బి) సెక్షన్ల ప్రకారం అదనంగా కేసు నమోదు చేశారు. ఈ కేసును ఫిబ్రవరి 1న విచారిస్తామని జడ్జి హెచ్‌ మహాజన్‌ తెలిపారు. కాగా, తనకు పీటర్‌ నుంచి విడాకులు కావాలని ఇంద్రాణి కోరగా.. ఈ విషయంలో కోర్టు చేయగలిగేది ఏమీ లేదని జడ్జి తెలిపారు. ఇంద్రాణి ముఖర్జియా తన కుమార్తె షీనాను 2012లో హత్య చేసి మృతదేహాన్ని రాయ్‌గడ్‌ జిల్లాలోని అడవుల్లో కాల్చివేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement