
వాషింగ్టన్: రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు పీటర్ విషం చిమ్మారు. రష్యా , చైనాలతో ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న సాన్నిహిత్యంపై నవారో పలు ప్రశ్నలు సంధించారు.
ట్రంప్ సలహాదారు పీటర్ నవారో తరచూ భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారు. భారతదేశంలోని కొన్ని వర్గాలు ఈ రష్యన్ చమురు నుండి లాభార్జన చేస్తున్నాయని, ఫలితంగా సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని తాజాగా నవారో ఆరోపించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవారో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా, చైనాలతో పెరుగుతున్న సాన్నిహిత్యంపై ప్రశ్నించారు. ‘మోదీ గొప్ప నాయకుడు. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నేత.. అలాంటప్పుడు పుతిన్, షీ జిన్‌పింగ్ సరసన ఎందుకు నిలబడుతున్నారో అర్థం కావడంలేదు. ఈ విషయంలో ఏమి జరుగుతున్నదో భారత ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొంతమంది బ్రాహ్మణులు తమ సొంత ప్రయోజనాల కోసం సామాన్యులకు హాని చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగిపోవాలి’ అని వ్యాఖ్యానించారు.
‘Brahmins Profiteering...’: Trump Advisor Peter Navarro’s Shocker On India’s Russian Oil Purchaseshttps://t.co/cKaJH1LrnE
This the lowest level of comment..one could make .. in the International politics
….Or may be they are trying to divide us .. as they know our weakness..— Aby (@abyindya) September 1, 2025
ఇదేవిధంగా గత ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు.. రష్యా నుండి భారతదేశ చమురు కొనుగోళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, అయితే ఆ తర్వాత భారత్ చమురు దిగుమతులను అనేక రెట్లు పెంచిందని నవారో ఆరోపించారు. భారత్.. రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసి, దానిని శుద్ధి చేసి, ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని పలు దేశాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నదని, ఇది రష్యా ‘యుద్ధ యంత్రాంగానికి’ బలాన్నిస్తుందని ఆరోపించారు.