అమ్మ గొప్పతనాన్ని ఆవిష్క‌రించే ‘అమ్మ’ | Amma Short Film Release On This Date | Sakshi
Sakshi News home page

అమ్మ గొప్పతనాన్ని ఆవిష్క‌రించే ‘అమ్మ’

May 10 2025 11:32 AM | Updated on May 10 2025 11:56 AM

Amma Short Film Release On This Date

అమ్మ అంటే అనురాగం, ఆప్యాయత, నిస్వార్థ ప్రేమ. అలాంటి అమ్మ విలువను తెలియజేస్తూ రూపొందిన సందేశాత్మక షార్ట్ మూవీ ‘అమ్మ’. ఏఏఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో, ‘నాట్యమార్గం’ సహకారంతో తెరకెక్కిన ఈ చిత్రం మదర్స్ డే సందర్భంగా మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ నృత్యకారిణి అభినయశ్రీ ఇంద్రాణి దవలూరి ఈ చిత్రంలో ‘అమ్మ’ పాత్రలో మెప్పించనున్నారు. ఇంద్రాణి గతంలో నటించిన “అందెల రవమిది” చిత్రం విడుదలకు ముందే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా ‘అమ్మ’ షార్ట్ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తూ, “అమ్మ నిస్వార్థ ప్రేమను, త్యాగాన్ని చూపే హృదయస్పర్శి కథ ఈ చిత్రం” అని పేర్కొన్నారు.

ఈ షార్ట్ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం అందించిన హరీష్ బన్నాయ్ మాట్లాడుతూ, “అమ్మ మన కోసం కన్నీరు పెట్టినా, ఆమెకు మనం బాధ కలిగిస్తే ఆ వేదన ఎంత ఉంటుంది? కొవ్వొత్తిలా కరిగి మనకు దారి చూపే అమ్మకు మనం ఏమిచ్చి ఋణం తీర్చగలం? ఇదే మా చిత్రం సందేశం” అని తెలిపారు. 

చిత్రంలో ఇంద్రాణి దవలూరితో పాటు సాంబి, సుధా కొండపు, రీనా బొమ్మసాని తదితరులు నటించారు. కె.వి. భరద్వాజ్ సంగీతం సమకూర్చగా, కార్తీక్ కళ్లూరి సినిమాటోగ్రఫీ అందించారు. హరీష్ బన్నాయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ షార్ట్ మూవీ అమ్మ త్యాగం, గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల హృదయాలను తాకనుంది. విడుదలకు ముందే మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన ‘అమ్మ’ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement