తెలుగు తమ్ముళ్ల ఘర్షణ: 30 మందికి గాయాలు | Fight between TDP Leaders | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల ఘర్షణ: 30 మందికి గాయాలు

Jan 8 2016 7:45 PM | Updated on Oct 2 2018 6:46 PM

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఇన్‌చార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గీయులు శుక్రవారం పరస్పరం దాడులకు పాల్పడ్డారు.

ఆళ్లగడ్డ టౌన్(కర్నూలు) : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఇన్‌చార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గీయులు శుక్రవారం పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇరువర్గాలు ఒకరికొకరు ఎదురుపడిన సమయంలో మాటామాటా పెరిగి ఈ ఘర్షణకు దారితీసినట్లు గ్రామస్తులు తెలిపారు.

రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేసుకుంటూ వీధుల్లో పరుగులు పెట్టడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డ డీఎస్పీ దేవదానం, సీఐ ఓబులేసు, ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతపరిచి, పరిస్థితిని సమీక్షించారు. రెండు వర్గాలకు చెందిన 25 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement