ఘనంగా నృసింహ స్వామి జయంతోత్సవాలు | grand celebration of nrusimha birthday | Sakshi
Sakshi News home page

ఘనంగా నృసింహ స్వామి జయంతోత్సవాలు

May 2 2017 11:37 PM | Updated on Sep 5 2017 10:13 AM

ఘనంగా నృసింహ స్వామి జయంతోత్సవాలు

ఘనంగా నృసింహ స్వామి జయంతోత్సవాలు

అహోబిల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.

ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం దిగువ అహోబిలంలో వెలసిన ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాదవరస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను కొలువుంచి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తిరమంజనం నిర్వహించి స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామి, అమ్మవార్లను కొలువుంచి మాఢ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈనెల 9వ తేదీ వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement