వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో దళితుల అణచివేత | YSRCP Central Office Celebrates Gurram Joshua and Bhagat Singh Jayanti | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో దళితుల అణచివేత

Sep 29 2026 5:27 AM | Updated on Sep 29 2026 5:27 AM

YSRCP Central Office Celebrates Gurram Joshua and Bhagat Singh Jayanti

గుర్రం జాషువా, భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీసీ నేతలు

గుర్రం జాషువా, భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడతాం  

వైఎస్సార్‌సీపీ నేతల స్పష్టీకరణ 

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జాషువా, భగత్‌సింగ్‌ జయంతి వేడుకలు

సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పాలనలో దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలపై అణచివేత, వివక్ష పెరిగిపోయాయని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మహాకవి గుర్రం జాషువా, విప్లవవీరుడు భగత్‌సింగ్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని గుర్రం జాషువా, భగత్‌సింగ్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అరి్పంచారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ... సమాజంలో కులాంతరాలు, అంటరానితనం, వివక్షను రూపుమాపేందుకు మహాకవి గుర్రం జాషువా తన సాహిత్యాన్ని ఒక ఆయుధంగా మలుచుకున్నారని నేతలు కొనియాడారు.

అస్పృశ్యతను ఎదుర్కొంటూ ఆయన రాసిన ప్రతి కవిత, కావ్యం సమాజానికి కనువిప్పు కలిగించాయని గుర్తుచేశారు. దేశ స్వాతంత్య్రం కోసం, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి 23వ ఏటనే ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన భగత్‌సింగ్‌ త్యాగం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో పేద, అణగారిన వర్గాలకు విద్య, వైద్యం, సంక్షేమం అందించడానికి, రాజకీయ ప్రాతినిథ్యం, రక్షణ కల్పించడానికి, సామాజిక గౌరవాన్ని పెంపొందించడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు.

ఇందుకు భిన్నంగా చంద్రబాబు పాలనలో అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. జాషువా, భగత్‌సింగ్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ నాయకులు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్ , వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement