ahobilam
-
అహోబిలంలో ‘బీ ట్యాక్స్’!
ఆళ్లగడ్డ: దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో ‘బీ – ట్యాక్స్’ కోసం పచ్చముఠాలు అరాచకాలకు తెగబడుతున్నాయి. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు లాడ్జీలు, సత్రాల నిర్వాహకులను కప్పం కట్టాలంటూ వేధిస్తున్నారు. ముడుపుల కోసం మూడు నెలలుగా అధికార యంత్రాంగంతో రకరకాలుగా బెదిరించినా దారికి రాకపోవడంతో అహోబిలంలో లాడ్జీలకు మంగళవారం తెల్లవారుజామున కరెంట్ తొలగించారు. ఇదంతా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్ రెడ్‌బుక్ కుట్రలేనని స్థానికులు అంటున్నారు. బీ ట్యాక్స్ మాట్లాడుకోవాలంటూ.. అహోబిలం క్షేత్రం పరిధిలో సొంత పట్టా పొలాలు లేవు. అయినప్పటికీ సుమారు 50 సంవత్సరాలుగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అహోబిలంలో చిన్న, పెద్ద లాడ్జీలు, సత్రాలు కలిపి సుమారు 100 వరకు నిరి్మంచుకుని పలువురు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీటిపై కన్నేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ‘బీ ట్యాక్స్’ వసూలు బాధ్యతను ‘వలస తమ్ముడు’ గుంటూరు శ్రీనుకు అప్పగించారు. తొలుత పంచాయతీ సెక్రటరీ ద్వారా లాడ్జీల నిర్వాహకులకు నోటీసులు ఇప్పించారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న తమకు ఇప్పుడు నోటీసులు ఏమిటని వారు తెల్లబోవడంతో ‘అన్న’ దగ్గరకు వెళ్లి బీ ట్యాక్స్ గురించి మాట్లాడుకోవాలని సలహా ఇచ్చారు. అయినా దారికి రాకపోవడంతో అధికారులతో సర్వే చేయించారు. అహోబిలంలో ఒక్కో లాడ్జీ నుంచి రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేయవచ్చని ‘బీ’ గ్యాంగ్ భావించింది. అయితే ఎంత బెదిరించినా దారికి రాకపోవడంతో లాడ్జీలకు కరెంట్ కట్ చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆందోళనకు గురైన లైన్మెన్ సెలవుపై వెళ్లిపోగా అధికారులు ఆళ్లగడ్డ నుంచి ప్రైవేటు సిబ్బందిని రప్పించి మూడు నాలుగు లాడ్జీలకు కరెంట్ కట్ చేశారు. ఈలోగా తెల్లవారడం, స్థానికులు తిరగబడటంతో విద్యుత్ అధికారులు జారుకున్నారు. 20 ఏళ్లుగా మీటర్లు ఏర్పాటు చేసుకుని ప్రతి నెలా సక్రమంగా బిల్లులు కడుతుంటే కనెక్షన్లు ఎలా తొలగిస్తారంటూ లాడ్జీల నిర్వాహకులు విద్యుత్ అధికారులను నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ‘అహోబిలంలో అనుమతులు లేకుండా లాడ్జీలు నిర్మించుకున్నారని, విద్యుత్ కనెక్షన్ కట్ చేయాలని పంచాయతీ సెక్రటరీ మాకు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి డీఈఈ ఆదేశాలతో కట్ చేశాం’ అని ఏఈ వెంకటకృష్ణ చెప్పారు. -
టూరిస్ట్ ప్రాంతంగా మారిన పెన్నఅహోబిలం
-
ఎండకు ఎండి.. వానకు తడిసి..
ఇవన్నీ కాకతీయుల కాలంలో అద్భుత నైపుణ్యంతో చెక్కిన శిల్పాలు. దాదాపు ఎనిమిది వందల ఏళ్లక్రితం రూపుదిద్దుకున్న అపురూప శిల్పాలు ఇప్పుడు ఇలా అవగాహనలేమితో నిర్లక్ష్యానికి గురై ధ్వంసమవుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామంలోని అతి పురాతన శంభుదేవుని ఆలయం ప్రాంగణంలోని శిథిల కోనేరు గట్టునానుకుని వీటిని ఇలా పడేశారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, నజీరుద్దీన్‌లు ఇచ్చిన సమాచారంతో, వారితో కలిసి పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆదివారం వాటిని పరిశీలించారు. దేవాలయ నిర్వాహకులతో చర్చించి వాటిని ఆలయం మండపంలో ఏర్పాటు చేసి, వాటి కాలానికి సంబంధించిన నామఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అరుదుగా ఉండే రెండంతస్తుల కాకతీయ మండపానికి అనుకుని ఇతర నిర్మాణాలు చేపట్టి దాని చారిత్రక ప్రాశస్త్యం కోల్పేయేలా చేయటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో బాదామీ చాళుక్యుల కాలం ఏడో శతాబ్దినాటి శివలింగం, నాగ ప్రతిమలు, 11వ శతాబ్ది నాటి పార్శ్వనాథుడి జైన విగ్రహం, 1296 నాటి కాకతీయ ప్రతాపరుద్రుని శాసనం ఉన్నాయి. -
అహోబిలం రిజర్వాయర్‌కు ‘జియోమెంబ్రేన్’ చికిత్స
సాక్షి, అమరావతి: నిర్మాణ లోపాల కారణంగా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) స్పిల్‌వే నుంచి భారీగా నీరు లీకవుతోంది. సీపేజీ, లీకేజీల వల్ల ఆ రిజర్వాయర్ భద్రతకే ముప్పు పొంచి ఉండటంతో అందులో సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 11.1 టీఎంసీలు కాగా.. గరిష్టంగా 4.11 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచడం లేదు. దీంతో అటు ఆయకట్టుకు సాగునీరు.. ఇటు తాగునీటి అవసరాలను తీర్చలేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్పిల్‌వే, మట్టి కట్టలలో చిల్లులను ‘జియోమెంబ్రేన్ షీట్ల’తో పూడ్చటం ద్వారా 11.1 టీఎంసీలు నిల్వ చేసి అనంతపురం జిల్లాకు మరింత జలభద్రత చేకూర్చాలని నిర్ణయించింది. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ)లో అంతర్భాగంగా పెన్నా నదిపై అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు వద్ద 11.10 టీఎంసీల సామర్థ్యంతో పీఏబీఆర్‌ను నిర్మించారు. కాలువ ద్వారా 50 వేలు, యాడికి కెనాల్ వ్యవస్థ ద్వారా మరో 50 వేలు కలిపి మొత్తం లక్ష ఎకరాలకు నీళ్లందించేలా ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. స్పిల్‌వే నిండా చిల్లులే.. పీఏబీఆర్ స్పిల్‌వే పొడవు 101.44 మీటర్లు. మట్టికట్ట పొడవు 1,920 మీటర్లు. రిజర్వాయర్ వద్ద పెన్నా నది గర్భం 400 మీటర్లు. రిజర్వాయర్ స్పిల్‌వే ఎత్తు 446 మీటర్లు. ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని లోపాల పుట్టగా నీటి పారుదల నిపుణులు, జల వనరుల శాఖ అధికారులు అభివరి్ణస్తున్నారు. స్పిల్‌వే నిండా చిల్లులే ఉండటంతో రిజర్వాయర్‌లో ఏనాడూ గరిష్టంగా> నీటిని నిల్వ చేయలేని దుస్థితి. కోట్లాది రూపాయలు వెచి్చంచి గ్రౌటింగ్ (స్పిల్ వే ఎగువన బోర్లు వేసి అధిక ఒత్తిడితో సిమెంట్, కాంక్రీట్ మిశ్రమాన్ని పంపి.. చిల్లులను పూడ్చటం) చేసినా చిల్లులు పూడలేదు. లీకేజీలు, సీపేజీ తగ్గలేదు. దాంతో రిజర్వాయర్ భద్రత దృష్ట్యా గరిష్టంగా 4.11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. దీనివల్ల ఆయకట్టుకు నీళ్లందటం లేదు. అనంతపురం నగరంతోపాటు జిల్లాలో అధిక శాతం పట్టణాలు, గ్రామాలకు తాగునీటిని అందించే పథకాలు ఈ రిజర్వాయర్‌పైనే ఆధారపడ్డాయి. సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయకపోవడం వల్ల తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడింది. రిజర్వాయర్‌కు పునరుజ్జీవం తమిళనాడులో కడంపరై డ్యామ్, కర్ణాటకలో కృష్ణ రాజసాగర్ డ్యామ్‌లలో సీపేజీ, లీకేజీలను జియోమెంబ్రేన్ షీట్లు వేయడం ద్వారా తగ్గించారు. ఈ నేపథ్యంలో పీఏబీఆర్‌కు జియోమెంబ్రేన్ షీట్లను వేసి, లీకేజీలను అరికట్టాలన్న జల వనరుల శాఖ ప్రతిపాదనకు సర్కార్ ఆమోద ముద్ర వేసింది. అత్యంత పటిష్టమైన జియోమెంబ్రేన్ షీట్లను అధిక ఒత్తిడితో స్పిల్‌వే, మట్టి కట్టలకు ఎగువన భూమిలోకి దించుతారు. వాటి పునాది స్థాయి కంటే దిగువకు దించుతారు. ఈ షీట్లతో స్పిల్‌వేకు తొడుగు వేస్తారు. దాంతో లీకేజీలు, సీపేజీలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. అప్పుడు పీఏబీఆర్‌లో పూర్తి స్థాయిలో 11.1 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం అవుతుంది. చదవండి: ‘ఎంత కృతజ్ఙత లేని వాడివి నీవు.. చంద్రం’ ఏం జరిగిందో ఏమో.. యువతి అనుమానాస్పద మృతి -
ఇదేంటి గోవిందా!
అహోబిలం (ఆళ్లగడ్డ): దేశంలోని 108 వైష్ణవ క్షేత్రాల్లో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పేరుగాంచిన అహోబిలంలో దేవస్థాన, మఠం ప్రతినిధుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి . భక్తులు హారతి పల్లెంలో వేసిన డబ్బులో భాగం కావాలని దేవస్థానం అటెండర్ హుకుం జారీ చేశాడు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఇస్తామని కొందరు అర్చకులు ఎదురు తిరగగా హారతి పల్లెంలోని డబ్బులన్నీ తీసి హుండీలో వేసేటట్లు చక్రం తిప్పాడు. దీంతో ఒకనొక దశలో అర్చకులందరూ విధులు బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఇవన్నీ ఓ ఎత్తైతే దేవస్థాన ఈఓ చెక్‌పవర్ పూర్తిగా మఠం ప్రతినిధి చేతిలోకి వెళ్లి పోయింది. సిబ్బంది జీతాల మొదలు దేవస్థాన పరిధిలో ఏ ఖర్చు పెట్టాలన్నా మఠం ప్రతినిదే చెక్కు ఇవ్వాలి. దీనిని అవమానంగా భావించిన దేవస్థానం అధికారులు మఠం ప్రతినిధులపై కక్షగట్టినట్టు సమాచారం. దీంతో ఇరువురు మధ్య పంతాలు, పట్టింపులు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఎప్పటిలాగే వైకుంఠ ఏకాదశి అయిన మంగళవారం పల్లకీ మోసే బోయలకు ఈసారి ఈఓ తాఖీదు పంపలేదు. దీంతో వారు స్వామి పల్లకీని మోయమని నిరసనకు దిగారు. ఈ విషయం మంత్రి భూమా అఖిలప్రియ దృష్టికి వెళ్లగా ఆమె ఈఓను పిలిచి గట్టిగా మందలించింది. అయినా, ఈఓ వ్యవహర తీరులో మార్పు కనిపించకపోవడంతో బోయలు స్వామి పల్లకీని మోయమని భీష్మించుకొని కూర్చున్నారు. చివరకు మఠం ప్రతినిధి జోక్యం చేసుకుని తాఖీదు పై సంతకం పెట్టిస్తానని వారికి ఒప్పించాడు. మీరు చెబితే నేనెందుకు తాఖీదు ఇస్తా మీరే (మఠం తరపున) ఇచ్చుకోండని ఈఓ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మఠం ప్రతినిధి మంగళవారం అహోబిలం వచ్చి న కలెక్టర్ సత్యనారాయణకు జరిగిన విషయం చెప్పబోయాడు. పక్కనే ఉన్న ఈఓ అడ్డుపడగా ఆగ్రహించిన మఠం ప్రతినిధి నీవు అంతా ఫ్రాడ్ చేస్తున్నావని అన్నాడు. దీనికి ఈఓ ‘నేను ఫ్రాడే చేస్తాను’ అని కలెక్టర్, ఇతర అధికారుల ఎదుటే గట్టిగా అనడంతో పక్కనున్న వారికి కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కలెక్టర్ ముందే ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని అక్కడే ఉన్న ఆళ్లగడ్డ తహసీల్దార్ ఈఓను సున్నితంగా మందలించారు. కోర్టును ఆశ్రయించిన మఠం ప్రతినిధులు! అహోబిల క్షేత్రం పూర్తి పర్యవేక్షణ, అధికారాలు తమకే ఇవ్వాలని అహోబిల మఠం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అహోబిలంలో రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖల అధికారులు ఉండకూదని కోర్టులో పిటిషన్ వేసినట్లు సమాచారం. ఇదే జరిగి పూర్తి బాధ్యతలు, పర్యవేక్షణ అధికారాలు అంతా మఠానికి అప్పగిస్తే పరిపాలనంతా తమిళనాడు నుంచి కొనసాగుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెక్ పవర్ కోసం విశ్వప్రయత్నం.. దేవస్థాన పరిధిలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు, సిబ్బంది జీతాలు అన్నింటికి చెక్ రాసిచ్చేది మఠం పీఠాధిపతి అయినప్పటికీ అ డబ్బులు బ్యాంకులో జమ చేసిన తరువాత ఎవరికి ఎంతివ్వాలి అన్నది ఈఓ పరిధిలో ఉంటుంది. కొంతకాలంగా ఈ పవర్ కూడా మఠం ప్రతినిధి చేతిలోకే వెళ్లడంతో ఈఓ కేవలం పర్యవేక్షణకే పరిమితమయ్యాడు. ఎలాగైనా మఠం ప్రతినిధుల చేతుల్లోకి పోయిన చెక్‌పవర్ తిరిగి పొందాలని దేవదాయ శాఖ ఆధ్వర్యంలో విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నివురుగప్పిన నిప్పులా అహోబిలం అర్చకులు, సిబ్బంది ఎవరికి వారు యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తుండటంతో పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు తెగబడుతున్నారు. చివరకు దేవస్థానం రహస్యాలు సైతం బయటకు పొక్కుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. -
అర్చకులపై అటెండర్ పెత్తనం!
ఆళ్లగడ్డ: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో ఓ అటెండర్..అర్చకులపై పెత్తనం చెలాయిస్తున్నాడు. భక్తులు దయతలచి హారతి పళ్లెంలో వేసే కానుకుల్లో వాటా కావాలని పట్టుబడుతున్నాడు. వాటా ఇవ్వని పక్షంలో కక్ష గట్టి అర్చకులను వేధిస్తున్నాడు. హారతి పళ్లెంలో వేసే కానుకలను గుడిలో విధులు నిర్వహించే అర్చకుడు, పరిచారకులు ఇద్దరు సగం, సగం పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పంపకాల్లో కొంత మొత్తం (రూ. 100 వరకు ) అక్కడ ఆ రోజు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఇస్తారు. అయితే ఈ మధ్యకాలంలో కానుకలు బాగా వస్తున్నాయని మంత్రి అనుచరుడిగా చెప్పుకుంటున్న ఓ అటెండర్ కొందరు సిబ్బందితో కలిసి ఆలయ అధికారికి ఆశలు రేకెత్తించారు. అధికారుల తరఫున ఆ అటెండర్.. అర్చకుల దగ్గరకు వెళ్లి ఇక మీదట కానుకలు మూడు భాగాలు చేయాలని అందులో ఒక భాగం తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరు అర్చకులు అడ్డుచెప్పడంతో హారతి పళ్లెంలో వేసే కానుకలు అన్నీ హుండీలో వేయిస్తున్నారు. అంతే కాకుండా ప్రసాదాల తయారీకి అందించే నిధుల్లో భారీగా కోతలు విధించారు. దీంతో పూర్వం నుంచి చేస్తున్న ఆచార వ్యవహారాలు కొనసాగించలేక పోతున్నామని కొంతమంది అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర సరుకులతోనే ప్రసాదాలు తయారు చేసి స్వామికి నివేదిస్తూ, ఉభయదారులకు సర్దుతున్నారు. ఇంత జరుగుతున్నా మఠం ప్రతినిధులు పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఆందోళనకు సిద్ధమవుతున్న అర్చకులు ఎన్నడూ లేని విధంగా ఓ అటెండర్ పెత్తనం చలాయిస్తూ ఉండడంతో అర్చకులంతా మూకుమ్మడి నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అర్చకులందరూ సంతకాలు చేసి రాతపూర్వకంగా అహోబిలం మఠం ప్రతినిధి సంపత్‌కు ఫిర్యాదు కూడా చేశారు. చర్యలు తీసుకోకపోతే వైదిక కార్యక్రమాలు నిలిపి గుడి ఎదుట నిరసనకు దిగాలని సమాయత్తమవుతున్నారు. ఖర్చు ఎక్కువ అవుతోంది కల్యాణం నిర్వహించే సమయంలో భక్తులు రూ.800తో కేసరి టికెట్ తీసుకుంటున్నారు. దేవస్థానానికి రూ. 2300 ఖర్చు అవుతోంది. దీంతో నష్టం వస్తుందని రూ. 800 మేరకు సరిపోయే సరుకులు మాత్రమే ఇస్తున్నాం. – కామేశ్వరి, అహోబిలం ఈఓ -
అహోబిలంలో బాలాలయ ప్రతిష్ట
- శ్రీజ్వాలానృసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ అహోబిలం(ఆళ్లగడ్డ): ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలంలో సోమవారం బాలాలయ ప్రతిష్ట మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ జ్వాలానరసింహస్వామి, చెంచులక్ష్మీ, శ్రీదేవి అమ్మవార్లు కొలువైన గుడి జీర్ణోద్ధరణ పనులను సోమవారం ప్రారంభించారు. గుడి జీర్ణోద్దరణ పనులకు ముందు బాలాలయ ప్రతిష్ట నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఉదయం నిత్యపూజలతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపి దివ్యదర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సహీత శ్రీలక్ష్మీనరసింహస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. అర్చన, అభిషేకాది పూజల అనంతరం ప్రత్యేక మండపంలో కొలువుంచారు. వేద మంత్రోచ్చారణల మధ్య పీఠాధిపతి శ్రీమాన్ శఠకోప రంగారాజ యత్రీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో హోమం, పున్యాహవచనం, మృత్యుసంగ్రహనం, అంకురార్పణ, చిత్ర ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారి గోపుర విమానప్రయాన పనులు చేపట్టారు. కార్యక్రమంలో ఈఓ కామేశ్వరి, ముద్రకర్త వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయన్, వేద పండితులు పాల్గొన్నారు -
కనులపండువగా సుదర్శన జయంతి
– వేద పండితుల ఆధ్వర్యంలో సుదర్శన హోమం, అభిషేకం – భారీగా తరలి వచ్చిన భక్తులు అహోబిలం (ఆళ్లగడ్డ) : సుదర్శన జయంతి మహోత్సవం ఆదివారం అహోబిల క్షేత్రంలో వైభవంగా జరిగింది. ఎగువ అహోబిలంలో కొలువైన ఉత్సవమూర్తులైన జ్వాలనరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి, చెంచులక్ష్మీ అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి దేవాలయం ఎదురుగా కొలువుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి అమ్మవారికి ఎదురుట పండితులు వేద మంత్రోచ్ఛారణలతో సుదర్శన హోమం నిర్వహించారు. అంతకుముందు ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో నవకలశ పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఉత్సవమూర్తి సుదర్శనమూర్తిని కొలువుంచి నవకలశస్తాపన, గంధాబిషేకం, తిరుమంజనం నిర్వహించి స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో కొలువైన వెండి సుదర్శనమూర్తి ప్రతిమ (సుదర్శ చక్రం)కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సుదర్శన హోమం ప్రత్యేకత సాధారణంగా లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకుని ప్రతి నెల స్వాతి రోజు సుదర్శన హోమం నిర్వహించడం సాంప్రదాయం. అయితే ఏడాదికి ఒకసారి ఆషాడమాసంలో వచ్చే స్వాతి నక్షత్రానికి ముందు రోజైన చిత్తా నక్షత్రం రోజున సుదర్శనమూర్తి జయంతి కావడంతో సుదర్శన హోమం నిర్వహిస్తారు. సుదర్శనమూర్తి ఆరు చేతులతో ఆరు రకాల ఆయుధాలతో వైష్ణవ దేవుళ్లను రక్షిస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి. సుదర్శనమూర్తికి ఆదిదేవుడు లక్ష్మీనరసింహస్వామి గురువు కావడంతో ప్రతి స్వాతి వేడుకల్లో సుదర్శన హోమం చేస్తుంటారు. స్వామి సేవలో ఎమ్మెల్సీ గంగుల సుదర్శన జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పాల్గొని స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదల్లో భాగంగా ఎమ్మెల్సీకి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధానార్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వాదం అందజేశారు. ఈయన వెంట గంగుల బిజేంధ్రారెడ్డి, కెడీసీసీ బ్యాంకు డైరెక్టర్ నాసారి వెంకటేశ్వర్లు, సింగం భరత్‌రెడ్డి, కందుకూరు శ్రీను ఉన్నారు. నేడు దిగువ అహోబిలంలో స్వాతి మహోత్సవాలు : దిగువ అహోబిలంలో సోమవారం స్వాతి నక్షత్రం సందర్భంగా వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు జేష్టాభిషేకం, గరుడ సేవ కార్యక్రమాల అనంతరం స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, హోమాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. -
అహోబిలేసుని సన్నిధిలో కేంద్ర మంత్రి
ఆళ్లగడ్డ: అహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కేంద్ర రసాయనిక ఎరువుల శాఖ మంత్రి ఆనంద్‌బాబు బుధవారం దర్శించుకున్నారు. హెలికాప్టర్లో కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయనకు దిగువ అహోబిలంలో ఆలయ ప్రతినిధులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. దిగువన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయప్రతినిధులు తీర్థ ప్రసాదాలు, స్వామి వారి జ్ఞాపికను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఎగువ అహోబిలం చేరుకుని శ్రీ జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. తరా్వత కేంద్రమంత్రి బెంగళూరు బయలు దేరి వెళ్లారు. -
జయంత్యుత్సవం..నారసింహుని వైభవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక మండపంలో ఉత్సవమూర్తులను కొలువుంచి అర్చన, అభిషేకాలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను నూతన పట్టువస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సోమవారం రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఈశ్వరప్ప.. నరసింహ స్వామి జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. -
ఘనంగా నరసింహ స్వామి జయంత్యుత్సవాలు
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం లో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురష్కరించుకుని దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుంచి అర్చన, అభిషేకాలు, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవ పల్లకిలో కూర్చోబెట్టి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. -
ఘనంగా నృసింహ స్వామి జయంతోత్సవాలు
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం దిగువ అహోబిలంలో వెలసిన ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాదవరస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను కొలువుంచి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తిరమంజనం నిర్వహించి స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామి, అమ్మవార్లను కొలువుంచి మాఢ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈనెల 9వ తేదీ వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. -
వైభవంగా నృసింహ జయంతి
ఆళ్లగడ్డ : అహోబిల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు శనివారం నుంచి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మమార్లను కొలువుంచి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తిరమంజనం నిర్వహించి స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ ఉత్సవాలు రోజుకో రకంగా ఈ నెల 9 వరకు వైభవోపేతంగా నిర్వహిస్తామని ఆలయ వర్గాలు తెలిపాయి. -
వైభవోపేతంగా వసంతోత్సవం
– అశ్వవాహనంపై ప్రహ్లాదవరదుడు అహోబిలం(ఆళ్లగడ్డ): అహోబిలేశుడి వసంతోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు సోమవారం అశ్వవాహన ఉత్సవంతో ముగిశాయి. సోమవారం తెల్లవారు జామున దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాదవరద స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి దివ్య దర్శనం అనంతరం నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాదవరదస్వాములను వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ వసంత మండపం వద్దకు ఊరేగింపుగా చేర్చారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువుంచి వేద పండితులు స్వామి, అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో తిరుమంజనం నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో విహరింపజేశారు. రాత్రి ప్రహ్లాదవరద స్వామి అశ్వవాహనంపై భక్తులను ఆశీర్వదించారు. వసంతోత్సవంలో స్వామి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
మందులోకి చికెన్ తక్కువైందని..
-మద్యం మత్తులో దాడి చేసుకున్నఅటవీ సిబ్బంది -ఒకరి పరిస్థితి విషమం -విషయం బయటకు రాకుండా అధికారుల గోప్యం అహోబిలం: అందరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నారు. అందుకోసం మద్యం, చికెన్ తెచ్చుకున్నారు. పార్టీ చేసుకునూ క్రమంలో చికెన్ ముక్కలు తక్కువయ్యాయి. దీంతో తాగిన మత్తులో ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన కర్నూలు జిల్లా అహోబిలంలో చోటు చేసుకుంది. ఈ ఘటన నియోజవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అహోబిలం అటవీ కార్యాయంలో సిబ్బంది, అధికారులకు ఎప్పుడు వీలైతే అప్పుడు పార్టీలు చేసుకోవడం పరిపాటి. ఈ క్రమంలో శుక్రవారం కూడా సిబ్బంది అందరూ కలిసి ఎంజాయ్ చేయాలనుకున్నారు. దీంతో మద్యం, చికెన్ తెచ్చుకుని కార్యాలయంలో మద్యం సేవించారు. అంతలో మద్యం చాలక పోవడంతో మదార్ అనే సిబ్బంది షాపుకు వెళ్లాడు. అతను వచ్చేలోపు మద్యం సేవిస్తున్న వారు చికెన్ తిన్నారు. అంతలో మద్యంతో వచ్చిన మదార్ తనకు చికెన్ లేదని అక్కుడున్న సిబ్బందిని, అధికారులను దుర్భాషలాడాడు. దీంతో మాట మాట పెరిగి సిబ్బంది రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు అరుపులు కేకలు చేసుకుంటూ దాడులు చేసుకున్నారు. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఓ వర్గం కార్యాలయంలో ఉన్న కర్ర (బడె) తీసుకుని మదార్ పై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరు వర్గాలు మదార్ మృతి చెందాడని అక్కడ నుంచి పరుగులు తీశారు. కానీ మదార్ కదలడంతో పక్కనున్న వారు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం. పరుగులు తీసిన ప్రజలు, భక్తులు ప్రభుత్వ అటవీ కార్యాలయంలో ఒక్క సారిగా సిబ్బంది కేకలు వినిపించడం, అసహ్యంగా బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అంతే కాకుండా కార్యాలయం నుంచి బయటకు వచ్చి రోడ్ల వెంట పరుగులు తీశారు. దీంతో అటవీ సిబ్బందిని చూసిన ప్రజలు, దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఏం జరుగుతుందో అర్థంకాక భయంతో పరుగులు తీశారు. సుమారు అరగంట పాటు అక్కడ యుద్దవాతారణం తలపించినట్లు స్థానికులు చెపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి మద్యం మత్తులో ఇలా తన్నుకోవడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరిగినట్టు తెలియదు నేను రెండు రోజుల నుంచి సెలవులో ఉన్నాను. అహోబిలంలో జరిగిన సంఘటన నా దృష్టికి వచ్చింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో గాయాలై హాస్పిటల్ కు వెళ్లినట్టు తెలియదు. మద్యం మత్తు ఎక్కువై అపస్మారకస్థితిలో ఉన్న ఓ అధికారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించిన్టటు నా దృష్టికి వచ్చింది. దాడి చేసుకున్నట్టు నాకు తెలియదు. అటువంటిది ఏదైనా జరిగి ఉంటే విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. - రాంసింగ్, అటవీ రేంజ్ అధికారి -
తలనీలాల టెండరు వాయిదా
కర్నూలు(న్యూసిటీ): ఆళ్లగడ్డ మండలం అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి సంబంధించిన తలనీలాల టెండరు కమ్ బహిరంగ వేలం పాటలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం గురువారం కృష్ణానగర్‌లోని ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో గురువారం వేలంపాటలు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్లు కుమ్మక్కై తక్కువ ధరకు పాట పాడారు. గత ఏడాది రూ.1,30,50,000 పలుకగా గురువారం జరిగిన వేలం పాటలో కేవలం రూ.75 లక్షలకు పాడారు. దీంతో అధికారులు టెండర్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయశాఖ కార్యనిర్వహణాధికారులు సి.వెంకటేశ్వర్లు, జి.మల్లికార్జున ప్రసాద్, కృష్ణ, అహోబిలం మఠం అ«ధికారులు లక్ష్మీనారాయణ, ఓబులేష్, శివప్రసాద్, దేవస్థానం సిబ్బంది శివకృష్ణ, ఏఈ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్ రఘురామ్, కాంట్రాక్టర్లు వెంకటేశ్వరమ్మ, ఏసీ నరసింహులు, వెంకటేశ్వర్లు, ఎస్.నారాయణ, ఎ.నరసింహులు, సురేష్‌కుమార్, చిన్నరమణగౌడ్, ఎ.రామయ్య, 4వ పట్టణ పోలీసు స్టేషన్ ఎస్ఐ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
దేశ సంచారానికి బయలు దేరిన పీఠాధిపతి
ఆళ్లగడ్డ: అహోబిలం దేవస్థాన పీఠాథిపతి శ్రీ శఠగోప రంగరాజ యతీంద్ర మహాదేశికన్ దేశ సంచారం చేసేందుకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి గురించి ప్రచారం నిర్వహించడంతో పాటు వివిధ దేశాల్లో ఉన్న భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించేందుకు స్వామి ఉత్సవ విగ్రహంతో పీఠాధిపతి సంచారం చేయడం ఆనవాయితీ. బయలుదేరడానికి ముందు ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠంలో ఉన్న శిష్యులు, భక్తులకు ఆశీర్వదాలు అందజేశారు . -
శోభాయమానం... శ్రీవారి తెప్పోత్సవం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలం క్షేత్రంలోని భూదేవి, లక్ష్మీసమేతుడైన శ్రీ ప్రహ్లాదవరద స్వామి తెప్పోత్సవం మంగళవారం వైభవంగా కొనసాగింది. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా స్వామి, అమ్మవారు సేద తీరేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దిగువ అహోబిలం దేవస్థాన పరిధిలో ఉన్న కోనేటిలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ ప్రహ్లాదవరదస్వామి తెప్పను అధిరోహించి మూడు మార్లు ప్రదక్షణ చేశారు. అంతకు ముందు ఆలయం నుంచి ఉత్సవమూర్తులైన స్వామి, అమ్మవార్లను ప్రత్యేక పల్లకీపై మాడ వీధుల్లో ఊరేగింపుగా కోనేటి వరకు తీసుకొచా్చరు. స్వామి, అమ్మవారు తెప్పను అధిరోహించి పీఠాధిపతి శ్రీరంగనా«థ యతీంత్ర మహాదేశికన్, ఆలయ అర్చకులు, వేదపండితుల పూజలు అందుకున్నారు. సుమారు గంటపాటు తెప్పోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో కోనేరు వద్దకు చేరుకుని ఈ ఉత్సవాన్ని తిలకించారు. -
వైభవం.. గరుడోత్సవం
– ధ్వజారోహనము తో ముగిసిన ఎగువ అహోబిల బ్రహ్మోత్సవం – ఆకట్టుకున్న స్వామి బావమరుదుల(చెంచుల) ఆటపట్టించే కార్యక్రమాలు అహోబిలం(ఆళ్లగడ్డ) అహోబిల బ్రహ్మోత్సవాల చివరి రోజు ఆదివారం అర్ధరాత్రి ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ జ్వాలనరసింహస్వామి గరుడోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం రాత్రి నిత్యపూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన స్వామిని అర్ధరాత్రి అనంతరం విశేష పూలాంకరణ గావించిన గరుడ వాహనము పై కొలువుంచి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గరుడ మహోత్సవ వేడుకలు సోమవారం తెల్లవారు జామున వరకు సాగాయి. అంతకు ముందు ఉదయం ఉత్సవం, సాయంత్రం ద్వాదశారథనం నిర్వహించిన అనంతరం రాత్రి గరుడోత్సవం నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ఎగువ అహోబిలం బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ధ్వజావరోహనము చేపట్టారు. ఆకట్టుకున్న స్వామిని ఆటపట్టించే కార్యక్రమాలు చెంచులక్ష్మీ అమ్మవారిని శ్రీ జ్వాలనరసింహస్వామి పరిణయమాడటంతో వరుసకు బావగా భావించే చెంచులు నూతన పెండ్లి కొడుకైన స్వామిని సంప్రదాయంగా ఆటపట్టించారు. ఇందులో భాగంగా గరుడవాహనము పై ఆశీనులైన స్వామి మేలిమి ఆభరణాలు ఎత్తుకెళ్లి దాచడం, అర్చకులను ఆటపట్టించడం, వారిని ఎత్తుకెళ్లడం వంటి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
రమణీయం.. ప్రహ్లాదవరదుడి రథోత్సవం
– గోవిందా నామస్మరణతో మార్మోగిన అహోబిలం – ఆకట్టుకున్న సాంస్కృతిక, కార్యక్రమాలు ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో శ్రీలక్ష్మీనృసింహుని ర«థోత్సవం రమణీయంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో రోజు ఆదివారం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరదస్వామి రథోత్సవం అంగరంగా వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో అహోబిల ప్రాంతం మార్మోగింది. ముందుగా నిత్య పూజల్లో భాగంగా శ్రీ ప్రహ్లదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో ముస్తాబు చేసి కొలువుంచారు. అర్చకులు, వేదపండితులు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈఓ మల్లికార్జునప్రసాదు, ప్రధాన అర్చకులు వేణుగోపాలన్, అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువుంచి అహోబిల మఠం వద్ద పీఠాధిపతి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం రథం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అప్పటికే వివిధ రకాల పుష్పాలతో అలకంరించిన రథంపై స్వామి, అమ్మవార్లను కొలువుంచారు. అహోబిల మఠం 46వ జియర్ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్, వేదపండితులు, అర్చకులు రథాంగ పూజలు నిర్వహించారు. ఆచార్లు కొబ్బరికాయ సమర్పించి గుమ్మడికాయతో హారతిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఉత్సవం ఎదుట భక్తి పారవశ్యంతో నిర్వహించిన కోలాటాలు, హరి భజనలు, డప్పుల వాయిద్యాలు, భాజాభజంత్రీల మంగళ వాయిద్యాల మధ్య రథోత్సవం ప్రారంభమైంది. రథంలో విహరిస్తున్న స్వామిని భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్ఐలు, ప్రత్యేక పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించారు. రథోత్సవంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన నాయకుడు నాని తదితరులు పాల్గొన్నారు. అధికారులకు, ఆయగాళ్లకు సన్మానం రథోత్సవం కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కారకులైన అధికారులు, ఆయగాళ్లను సన్మానించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పీఠధిపతి శ్రీరంగనాథ యంత్రీంద్రమహాదేశికన్ను ముద్రకర్త వేణుగోపాలణ్ సన్మానించి స్వామివారి ఆశీర్వాదం అందజేశారు. ముద్రకర్తకు పీఠధిపతి ఆశ్వీరాదం అందజేశారు. అనంతరం ముద్రకర్త, మణియార్ సౌమ్యానారన్కు, అర్చకులు, ఈఓ, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీ రాజ్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, బోయిలు, భజంత్రీలను పూలమాలలు వేసి, శేషవస్త్రం కప్పి సన్మానించారు. అహోబిలంలో నేడు: అహోబిల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం దిగువ అహోబిలంలో ఉదయం ఉత్సవం, తీర్థవారి చక్రస్నానం, సాయంత్రం ద్వాదశారాధనం, పుష్పయాగం, అనంతరం రాత్రి గరుడోత్సవం, ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతాయి. -
కమనీయం... శ్రీ జ్వాలనరసింహుడి కల్యాణం
ఆళ్లగడ్డ : బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల తిరు కల్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీమన్ శఠకోప రంగనాధయతీంద్ర మహదేశికన్ ఆధ్యర్యంలో ఉత్సవ మూర్తులకు సంప్రదాయబద్ధంగా ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి, అమ్మవారికి కంకణధారణ నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందా నామస్మరణ మధ్య మాంగల్యధారణ నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు పోశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారిని కల్యాణాన్ని వీక్షించారు. -
ఆధ్యాతిక పరవశం
కొనసాగుతున్న అహోబిలేశుడి బ్రహ్మోత్సవం – వేణుగోపాల స్వామి అలంకరణలో దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదుడు -తరలివచ్చిన భక్తులు ఆళ్లగడ్డ: అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాలు భక్తుల గోవిందా నామస్మరణ తో మార్మోగాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాదరదస్వామి శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామున నిత్య పూజల్లో భాగంగా సుప్రత సేవతో స్వామిని మేలుకొలిపిన అనంతరం అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. తర్వాత వేణుగాపాలస్వామిగా అలంకరించి వాహనంపై కూరొ్చబెట్టి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం అభిషేకం నిర్వహించారు. రాత్రి పొన్నచెట్టు వాహనం పై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. -
ఉచిత బస్సు సర్వీసులు
ఆళ్లగడ్డ: భక్తుల సౌకర్యార్థం ఎగువ అహోబిలం వెళ్లేందుకు ఉచిత బస్సు సర్వీసులు గురువారం పీఠాధిపతి ప్రారంబించారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహణా«ధికారి మల్లిఖార్జున ప్రసాదు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఎగువ అహోబిలంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా దిగువ అహోబిలం నుంచి వెళ్లే వాహనాలు కారంజ నరసింహస్వామి ఆలయం వద్ద నిలుపుదల చేస్తామనా్నరు. ఆ బస్సులు నిరంతరం తిరుగుతుంటాయని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మఠం ప్రతినిధి సంవపత్ ఉన్నారు -
వైభవోపేతం.. అహోబిలేశుడి బ్రహ్మోత్సవం
అహోబిలం(ఆళ్లగడ్డ): అహోబిలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో ఐదో రోజు మంగళవారం ఉదయం ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారు శేషవాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రత సేవ అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చనలు, నవకళశ స్థాపన, జలాఅభిషేకం నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలు, మణి మానిక్యాలతో ప్రత్యేకంగా అలకంరించిన స్వామి అమ్మవార్లను శేషవాహనంలో ఉంచి మంగళ వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీజ్వాలనరసింహస్వామికి రాత్రి పట్టు వస్త్రాలతో, వజ్ర, వైడూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలతో స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి శరభ వాహనంపై కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాదు, మఠం ప్రతినిధి సంపత్, ప్రధానార్చకులు వేణుగోపాలన్ పాల్గొన్నారు. -
నమో నారసింహ
- నల్లమలలో మోరుమోగిన గోవింద నామస్మరణ - శేష వాహనంపై దర్శనమిచ్చిన జ్వాలనారసింహుడు - హనుమంత వాహనంపై ఊరేగిన ప్రహ్లాదవర స్వామి అహోబిలం(ఆళ్లగడ్డ): బ్రహ్మోత్సవాల సందర్భంగా అహోబిల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ విరజిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఎగువ అహోబిలంలో కొలువైన శ్రీ జ్వాలనృసింహస్వామి శేష వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలనృసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు నిత్య పూజల్లో భాగంగా తెల్లవారు జామునే మేలుకొలుపు చేసి వేదపండితుల వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పుష్పాలంకరణ చేసి శేష వాహనంపై కొలువుంచి మంగళ వాయిద్యాల మధ్య భక్తి శ్రద్దలతో మాడ వీధుల్లో వైభవోపేతంగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజల్లో భాగంగా అభిషేకం, తిరుమంజనం నిర్వహించి భక్తుల దర్శనార్థం ప్రతేకంగా అలకంరించిన మండపంలో కొలువుంచారు. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీ ప్రహ్లాదవరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారు శ్రీ యోగానృసింహ గారుడ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రత సేవ అనంతరం స్వామి అమ్మవార్లను మేలుకొలిపి శ్రీఘ్రదర్శనం అనంతరం అర్చనలు నిర్వహించి, నవకళశస్థాపన గావించిన అనంతరం జలాఅభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన పట్టువస్త్రాలు, మణి మానిక్యాల అభరణాలతో ప్రత్యేకంగా అలకంరించిన స్వామి అమ్మవార్లను శ్రీ యోగనృసింహ గరుడ విమాన వాహనంలో కొలువుంచారు. మంగళవాయిద్యాలతో వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి హనుమంతు వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. నేటి కార్యక్రమాలు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఉదయయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహణ సేవ ఉంటుంది. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ ప్రహ్లాదవరదుడు ఉదయం శేషవాహనంపై కొలువై దర్శనమిస్తారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు -
గోవిందా.. గోవిందా
- వైభవంగా కొనసాగుతున్న అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు అహోబిలం (ఆళ్లగడ్డ): నల్లమల కొండల్లో వెలిసిన అహోబిలం క్షేత్రంలో గోవింద నామస్మరణ మారుమోగుతోంది. అహోబిలేశుడిని బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడో రోజు ఆదివారం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరద స్వామి ఉదయం హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నిత్యపూజలు నిర్వహించిన అనంతరం స్వామిని హంసవాహనంపై స్వామిని కొలువుంచి మంగళ వాయిద్యాలతో, వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ వైభవో పేతంగా గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి సూర్యప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అహోబిలేశుడికి మఠం పీఠాధిపతి శ్రీ రంగరాజయతీంద్ర మహాదేశికన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎగువ అహోబిలంలో: బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం ఉదయం ఎగువ అహోబిలంలో కొలువైన ఉత్సవమూర్తులు శ్రీ జ్వాలనృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ జ్వాలనరసింహస్వామి హనుమంత వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. -
హంస వాహనంపై అహోబిలేశుడు
అహోబిలం (ఆళ్లగడ్డ): బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శనివారం.. శ్రీ జ్వాలా నరసింహస్వామి హంస వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామ స్మరణతో మాడా వీధుల్లో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలా నసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతేకంగా అలకంరించిన మండపంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. తిరిగి రాత్రి సూర్యప్రభ వాహనముపై స్వామికి గ్రామోత్సవం నిర్వహిచారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాదు, మఠం ప్రతినిథి సంపత్ పాల్గొన్నారు. -
సకల దేవతలకు ఆహ్వానం
- అహోబిలంలో ధ్వజపటావిష్కరణ, ధ్వజారోహణం – గరుత్మంతునికి విశేష పూజలు అహోబిలం(ఆళ్లగడ్డ): బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శుక్రవారం..శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రపటావిష్కరణ చేశారు. అంతకు ముందు గరుత్మంతున్ని..పల్లకిలో కొలువుంచి ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. మొదటి జియర్ ఆదివన్ షఠకోపన్ ఉత్సవ విగ్రహం ఎదురుగా ఉంచి శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలని ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశౠరు. శ్రీ జ్వాలా నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలు వస్తారని నమ్మకం. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిని, అమ్మవార్లను ఆశీర్వదించేందుకు వచ్చే ముక్కోటి దేవతలు, దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా గరుత్మంతుడు కాపాలా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. -
అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
అహోబిలం(ఆళ్లగడ్డ): అహోబిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అహోబిల మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్, మఠం ప్రతినిధి సంపత్, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి మల్లికార్జున ప్రసాదు, వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నియమనిష్టలతో.. విశేష పూజలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎగువ అహోబిలంలోని యాగశాలలో ఉదయం నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేనుడికి పూల మాలలు వేసి తల పాగా చుట్టి పల్లకిలో కొలువుంచారు. పల్లకిని ఆలయం వెలుపలకు తీసుకొచ్చి ఉత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు కలుగకుండా నిరంతరం పర్యవేక్షకుడిగా విశ్వక్సేనుడు వ్యవహరిస్తారని విశ్వాసం. అనంతరం మంగళ వాయిద్యాలతో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయానికి ఈశాన్యం వైపున ఉన్న పుట్ట మన్ను తీసుకు వచ్చారు. పుట్టమన్ను, కుంకుమ, పసుపుతో బ్రహ్మోత్సవ మండపాన్ని సుందరంగా అలకంరించి అంకుర హోమం నిర్వహించారు. సోముడిని (చంద్రుడిని) మట్టిలోకి ఆవాహం చేశారు. పాత్రలో ఉన్న మట్టిలో నవగ్రహాలకు సూచికగా నవధాన్యాలు పోసి సోమ కుంభస్థాపన చేశారు. నేడు ధ్వజారోహణం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం భేరీపూజ కొనసాగుతుంది. సింహ వాహనంపై స్వామి, అమ్మవారులు భక్తులకు దర్శనమివ్వనున్నారు. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ సందర్భంగా శుక్రవారం సాయంత్రం వేదపండితుల ఆధ్వర్యంలో అంకురార్పరణ కార్యక్రమం నిర్వహిస్తారు. -
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు 2వ తేదీన అంకురార్పన జరగనుందని దేవస్థాన పర్యవేక్షణాధికారి మల్లికార్జున ప్రసాద్ బుధవారం తెలిపారు. గురువారం నుంచి ఎగువ అహోబిలం, శుక్రవారం నుంచి దిగువ అహోబిల క్షేత్రాల్లో అంకుర్పారణతో 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో కొనసాగే ఉత్సవాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గురువారం నుంచి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, వాహన సేవలు ఎగువ అహోబిలంలో గురువారం, దిగువ అహోబిలంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలకు అంకుర్పాణ చేస్తారు. 4 నుంచి ప్రతి రోజు ప్రత్యేక పూజధికాలను, ఆలయప్రాంగణంలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతిరోజు స్వామి అమ్మవారిని ఓ వాహనంపై కొలువుంచి మాడ వీధుల్లో ఊరేగిస్తారు. 9న ఎగువ, 10న దిగువన తిరుకల్యాణోత్సవం ఎగువ అహోబిలంలో వెలసిన జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణం 9తేదీన, దిగువ అహోబిలంలో వెలిసిన జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కల్యాణోత్సవం 10న నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఎదురుకోలు ఉత్సవం అనంతరం ప్రత్యేక మండపంలో కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రతిరోజూ స్వామి అమ్మవార్ల వాహనసేవలు బ్రహ్మోత్సవాలను పురష్కరించుకుని ప్రతి రోజు ఉదయం, రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు వివిధ వాహనసేవలతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో: 3న సింహ వానసేవ, 4న ఉదయం హంస వాహనసేవ, రాత్రి సూర్యప్రభ వాహనసేవ, 5న హనుమంత వాహనసేవ, 6న ఉదయం శేష వాహనసేవ, రాత్రి చంద్రప్రభ వాహనసేవ, 7న శరభ వాహనసేవ, 8న పొన్నచెట్టు వాహనసేవ, 9న గజ వాహనసేవ, 10 అçశ్వ వాహనసేవ, 11న ఉదయం రథోత్సవము , 12న గరుడోత్సవం దిగువ అహోబిలంలో: 4న సింహ వాహనసేవ, 5న ఉదయం హంస వాహనసేవ, రాత్రి సూర్యప్రభ వాహనసేవ, 6న శ్రీయోగానృసింహ గారుడ విమానసేవ, రాత్రి హనుమంత వాహనసేవ, 7న ఉదయం శేష వాహనసేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ, 8న చంద్రప్రభ వాహనము, 9న పొన్నచెట్టు వాహనసేవ, 10న గజ వాహ వాహనసేవ, 11న అశ్వ వాహనసేవ, 12న రథోత్సవం, 13న గరుడ వాహనసేవలు జరుగుతాయి. -
పెళ్లికి వేళాయే
– పెండ్లి పిలుపునకు వెళ్లి తిరిగి అహోబిలం చేరుకున్న అహోబిలేసుడు – పూర్ణకుంభంతో స్వాగతం పలికిన గ్రామస్తులు, అర్చకులు, సిబ్బంది – పూజలు చేసి స్వామి సేదతీర్చిన వేదపండితులు అహోబిలం(ఆళ్లగడ్డ): తన వివాహామహోత్సవానికి రావాలని భక్తులను పిలిచేందుకు వెళ్లిన అహోబిలేసుడు తిరిగొచ్చారు. దాదాపు 45 రోజుల సాగిన ఈ పర్యటనలో స్వామి ఊరూరా తిరిగి భక్తులకు తన దర్శన భాగ్యం కల్పించాడు. కులమతాలకు అతీతంగా అందరూ తన పెళ్లికి రావాలని ఆహ్వానించి మంగళవారం అహోబిలం చేరుకున్న శ్రీ జ్వాలనృసింహ స్వామి, ప్రహ్లాదవరద స్వాములకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. రుద్రవరం నుంచి అహోబిలం చేరుకుంటున్న పారువేట ఉత్సవ పల్లకికి గ్రామ పొలిమేర వరకు వెళ్లి భాజభజంత్రీలతో స్వామిని దేవస్థానానికి తీసుకు వచ్చారు. స్వామి తిరిగి అహోబిలం వస్తుండటంతో గ్రామ మహిళలు రహదారి వెంట కల్లాపు చల్లి రంగురంగుల ముగ్గులు వేసి తమ భక్తిని చాటుకున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రాయశ్చిత్య హోమం ఇన్నిరోజులు గ్రామాల్లో సంచరిస్తూ అలసి పోయిన ఉత్సవ మూర్తులైన శ్రీ జ్వాలనృసింహస్వామి, ప్రహ్లాదవరదస్వాములకు వేద పండితులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ముందుగా నవకలశ స్థాపన (108 కలశాలు) తో పంచామృతాభిషేకం నిర్వహించి, అటు తరువాత ప్రాయశ్చిత్య, లఘు సంప్రోక్షణ హోమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణములతో అలంకరించి ప్రహ్లాద వరద స్వామిని దిగువ అహోబిలంలో కొలువుంచి జ్వాలనృసింహాస్వామిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఎగువ అహోబిలం తీసుకెళ్లి కొలువుంచారు. -
తుది ఘట్టానికి పారువేట ఉత్సవం
- రుద్రవరం బోయినుల కాలనీలో పూజలందుకున్న నారసింహుడు - రాత్రికి కొల్లంవారి కాలనీలో తెలుపుపై కొలువు రుద్రవరం: పారువేట ఉత్సవంలో భాగంగా అహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆదివారం పలు తెలుపులపై కొవుదీరి పూజలందుకోవడంతో ఉత్సవం చివరి ఘట్టానికి చేరింది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా గత నెల 16న పారువేట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అహోబిలంలో ప్రారంభమైన ఉత్సవాలు ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, రుద్రవరం మండలాల్లోని పలుగ్రామాల్లో సాగాయి. చివరగా స్వామివారి మండల కేంద్రమైన రుద్రవరం చేరుకున్నాడు. నాలుగు రోజులుగా ఉత్సవ మూర్తులు పలు తెలుపులపై కొలువు దీరగా స్థానికులతోపాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఇదే గ్రామంలో మరో రెండు రోజులపాటు పూజలందుకున్న అనంతరం స్వామివారు కొండకు బయలు దేరుతారు. పల్లకి మోసే బోయినులు నివాసం ఉన్న కాలనీలో స్వామి కొలువుదీరడంతో కాలనీలు వాసులు ఆనందోత్సాహాలతో పూజలు జరిపారు. బోయినీలకు ఇష్ట దైవం, ఇంటి దేవుడు కావడంతో బంధు మిత్రులతో సందడి వాతావరణం నెలకొంది. రాత్రికి కొల్లం వారి తెలుపుపై కొలువుదీరేంత వరకు గోవింద నామస్మరణతో కాలనీలు మొత్తం మారుమోగాయి. స్వామివారి రాకను పురస్కరించుకుని తిరునాల నిర్వహిస్తుండడంతో గ్రామంలోని అమ్మవారిశాల సెంటర్ బొమ్మలు, గాజుల అంగళ్లు, వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన జనంతో కళకళలాడుతోంది. -
భక్తిశ్రద్ధలతో దీక్ష విరమణ
అహోబిలం(ఆళ్లగడ్డ): మండలం (41) రోజులు నియమ నిష్టలతో కఠోరమైన దీక్ష చేపట్టిన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి దీక్ష స్వాములు శుక్రవారం భక్తి శ్రద్ధలతో దీక్ష విరమణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది దీక్ష పరులు ఇరుముడిలతో కాలినడకన నవనరసింహ క్షేత్రం చేరుకున్నారు. తెల్లవారు జామున ఎగువ అహోబిల దేవస్థానంలో చివరి పుణ్యస్నానం ఆచరించి మాలోల నరసింహస్వామి ఆలయం సమీపంలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
మార్చి 2 నుంచి అహోబిలం బ్రహ్మోత్సవాలు
- మార్చి 13 వరకు నిర్వహణ - ఏర్పాట్లపై ఆర్డీఓ సమీక్ష నంద్యాల: అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్డీఓ రామ సుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం.. అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. దొంగతనాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల స్నానాలకు తెలుగుగంగ కాల్వ ద్వారా నీటి సౌకర్యాన్ని కల్పించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బీ అధికారులకుససూచించారు.ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పంచాయతీరాజ్ అధికారులదేనన్నారు. భక్తుల సంఖ్యకు తగినట్లు ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలన్నారు. విద్యుత్ సమస్య లేకుండా 24గంటలు సరఫరా చేయాలని చెప్పారు. వైద్యశాఖ అధికారులు.. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతోపాటు అబులెన్స్ను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పావన నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గించొద్దని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో మద్యం విక్రయాలను నియంత్రించాలన్నారు. అనంతరం ఆర్డీఓతోపాటు దేవస్థానం ఈఓ మల్లికార్జునప్రసాద్ తదితరులు.. బ్రహ్మోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో తెలుగుగంగ డీఈ నరసింహారెడ్డి, ఇన్చార్జి ఆర్టీఓ జీవీ రమణ, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రవికుమార్, ప్రొహిబిషన్ ఎస్ఐ చంద్రహాస్, , ఫైర్ ఆఫీసర్ హేమంత్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ ముక్తార్, ఫారెస్ట్ ఆఫీసర్ రామ్‌సింగ్, మెడికల్ ఆఫీసర్ గుణశేఖర్, ఎంపీడీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నమో..నారసింహా!
- వైభవంగా జయంత్యుత్సవం - అహోబిలంలో సుదర్శన హోమం ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంత్సుత్సవాలు శనివారం వైభవంగా నిర్వహించారు. నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకొని..భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నవ నారసింహ క్షేత్రాల్లో తెల్లవారు జామునే మూలవిరాట్‌కు అర్చన, అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి శ్రీదేవి, పద్మావతి అమ్మవార్లను కొలువుంచి అభిషేకం నిర్వహించారు. తిరుమంజనం అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య సుదర్శన పావన నరసింహ హోమం వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు. హోమం ప్రత్యేకత.. తమ కల్యాణ మహోత్సవానికి భక్తులను స్వయంగా ఆహ్వానించేందుకు ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాల నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాద వరద స్వాములు పారువేట మహోత్సవానికి గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంలో వచ్చిన స్వాతి నక్షత్రంలో న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీదేవి, పద్మావతి అమ్మవారిని కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి సుదర్శన హోమం నిర్వహించారు. ప్రధానార్చకుడు వేణుగోపాలన్, అర్చకులు కళ్యాణం, సంతానం, మణియార్ సౌమ్యానారయన్ , ఈఓ మల్లికార్జున ప్రసాదు పర్యవేక్షణలో నిర్వహించారు. -
చూడకపోతే గోవిందా!
– హుండీలోకి వెళ్లని భక్తుల కానుకలు - బయటనే కనిపిస్తున్న వైనం – పట్టించుకోని అధికారులు – ఆందోళనలో భక్తులు ఆళ్లగడ్డ: దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ అహోబిలేసుడి పారువేట మహోత్సవాలు జరుగుతాయి. ఉత్సవ పల్లకీలో కొలువైన శ్రీజ్వాలానరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వాములను దర్శించుకునేందుకు భక్తులు ఎంత ప్రాధాన్యమిస్తారో పల్లకీకి అమర్చిన హుండీ కూడా వారికి అంతే ముఖ్యం. ఏడాది పొడువున ముడుపులు కట్టి, స్వామి తమ తెలుపు పై కొలువైన సమయంలో ఆ సొమ్ములు హుండీలో వేస్తారు. ఇలా చేస్తే సుఖశాంతులతో పాటు ధనప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతటి ప్రాశస్త్యం ఉన్న హుండీలో భక్తులు సొమ్ములు, కానుకలు వేస్తే లోపలకు పడకుండా బయటనే ఉండిపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని కొందరు రెండు రోజులుగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోక పోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రతి రోజు వేలాది మంది వేసే కానుకలు ఎక్కడికి వెళ్తున్నాయే ప్రశ్నార్థకంగా మారింది. ఎంతో భక్తితో హుండీలో వేసే కానుకలు తమ కళ్లెదుటే దుర్వినియోగమవుతున్నాయని భక్తులు వాపోతున్నారు. దీనిపై దేవస్థానం ఉద్యోగి రాంభూపాల్ దృష్టికి తీసుకెళ్లగా పల్లకీకి అమర్చిన హుండీ పాతది కావడంతో పాటు కానుకలు వేసే రంద్రం చిన్నగా ఉండటంతో లోపలికి పోవడంలేదని తెలిపారు. వేరే హుండీ పంపిస్తామని అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. -
సామాన్యుడి చెంతకు గోవిందుడు
– పార్వేట ఉత్సవాలకు అహోబిలంలో శ్రీకారం – తరలివచ్చిన భక్తులు, చెంచులు – శ్రాస్త్రోక్తంగా ఉత్సవ పల్లికిని సాగనంపిన వేదపండితులు ఆళ్లగడ్డ: తన కల్యాణానికి స్వయంగా భక్తకోటిని ఆహ్వానించేందుకు లక్ష్మీనరసింహ ఆదివారం పల్లె బాట పట్టారు. సంక్రాంతి పర్వదినం ముగిసిన మరుసటి (కనుమ) రోజు అహోబిలేశుడి పారువేట ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ జ్వాలా నరసింహస్వామిని శనివారం దిగువ అహోబిలం తీసుకువచ్చి అక్కడ వెలసిన ప్రహ్లాద వరదస్వామితో కలిపి కొలువుంచి ఇద్దరికి తలపాగా చుట్టి వేటగాల్లలా ప్రత్యేకాలంకరణ గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ప్రహ్లాద వరదుడు, జ్వాలా నరసింహ మూర్తిని ఉత్సవ పల్లకిలో కొలువుంచి వేదపండితుల వేద మంత్రోచ్ఛారణాల నడుమ, చెంచుల సంప్రదాయ నృత్యాల మధ్య ఆలయ మండపానికి తీసుకు వచ్చారు. అక్కడ ఉత్సవ మూర్తుల సమక్షంలో కుంభహారతి అనంతరం అన్నకూటోత్సవం అర్పించారు. ఇందులో కొంత భాగాన్ని చెంచులు, అటవీ అధికారులు, బోయిలూ, రెడ్డి, కరణం, అర్చకులు, గుడికట్టు, నిషాని, తప్పెట తదితరులకు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవ పల్లకి ఆలయం బయటకు వచ్చిన అనంతరం స్వామి వారిపై బాణాలు ఎక్కుపెట్టి సంధించారు. తమ ఆడబిడ్డ అయిన చెంచులక్ష్మీ అమ్మవారిని స్వామి వివాహం చేసుకునేందుకు భక్తులకు ఆహ్వానం పలికేందుకు గ్రామాలకు వెళ్తున్నందుకు సంతోషంగా బాణాలు వదులుతూ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. అనంతరం చెంచులు పల్లకి ముందర సంప్రదాయ నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేర వరకు పల్లకిని సాగనంపారు. కార్యక్రమాలను మఠం ప్రతినిథి సంపత్, ఈఓ మల్లికార్జున ప్రసాద్, ప్రధానార్చకులు వేణుగోపాల్‌లు పర్యవేక్షించారు. ఆళ్లగడ్డ సీఐ దస్తగిరిబాబు, ఎస్ఐలు రామయ్య, చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పలచాని బాలిరెడ్డి, కెడీసీసీ బ్యాంకు డైరెక్టర్ నాసారి వెంకటేశ్వర్లు, అహోబిలం సర్పంచ్ నాసారి వీరమ్మ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. -
దిగువ అహోబిలం చేరుకున్న జ్వాలా నరసింహుడు
అహోబిలం (ఆళ్లగడ్డ): పారువేట ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో వెలసిన జ్వాలనరసింహ స్వామి శనివాం దిగువ అహోబిలం చేరుకున్నారు. తన వివాహ మహోత్సవ వేడుకలకు భక్తులను ఆహ్వానించేందుకు ఉత్సవ పల్లకిలో కొలువై నల్లమల అడవి మార్గంలో గ్రామాల మీదుగా దిగువ అహోబిలం తీసుకువచ్చారు. దిగువ అహోబిలం చేరుకుంటున్న సమయంలో పొలిమేరల్లో ఆలయ అర్చకులు, వేద పండితులు భాజా భజంత్రీలతో ఎదురేగి స్వామికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తూ దిగువ అహోబిలంలోని మఠంలోకి తీసుకెళ్లారు. -
భక్తుల చెంతకే భగవంతుడు
- రేపటి నుంచి అహోబిలేశుడి పార్వేట మహోత్సవాలు - 33 గ్రామాల్లో 45 రోజుల పాటు స్వామివారి పర్యటన - పెళ్లి పిలుపునకు గ్రామాలకు తరలివస్తున్న భగవంతుడు ఆళ్లగడ్డ : తన కల్యాణోత్సవానికి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల వారిని ఆహ్వానించడంలో భాగంగా శ్రీ అహోబిలేశుడు చేపట్టే పార్వేట మహోత్సవం సోమవారం ప్రారంభం కానుంది. పార్వేట మహోత్సవ పూర్వపరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం మేల్కోటెలో జన్మించిన కిడాంబి చళ్లపిళ్లై శ్రీనివాసాచార్యులు కాంచీపురంలో వేదాంత కాలక్షేపం చేస్తున్న సమయంలో శ్రీలక్ష్మినరసింహస్వామి కలలో సాక్షాత్కరించి అహోబిలం చేరుకోవాలని చెప్పారు. స్వామి ఆజ్ఞానుసారం ఆయన క్షేత్రం చేరగానే వృద్ధ సన్యాసి రూపంలో దర్శనమిచ్చి శ్రీనివాసాచార్యులకు సన్యాసాన్ని అనుగ్రహించారు. సాక్షాత్తు దేవదేవుడి చేతుల మీదుగా సన్యాసాన్ని స్వీకరించిన శ్రీనివాసాచార్యులు ‘ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ ’ అనే సన్యాస ఆశ్రమ నామాన్ని స్వీకరించి ‘శ్రీ అహోబిల మఠం’ ను స్థాపించి మెట్టమెదటి పీఠాధిపతి అయ్యారు. అప్పుడు స్వామివారు పీఠాధిపతులవారితో ‘గ్రామే గ్రామే చగత్వాపద చరణ యో ... మాంగృహీత్వ (భక్తుల చెంతకే భగవండుడు అన్న విధంగా గ్రామ గ్రామాలకు నన్ను వేంచేయింపజేసి బక్తులకు మోక్ష మార్గాన్ని కల్పించండి) అని ఉపదేశించారు. స్వామి ఆజ్ఞ మేరకు ప్రథమ పీఠాధిపతి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఉత్సవ పల్లకిలో కొలువుంచి గ్రామాలకు చేరుకోవడంతో పాటు ఊరేగింపుగా అక్కడి వీధుల్లో సంచరిస్తూ ప్రత్యేకంగా నిర్మించిన తెలుపులపై కొలువుంటూ బక్తులకు ఆశ్వీర్వాదాలు అందజేసే ‘పార్వేట’ మహోత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు చరిత్ర కథనం. వేటగాడిలా... నిత్యం పట్టువస్త్రాలు, వజ్రవైడూర్యాలతో దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీనరసింహస్వాములు పార్వేట మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు లేకుండా ఒంటరిగా తలపాగా మాత్రమే చుట్టుకుని వేటగాడి ఆకారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామి ఇలా వేటగాడి రూపంలో సంచరించడంతో గ్రామానికి ఎల్లప్పుడు ఆయన రక్షణ ఉంటుందని ప్రజలు నమ్ముతారు. పార్వేటలో భాగంగా స్వామివారు ఏ ఊరికి వెళ్తే ఆ రోజు అక్కడ తిరునాల జరుగుతుంది. ఇలా 45 రోజులపాటు ఈ పార్వేట సాగుతుంది. స్వామి తిరిగి కొండెక్కేవరకు పాదుకలే సర్వస్వం పార్వేట ఉత్సవాల్లో భాగంగా సుమారు మండలం రోజులకు పైగా స్వామివారి గ్రామాల్లో తిరుగుతూ భక్తులను ఆశీర్వదించెందుకు కొండ దిగుతారు. అయితే తిరిగి కొండెక్కేవరకు క్షేత్రంలో అహోబిలేశుడి పాదుకలున్న శఠగోపం ఆలయంలో ఉంచుతారు. ఈ శఠానికి నిత్యం ప్రాతఃకాలంలో అన్ని రకాల పూజలు నిర్వహించి కొలువుంచి పరమ పవిత్రంగా కొలుస్తుంటారు. స్వామి తిరిగి కొండెక్కేవరకు అహోబిలంలో మూలవిరాట్‌ను దర్శించుకునే బక్తులకు శఠారు పెట్టడం జరగదు. కేవలం తీర్థ ప్రసాదాలు మాత్రమే అందజేయడం ఆనవాయితీ. ఇప్పటికి కూడా స్వామికి అర్చకులు బావి నీరుతో కట్టెల పొయ్యిపై చేసిన నైవేద్యాన్ని మాత్రమే నివేదిస్తారు. ఇలా స్వామి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి దాదాపు రాత్రి పొద్దుపోయిన తరువాతే వెళ్తారు. రుద్రవరం మండలం ఆలమూరు, లింగందిన్నె గ్రామాలకు చెందిన బోయిలు కాళ్లకు చెప్పులు లేకుండా చీకట్లో, ముళ్ల పొదల్లోనే స్వామి పల్లకీని మోసుకెళ్తారు. ఇలా స్వామివారి పార్వేట ఆళ్లగడ్డ, రుద్రవరం, ఉయ్యాలవాడ మండలాల్లోని 33 గ్రామాల్లో సాగుతుంది. కొండదిగిన రోజునుంచి తీరిక లేకుండా గ్రామ గ్రామాన తిరిగి బక్తులకు దర్శన భాగ్యము కల్పించి 45 రోజుల అనంతరం రుద్రవరం నుంచి స్వామి పల్లకి కొండ(అహోబిలం) ఎక్కుతుంది. ఉత్సవాలు సాగేది ఇలా.. ఎగువ అహోబిలంలో కొలువైన జ్వాల నరసింహస్వామిని సంక్రాంతి పర్వదినం రోజు దిగువ అహోబిలం తీసుకు వస్తారు. పదవ క్షేత్రం దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాదవరదస్వామితో కలిపి కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వాములకు ఎదురుగా అన్నం రాసిగా పోసి అన్నకూటోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 45 రోజులపాటు సాగే పార్వేట ఉత్సవాల్లో స్వాములకు సరిపడా ఆహారాన్ని ఇద్దరు ఉత్సవ మూర్తులకు అర్పిస్తారు. అనంతరం పార్వేట ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఈప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యం : కీడాంబి వేణుగోపాలన్, అహోబిలం దేవస్థాన ప్రధానార్చకులు ప్రపంచంలో ఎక్కడా ఏ స్వామి ఇవ్వని కానుకను శ్రీఅహోబిల లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాల ద్వారా ప్రజలకు అందిస్తారు. స్వయంగా భక్తుని చెంతకే భగవంతుడు వెళ్లి దర్శన భాగ్యం కల్పించే కార్యక్రమానికి ఈ ఉత్సవాలు వేదికగా నిలుస్తాయి. -
వైభవంగా మహా పూర్ణాహుతి
ఆళ్లగడ్డ : అహోబిల క్షేత్రంలో శ్రీజ్వాల సెంట్రల్‌ట్రస్ట్ నిర్వాహకుడు శ్రీధర్ గురూజీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ హమానరసింహ సంపుటిత శ్రీ అమృత నారాయణ ప్రయేగ మాయా యాగంలో భాగంగా ఆదివారం నిర్వహించిన పూర్ణహుతి వైభవంగా కొనసాగింది. అంతకు ముందు ఉదయం శ్రీ లక్ష్మీనృసింహస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, పారాయణలు నిర్వహించారు. రాష్ట్రంతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వందాలాది భక్తులు పాల్గొన్నారు. -
అహోబిలేసుని సేవలో ఇంటలిజెన్స్ డీఎస్పీ
అహోబిలం (ఆళ్లగడ్డ): ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఇంటలిజెన్స్ డీఎస్పీ వంశీధర్‌గౌడ్ దర్శించుకున్నారు. ఆదివారం క్షేత్రానికి చేరుకున్న ఆయన ఎగువ, దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదల్లో భాగంగా అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈయన వెంట ఐదుగురు ఇంటలిజెన్స్ ఎస్ఐలు ఉన్నారు. -
వైభవోపేతం.. స్వామి మహోత్సవం
- అహోబిలేశుడి సన్నిధిలో ఘనంగా వేడుకలు - గోవిందా నామస్మరణతో పులకించిన నల్లమల - స్వామిని దర్శనార్థం అశేషంగా తరలివచ్చిన భక్తులు ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి జన్మదిన వేడుకలు నవనారసింహ క్షేత్రాల్లో వైభవోపేతంగా నిర్వహించారు. నృసింహస్వామి అవతార దినమైన స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకుని శనివారం భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. నవనారసింహ క్షేత్రాల్లోని 10 దేవాలయాల్లో కొలువై స్వయంభూగా వెలసిన లక్ష్మీనృసింహస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో కొలువైన శ్రీ జ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సహీత శ్రీజ్వాలానృసింహస్వాములను దేవాలయం ఆవరణలోని మండపంలో కొలువుంచి అర్చన, తిరుమంజనం నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ గావించి మండపంలో కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వాతి , సుదర్శన హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నవనారసింహ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. -
అహోబిలంలో ధనుర్మాస పూజలు
అహోబిలం(ఆళ్లగడ్డ): ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిల లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నవ నారసింహ క్షేత్రాలను సందర్శించారు. స్వామి, అమ్మవార్లుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారిని లలితాదేవిగా అలంకరించి ఉత్సవ పల్లకిలో కొలువుంచి ఊరేగించారు. -
అహోబిలం ఏసీగా గాయత్రి
కర్నూలు(న్యూసిటీ): ఆళ్లగడ్డ మండలం అహోబిలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఉపకమిషనర్‌గా(ఏసీగా) బి.గాయత్రి దేవిని నియమించారు. రాయలసీమలోని కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఉపకమిషనర్‌గా గాయత్రి దేవి ఉన్నారు. అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వాణి గత నెల 23వ తేదీ నుంచి సెలవుపై వెళ్లారు. దీంతో ఎఫ్ఏసీ(ఫుల్ అడిషనల్ చార్జ్)గా గాయత్రి దేవిని నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వై.వి.అనురాధ కర్నూలుకు ఉత్తర్వులు పంపారు. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 6 ఏ కేటగిరీ కిందకు వస్తుంది. అంతేకాక రాష్ట్రంలోని అతిపెద్ద వైష్ణవ దేవాలయాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. -
వైభవోపేతం..స్వాతి ఉత్సవం
ఆళ్లగడ్డ: శ్రీలక్ష్మీ నరసింహస్వామి జన్మనక్షత్రమన స్వాతిని పురస్కరించుకుని ఆదివారం అహోబిలంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వరద, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజలనంతరం ఉత్సవమూర్తులను శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుంచి అహోబిలం మఠం ప్రతినిధి సంపత్ ఆధ్వర్యంలో అభిషేకం జరిపారు. అర్చన, తిరుమంజనం అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వాతి , సుదర్శన హోమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నావనారసింహ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. -
వైభవోపేతం.. ఏకాదశి మహోత్సవం
ఆళ్లగడ్డ: అహోబిలంలో శుక్రవారం ఏకాదశి మహాత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఎగువ అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో స్వామి, అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాదవరదస్వాములను ఆలయ ఆవరణలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవమూర్తులను పుల్లకిలో కొలువుంచి మాడా వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. -
అహోబిలేశా..ఏమిటీ దుస్థితి!
–తెరుచుకోని గర్భగుడి సింహద్వారం - కానరాని తాళం – విశ్వరూప దర్శనం లేకుండానే ఆలయంలో పూజలు – మధ్యాహ్న దొడ్డిదారిలో వెళ్లి నిత్యపూజలు, ఆదారి గుండానే భక్తులకు దర్శనభాగ్యం – సంపాదన మీదున్న ఆసక్తి గుడిపై ఉండకపోతే ఎలా అంటూ భక్తుల ఆగ్రహం – పక్కదారిలో వెళ్లి స్వామిని దర్శించుకోవడం అపచారమని సిబ్బందితో వాగ్వాదం అహోబిలం (ఆళ్లగడ్డ): అహోబిలం... ఈ మాట వినగానే భక్తులు పరవశించిపోతారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి తమ ఇష్ట దైవం నరసింహస్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. వారు సమర్పించే కానుకలు, చందాలతో క్షేత్రానికి ఏటా రూ. 20 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. అయితే, ఇంత ఆదాయం వస్తున్నా అధికార సిబ్బంది నిర్లక్ష్యంతో ఆలయంలో నిత్యం ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంది. అయినా వారు ఇప్పటి వరకు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంతో దిగువ అహోబిలంలో వెలిసిన శ్రీ ప్రహ్లాదవరద స్వామి ఆదివారం విశ్వరూపసేవకు నోచుకోలేదు. భక్తులు సాయంత్రం వరకు దొడ్డి (భక్తులు బయటకు వచ్చే) దారి గుండా స్వామి వారిని దర్శించుకోవాల్సి వచ్చింది. సాయంత్రం వరకు తెరుచుకోని సింహాద్వారం ఎప్పటిలాగే తెల్లవారు జామున గుడి తలుపులు తెరిచేందుకు అర్చకులు వచ్చారు. సిబ్బంది తీసుకు వచ్చిన తాళాలతో ఎంత ప్రయత్నించినా అవి తెరుచుకోలేదు. దీంతో ఒరిజనల్ తాళాలు ఎక్కడో మాయమయ్యాయని భావించి మరో సెట్ తాళాలు తీసుకు రమ్మని ఈఓ కార్యాలయం దగ్గరకు పంపించారు. అయితే, అక్కడ అధికారి అందుబాటులో లేక పోవడంతో సిబ్బంది సక్రమంగా స్పందించలేదు. దీంతో తెల్లవారు జామునుంచి మధ్యాహ్నం వరకు స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన కొందరు భక్తులు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్వామిని దర్శించుకుని వెలుపలకు వచ్చే ద్వారం గుండా భక్తులను లోపలకు పంపించారు. స్వామికి విశ్వరూపదర్శనమేదీ? ప్రతి రోజు రాత్రి స్వామిని మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య శయనోత్సవం గావించి గుడి తలుపులు మూసి వేస్తారు. తిరిగి తెల్లవారు జామున గుడి బయట శుభ్రపరిచి సుప్రభాత సేవ అనంతరం క్షేత్రంలో ప్రత్యేకంగా పెంచుతున్న గోమాతను తీసుకువచ్చి పూజించి, ప్రత్యేక పూజలు నిర్వహించి సింహాద్వారం ఎదురుగా తలుపులు తీసిన వెంటనే ఆవు వెనుక భాగం కనిపించే విధంగా ఉంకి తలుపులు తీయడాన్ని విశ్వరూప దర్శన మంటారు. ఆవు వెనుక వైపు మహాలక్ష్మీ ఉంటారని స్వామి ఆ అమ్మవారిని చూసి మేల్కొంటారిని నమ్మకం. అనంతరమే అర్చకులు లోపలికి వెళ్లి దూప,దీప, నైవేద్యాలు అందజేయాల్సి ఉంటుంది. తరువాత భక్తులు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే ఆదివారం స్వామి వారికి ఇలాంటి కార్యక్రమాలు ఏవీ చేయలేదు. దీంతో ఎక్కడ అరిష్టము జరుగుతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు ద్వారపాలకు అనుమతి లేదు విశ్వరూప దర్శనం అనంతరం గుడిలోకి మొదటగా అడుగు పెట్టే అర్చకులు ద్వార పాలకుల అనుమతి తీసుకుని లోపలికి వెళ్లి పూజలు మొదలు పెట్టాలి. అలాంటిదేమీ లేకుండా ప్రధాన అర్చక బృందం పక్క దారిలో వెళ్లి పూజలు మొదలు పెట్టడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనికంతటికి కారణం అ«ధికారులు స్థానికంగా ఉండి పర్యవేక్షించక పోవడంతో పాడు అప్పుడప్పుడు చుట్టపుచూపులా వచ్చి పోతుండటం సిబ్బంది, అర్చకులు వారికి తోచిన విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామూలే జరుగుతుంటాయి: వేణుగోపాలన్ – ప్రధాన అర్చకులు గర్భగుడి తాళాలు స్ట్రక్ కావడంతో తెరుచుకోలేదు. దీంతో ప్రధాన ద్వారం స్థానంలో పక్కనున్న ద్వారం గుండా దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. అయితే, ఇవన్నీ మామూలే. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఏం చేస్తాం. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రుద్రవరం: అహోబిలం నార్త్ బీట్‌లో రూ. 10 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలతోపాటు నిందితుడు, మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ రామ్ సింగ్ తెలిపారు. శనివారం రాత్రి ఆలమూరు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందించారన్నారు. సిబ్బందిని అప్రమత్తం చేసి దాడులు నిర్వహించామన్నారు. దాడుల్లో ఆలమూరు గ్రామానికి చెందిన డీలర్ కుమారుడు రామమోహన్.. 15 ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసేందుకు సిద్ధం అవుతుండగా అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు వినియోగించిన మోటార్ సైకిల్‌తోపాటు ఎర్రచందనం దుంగలను అహోబిలం గ్రామానికి తరలించి విచారణ చేపట్టామన్నారు. ఆలమూరు గ్రామానికి చెందిన ప్రసాదుతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు అడవుల్లో ఎర్రచందనం వృక్షాలను నరికి దుంగలుగా మలిచి విక్రయిస్తున్నారని విచారణలో తేలిందన్నారు. దాడుల్లో డీఆర్ఓ శ్రీనివాసులు, సెక్షన్ అధికారులు మక్తర్ బాషా, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
వైభవో పేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో వెలసిన స్వాతి వేడుకలు సోమవారం వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ నృసింహస్వామి అవతార దినమైన స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకుని స్వామి జయంతోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలోని 10 దేవాలయాల్లో కొలువైన స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాదవరద, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుంచి ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తర్వాత స్వాతి , సుదర్శన హోమాలు ఘనంగా నిర్వహించారు. -
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
ఆళ్లగడ్డ: సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం అలవరుచుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠకోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ అన్నారు. శనివారం ఆళ్లగడ్డ పట్టణంలో భక్తుల డోలత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీ రామానుజన్ స్వాముల వారు ఆరాధించిన నవనీత కృష్ణుడి విగ్రహంతో పలువురి గృహాల్లో పర్యటించారు. స్వామి విగ్రహాన్ని ఆయా గృహాల్లోని ఊయలలో కొలువుంచి అర్చనలు, పూజలు నిర్వహించారు. నవనీత కృష్ణుడి విగ్రహం తమ గృహాల్లో కొలువై పూజలు అందుకుంటే ఆ ఇల్లు బృందావనం అవుతుందని భక్తుల విశ్వాసం. ప్రత్యేక పూజల అంనతరం పీఠాధిపతి భక్తులను అక్షింతలతో ఆశీర్వాదించారు. పీఠాధిపతికి ఘనస్వాగతం అహోబిల పీఠాధిపతి ఆళ్లగడ్డ పట్టణానికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పట్టణ వాసులు ఆయన వాహనానికి ఎదురేగి ఘన స్వాగతం పలికారు. పీఠాధిపతి వెంట అహోబిలం ప్రధానర్చకులు వేణుగోపాలన్, మఠం ప్రతినిథి సంపత్, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులున్నారు. -
కాసులిస్తేనే.. కనులారా దర్శనం
- ఇదేమి గోవిందా - అహోబిల ఆలయ సిబ్బంది ఇష్టారాజ్యం - గాడితప్పిన పాలన -భక్తులకు తప్పని తిప్పలు ఆళ్లగడ్డ: పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలంలో కొంత మంది ఆలయ సిబ్బంది, అర్చకుల తీరుతో భక్తులు మనోవేదనకు గురవుతున్నారు. కాసులిస్తేనే కనులారా దర్శనం కల్పిస్తుండడం విమర్శలు తావిస్తోంది. అహోబిల క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రకృతి అందాల మధ్య నవనారసింహుల ఆలయాలు ఇక్కడ వెలిశాయి.. ఉగ్రరూపం నుంచి శాంతి స్వరూపునిగా మారిన శ్రీలక్ష్మినృసింహస్వామిని దర్శించుకోవడం వల్ల జీవితంలో ప్రశాంతత, సుఖశాంతులు, ఆరోగ్యం, ధనప్రాప్తి కులుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాక విదేశీ భక్తులు సైతం పదుల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయంలో కొందరు అధికారులు, సిబ్బంది, అర్చకుల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అహోబిల క్షేత్రం పరిధిలోని నవనారసింహ స్వాములను దర్శించుకునేందుకు త్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ సంఖ్య శని, ఆదివారాలతో పర్వదినాల్లో రెట్టింపు ఉంటుంది.ఎగువ, దిగువ అహోబిలాల్లో శ్రీ జ్వాలనరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకుని అనంతరం నల్లమలలో వెలసిన నవనారసింహ క్షేత్రాలను దర్శించుకునేందుకు కాలినడకన వెళుతుంటారు. ఎంతో ఆశతో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇక్కడి పనిచేసే సిబ్బందికి, అర్చకులకు కాసులిస్తేతపప్ప కనులారా స్వామివార్ల దర్శన భాగ్యం కలగడం లేదు. గుడిలోకి వెళ్లిన భక్తుల నుంచి అర్చకులు, సిబ్బంది రూ. 100 నుంచి రూ 10,000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి ఆలయానికి వచ్చే భక్తులకు జాతకం పేరుతో భయం కల్పించి.. నివారణకు ఏవో మంత్రాలు చదువుతూ అధిక మొత్తంలో బహిరంగంగా నగదు తీసుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. అంతే కాదు దండులు వేస్తు, వేయిస్తూ.. దారాలు కడుతు, జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఫిర్యాదులు అధికం.. నవ నరసింహ స్వామి దేవాలయాల్లో కొందరు సిబ్బంది, అర్చకులు తమ ఇష్టారాజ్యంగా ప్రవరిస్తున్నారు. అడిగినంత సొమ్ములిస్తేనే ఆలయంలోపలికి వదులుతున్నారంటూ భక్తులు అహోబిల అధికారులకు వందల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. దీంతో కొన్ని సార్లు భక్తుల ఎదుటే సిబ్బందిని అధికారులు మందలించారు కూడా. ఇలాంటి సిబ్బందిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప భక్తులకు స్వామివార్ల దర్శన భాగ్యం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్పందించని అధికారులు.. నెల రోజుల క్రితం దిగువ అహోబిలంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు అర్చన చేయించుకునేందుకు టిక్కెట్ తీసుకుని వెళ్లారు. అక్కడ అర్చకుడు సెల్‌తో ఆడుకుంటూ భక్తులను పట్టించుకోలేదు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపొమ్మని అర్చకుడు దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయం ఆలయ అధికారికి పిర్యాదు చేశారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దర్శన టిక్కెట్ల రీసైక్లింగ్ దిగువ అహోబిలంలో శీఘ్ర దర్శనం కోసం రూ. 50 రూపాయలు, అర్చనకు రూ. 50 ప్రకారం టిక్కెట్లు ఇస్తున్నారు. అయితే ఒకసారి తీసుకెళ్లిన టిక్కెట్‌ను చించకుండా మళ్లీ సిబ్బంది ద్వారా బుకింగ్‌లోకి పంపించి రీ సైక్లింగ్ చేస్తున్నారన్న విషయం ఇక్కడ బహిరంగ రహస్యమే. అంతేకాకుండా.. హుండీ మూతికి లోపలి భాగంలో అడ్డంగా ఓ వస్త్రం ఉంచి భక్తులు వేసిన సొమ్ములు పూర్తిగా లోపలపడకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అహోబిలంలో ఓ అధికారి అడుగలకు మడుగులొత్తుతే చాలు.. పనిచేయక పోయినా జీతం వస్తుందనే విమర్శలు ఉన్నాయి. దేవస్థాన పరిధిలోని ఆలయాల్లో వివిధ రకాల విధులు నిర్వహించేందుకు 90 మంది సిబ్బంది ఉన్నారు. భద్రతా ఏర్పాట్లు చూసుకునేందుకు మరో 10 మంది హోంగార్డులను నియమించుకున్నారు. హోంగార్డులు కేవలం అధికారికి, కార్యాలయానికి మాత్రమే కాపలాగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పు చేసే సిబ్బందిపై చర్యలు: వాణి, అహోబిల ఆలయ ఈవో దర్శనానికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. బ్బంది తప్పు చేసినట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకుంటాం. -
ముగిసిన పవిత్రోత్సవం
అహోబిలం (ఆళ్లగడ్డ): ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాద వరదస్వామి ఆలయంలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. తెల్లవారుజామునే నిత్యపూజ, హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ అనంతరం శాంతి హోమాలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, తెల్లవారు జామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమాలను అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠకోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్, ప్రధానార్చకులు శ్రీమాన్ శఠకోప వేణుగోపాలన్, మఠం ప్రతినిథి సంపత్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వేద పండితులు నిర్వహించారు. పవిత్రోత్సవ విశిష్టత ఇదీ: ఏడాది పొడువునా ఆలయంలో నిర్వహించే నిత్యకైంకర్యాలు, వార, మాస, వార్షిక మహోత్సవాలు, ఇతరత్రా పూజాది కార్యక్రమాల్లో తెలసీ తెలియక చేసిన తప్పుల వలన ఏర్పడిన దోష నివారణకు ప్రతి ఏడాది నియమనిష్టలతో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. -
రమణీయం..పవిత్రోత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో పవిత్రోత్సవాలు రమణీయంగా కొనసాగుతున్నాయి. మూడోరోజైన సోమవారం ప్రహ్లాదవరద స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గ్రామోత్సవం జరిపి.. రెండు సార్లు శాంతి హోమాలు నిర్వహించారు. పూజల్లో అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ పాల్గొన్నారు. -
వైభవోపేతం.. పవిత్రోత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో పవిత్రోత్సవం వైభవంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నిత్యపూజ, కలశ స్నపనం, ద్వారాతోరణ పూజ, మండల ప్రతిష్ట, అగ్ని ప్రతిష్ట, హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ హోమం నిర్వహించారు. అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంధ్ర మహాదేశికన్ ఆధ్యర్యంలో వేద పండితులు పూజలు జరిపారు. -
వైభవంగా ముగిసిన పవిత్రోత్సవం
అహోబిలం (ఆళ్లగడ్డ) : ఎగువ అహోబిలం శ్రీజ్వాలనృసింహస్వామి ఆలయంలో నాలుగురోజుల పాటు నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ముగిసాయి. తెల్లవారు జామున నిత్య పూజలు, హోమం, గోష్టి తదితర పూజలు, రాత్రి గ్రామోత్సవం అనంతరం అత్యంత భక్తిశ్రద్ధలతో హోమం నిర్వహించి పూర్ణహుతి ఇచ్చారు. కార్యక్రమంలో ఈఓ వాణి, జీపీఏ సంపత్, ప్రదానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేడు దిగువ అహోబిలంలో పవిత్రోత్సవం ప్రారంభం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీజ్వాలనృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఆలయంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న పవిత్రోత్సవం శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఉదయం విష్వక్సేనుల వీధి ఉత్సవం, అనుజ్ఞ మృత్యుజ్ఞ మృత్సంగ్రహణము, రక్షాభంధనం కార్యక్రమాలు చేపట్టనున్నారు. -
వైభవం.. నరసింహుని పవిత్రోత్సవం
అహోబిలం (ఆళ్లగడ్డ): ఎగువ అహోబిలం శ్రీజ్వాలనరసింహస్వామి ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నాలుగురోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు మంగళవారం తెల్లవారు జామున యాగశాల ప్రవేశం తదితర పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో సోమకుంభస్థాపనం అంకురార్పణం చేశారు. రెండోరోజు బుధవారం ఉదయం నిత్య పూజ, నవకలశ స్నపనం, ద్వారతోరణ పూజ, మండల ప్రతిష్ఠ, కుంభ ప్రతిష్ఠ చేశారు. అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించారు. రాత్రి శ్రీజ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి గ్రామోత్సవం నిర్వహించారు. పవిత్రోత్సవ విశిష్టత ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే నిత్యకైంకర్యాలు, వార, మాస, వార్షిక ఉత్సవాలు, ఇతరత్రా పూజాది కార్యక్రమాల్లో తెలిసీ తెలియక చేసిన తప్పులతో ఏర్పడ్డ దోష నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆనవాయితీగా వస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పవిత్రోత్సవాల్లో నేడు పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు నిత్యపూజలు, హోమం, గోష్టి, సాయంత్రం 6 గంటల నుంచి స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం, రాత్రి 10 గంటలకు హోమం, 10.30 కు గోష్టి తదితర పూజలు నిర్వహిస్తారు. -
వైభవో పేతం.. స్వాతి మహోత్సవం
– నవ నారసింహ క్షేత్రాల్లోని లక్ష్మీ నృసింహస్వామికి ప్రత్యేక పూజలు ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో మంగళవారం స్వాతి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. లక్ష్మీ నృసింహ స్వామి జన్మనక్షాత్రాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవ నారసింహ క్షేత్రాల్లో స్వయంభువుగా వెలసిన స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు. దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాదవరదుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ.. నిత్య పూజలు చేశారు. ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో కొలువుదీర్చి ముద్రకర్త శ్రీమాణ్ వేణుగోపాలన్, మణియార్ వైకుంఠం స్వామి ఆధ్వర్యంలో అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలోని స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యంతో భక్తులు తరించారు. అనంతరం స్వాతి, సుదర్శన హోమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. -
వైభవో పేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బుధవారం స్వాతి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. స్వామి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వరద, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ చేశారు. ఉత్సవమూర్తులను కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో కొలువుంచి ముద్రకర్త శ్రీమాణ్వేణుగోపాలన్, మణియార్ వైకుంఠంస్వామిల ఆధ్వర్యంలో అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి.. భక్తుల దర్శనం కోసం ఉంచారు. అనంతరం స్వాతి, సుదర్శన హోమాలను ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నవlనారసింహ క్షేత్రాలు కిటకిటలాడాయి. -
అహోబిలం కోనేరులో యువకుడు దుర్మరణం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని సుప్రసిద్ధ అహోబిలం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయం కోనేటి వద్ద అపశృతి చోటుచేసుకుంది. ఓ యువకుడు కోనేటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం గ్రామానికి చెందిన చిరంజీవి (20) మరికొందరు స్నేహితులతో కలసి ఆదివారం అహోబిలం క్షేత్రానికి వచ్చాడు. ఈత సరిగా రాకపోయిన కోనేటిలో దిగడంతో... నీళ్లలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. -
తెలుగు తమ్ముళ్ల ఘర్షణ: 30 మందికి గాయాలు
ఆళ్లగడ్డ టౌన్(కర్నూలు) : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఇన్చార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గీయులు శుక్రవారం పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇరువర్గాలు ఒకరికొకరు ఎదురుపడిన సమయంలో మాటామాటా పెరిగి ఈ ఘర్షణకు దారితీసినట్లు గ్రామస్తులు తెలిపారు. రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేసుకుంటూ వీధుల్లో పరుగులు పెట్టడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డ డీఎస్పీ దేవదానం, సీఐ ఓబులేసు, ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతపరిచి, పరిస్థితిని సమీక్షించారు. రెండు వర్గాలకు చెందిన 25 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
అహోబిలంలో ఉద్రిక్తత
ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో దేవస్థాన పరిధిలోని దుకాణ సముదాయాలను అధికారులు కూల్చివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున అహోబిలం చేరుకున్న అధికారులు ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా కూల్చివేత ప్రారంభించారు. దీంతో దుకాణదారులు తీవ్రంగా ప్రతిఘటించారు. అడ్డువచ్చిన వారిని పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారు. కాగా కోర్టులో కేసు నడుస్తుండగానే అధికారులు దుకాణ సముదాయాలను కూల్చడం దారుణమని వ్యాపారులు వాపోతున్నారు. ఇదే విషయాన్ని అధికారులను అడగ్గా కేసు తీర్పు రావడంతోనే కూల్చివేత పనులు ప్రారంభించామని సమాధానమిచ్చారు. -
ఐదుగురు అరెస్ట్: నాటు తుపాకీలు స్వాధీనం
కర్నూలు : కర్నూలు జిల్లా అహోబిలంలో పోలీసులు మంగళవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానంగా సంచరిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో వారిని విచారిస్తున్నారు. -
రండి బాబూ.. రండి..
సాక్షి, కర్నూలు : దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి. నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారిని జిల్లా నేతలు దూరం పెడుతున్నారు. కాదూ.. కూడదు అంటే పదవికి ఇంత ఇవ్వాలని బేరం చేస్తున్నారు. అడిగినంత ఇస్తేనే నామినేటెడ్ పదవి అంటూ తెగేసి చెబుతున్నారు. పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. ఈనెల ఒకటిన దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు చివరి నాటికి కొత్త కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని ఆలయ పాలకమండళ్లలో పాగా వేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు మొదలెట్టారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. రాయలసీమలో అత్యధిక దేవాలయాలు ఉన్న జిల్లా కర్నూలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వాటి సంఖ్యా ఇక్కడే అధికం. కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చే ఆలయాలు ఐదు ఉన్నాయి. వాటిలో శ్రీశైలం అతి పెద్దది కాగా మహానంది, ఉరుకుంద, అహోబిలం, ఆర్.ఎస్.రంగాపురం(మద్దిలేటి స్వామి) తరువాత స్థానాల్లో నిలుస్తాయి. ప్రస్తుతం శ్రీశైలం, ఉరుకుంద దేవస్థానాలకు ఆలయ కమిటీలు ఉన్నప్పటికీ తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో అవి రద్దు కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవికి టీడీపీ నుంచి తుగ్గలి నాగేంద్ర పోటీపడుతున్నారు. జిల్లా పరిషత్తు చైర్మన్ పదవిని ఆశించిన ఆయన.. కొన్ని కారణాలతో తప్పుకోవాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయంగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో అవకాశం ఇస్తామని ఓ సీనియర్ నేత హామీ ఇచ్చినట్లు టీడీపీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ పదవి దక్కాలంటే కనీసం రూ. కోటి ఇవ్వాలంటూ ఆ సీనియర్ నేత సోదరుడు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఇన్నేళ్లు కష్టపడినందుకు తగిన ఫలితమే దక్కిందంటూ నాగేంద్ర తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడినట్లు సమాచారం. ఈ విషయంపై అధినేత వద్ద పంచాయితీ పెట్టి తనకు న్యాయం చేయాలని అడగాలని భావిస్తున్నట్లు తెలిసింది. అన్నింటికీ బేరసారాలు.. ఇదే పద్ధతిన మిగిలిన దేవాలయాలకు కొత్త కమిటీలను వేసేందుకు నేతలు సన్నద్ధమయ్యారు. మహానంది, ఆహోబిలం, ఆర్.ఎస్.రంగాపురం కీలకమైన దేవస్థానాలు కావడంతో నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. శ్రీశైల దేవస్థానానికి ఏటా రూ. 100 కోట్లకుపైగా ఆదాయం వస్తుండగా, మహానంది దేవస్థానానికి ఏటా రూ. 5 కోట్లకుపైగా ఆదాయం ఉంది. ఉరుకుంద, ఆర్ఎస్ రంగాపురం, ఆహోబిలం, యాగంటి దేవాలయాలకు రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది. బేతంచెర్ల మండలంలోని మద్దిలేటి స్వామి దేవస్థానానికి ఆ ప్రాంత వాసులే చైర్మన్ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. అయితే నియోజకవర్గస్థాయిలో పార్టీకి సంబంధించిన ఖర్చులంతా భరించాలని అక్కడి నాయకుడు షరతు విధించినట్లు చర్చ జరుగుతోంది. ఇక వీటితో పాటు రూ. 20 లక్షల నుంచి రూ. కోటి మధ్యన ఆదాయం ఉండే దేవాలయాలు మూడు ఉన్నాయి. వాటిలో కొత్తూరు సుబ్రమణ్యస్వామికి ట్రస్టుబోర్డు ఉండగా మిగిలిన వాటికి ఇంకా ఏర్పడలేదు. బనగానపల్లె నియోజకవర్గంలో ఉన్న నందవరం చౌడేశ్వరీ దేవి ఆలయం, పాణ్యం పరిధిలో ఉన్న కాల్వబుగ్గ ఆంజనేయస్వామి దేవస్థానాలకు గట్టి పోటీ ఉంది. రూ. 2 లక్షల నుంచి రూ. 20 లక్షలలోపు ఉన్న దేవాలయాలు 89 ఉన్నాయి. జిల్లాలో 81 దేవాలయాలకు ట్రస్టుబోర్డు ఏర్పాటుకు దేవదాయశాఖ అనుమతి ఉంది. ప్రస్తుతం 29 దేవాలయాలకు ఆలయ కమిటీలు కొనసాగుతుండగా 52కు కొత్త కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. రూ. కోటికిపైగా ఆదాయం ఉండే ఆలయాల ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు దేవదాయశాఖ పరిధిలో ఉండగా.. అంతకంటే తక్కువ ఆదాయం ఉండే వాటికి సంబంధించి జిల్లా స్థాయిలోనే నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పండుగల నాటికల్లా కమిటీల ఏర్పాటు అనివార్యమేనా..? రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలక మండళ్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. ఆ ప్రకటన జారీ చేశాక కమిటీ సభ్యుల నియామకానికి కనీసం నెల రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉండగా ఈ లోగా వినాయకచవితి పండుగ ముంచుకొస్తోంది. ఆ తర్వాత దసరా వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నూతన ధర్మకర్తల కమిటీ నియామకం నిమిత్తం నోటిఫికేషన్‌ను ఎప్పుడెప్పుడు జారీ చేస్తుందా అని టీడీపీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పండుగలు వచ్చేస్తున్న సందదర్భంగా ప్రభుత్వం నూతన పాలక కమిటీలను యుద్ధ ప్రాతిపదికన నియమించాల్సి ఉంది. లేని పక్షంలో చవితి, నవరాత్రి మహోత్సవాల నిర్వహణకు తప్పనిసరిగా ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేయవలసి వస్తుంది. -
దుకాణాల కూల్చివేత ను అడ్డుకున్న భూమా
ఆళ్లగడ్డ రూరల్/టౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో దుకాణాలను ఆదివారం అధికారులు కూల్చివేశారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని కూల్చివేతను అడ్డుకొన్నారు. అహోబిలం మఠానికి ఒక న్యాయం న్యాయం..సామాన్య ప్రజలకు మరో న్యాయమా అంటూ అధికారులపై భూమా మండిపడ్డారు. బాధితులకు అన్నీ సమకూర్చిన తరువాతే కూల్చివేత పనులు ప్రారంభించాలని సూచించారు. అహోబిలంలో 210 సర్వే నంబర్ దేవస్థానానికి చె ందిన ఆస్తి. అయితే ఇందులో 50 సంవత్సరాల క్రితం గ్రామస్తులు రేకులషెడ్లు వేసుకొని వ్యాపారం చేస్తున్నారు. దాదాపు 250 కుటుంబాల వారు ఈ దుకాణాల్లో భక్తులకు అవసరమైన వస్తువులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అయితే దేవస్థానం పరిధిలోని దుకాణాలు తొలగించాలని మఠం ప్రతినిధి రంగరాజన్ కోర్టు ఉత్తర్వులతో పోలీసులను వెంటబెట్టుకొని ఆదివారం ఇక్కడికి వచ్చారు. ప్రొక్లయిన్లతో చిన్న సుంకన్న, పల్లె సాంబయ్య, వీరభద్రుడుల దుకాణాలను కూల్చివేశారు. దీంతో బాధితులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి తరలి వచ్చి నిరసన తెలిపారు. వ్యాపార సముదాయాలను కూల్చివేస్తే తాము ఎలా బతకాలంటూ కొందరు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు వారిని వారించారు. వందలాది మంది బాధితులు ఒక వైపు, మఠం ప్రతినిధులు మరొక వైపు ఉండడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భూమా రాకతో ఆగిన కూల్చివేత పనులు.. అహోబిలంలో వ్యాపారుల రేకుల షెడ్లు కూల్చివేస్తున్నారని సమాచారం తెలుసుకున్న భూమా నాగిరెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. తొలగింపు ప్రక్రియ వెంటనే నిలిపివేయించారు. బాధితుల తరఫున అక్కడే అధికారులతో మాట్లాడారు. 210 సర్వే నంబర్లో మఠం విశ్రాంతి గదులను మొదట కూల్చివేసి తరువాత దుకాణాల సముదాయాలను తొలగించాలని డిమాం డ్ చేశారు. మఠం ఆస్తులకో న్యాయం, సామాన్య ప్రజలకో న్యాయం పనికిరాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఇచ్చినా లెక్క చేయకుండా సాంబయ్య ఇంటిని, దుకాణాన్ని ఎలా తొలగిస్తారని భూమా ప్రశ్నించారు. బాధితులకు పునరావాసం కల్పించకుండా తొలగింపు పనులు ఎలా చేపడతారని మండిపడ్డారు. భారీ పోలీస్ బందోబస్త్: దుకాణాల కూల్చివేతలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ రామాంజనేయరెడ్డి, సీఐలు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పది మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ 50 మంది, 30 మంది మహిళా కానిస్టేబుల్ బందోబస్తులో పాల్గొన్నారు. భూమా వెంట వైఎస్సార్సీపీ నాయకులు బీవీ రామిరెడ్డి, కుమార్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాముయాదవ్, రామోహన్‌రెడ్డి, సిద్ది సత్యం, న్యాయవాదులు శివరామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డిలు ఉన్నారు.