అహోబిలంలో ఉద్రిక్తత | demolition drive, shops pulled down at Ahobilam Temple | Sakshi
Sakshi News home page

అహోబిలంలో ఉద్రిక్తత

Aug 23 2015 7:55 AM | Updated on Sep 3 2017 8:00 AM

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో దేవస్థాన పరిధిలోని దుకాణ సముదాయాలను అధికారులు కూల్చివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో దేవస్థాన పరిధిలోని దుకాణ సముదాయాలను అధికారులు కూల్చివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున అహోబిలం చేరుకున్న అధికారులు ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా కూల్చివేత ప్రారంభించారు. దీంతో దుకాణదారులు తీవ్రంగా ప్రతిఘటించారు.

అడ్డువచ్చిన వారిని పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారు. కాగా కోర్టులో కేసు నడుస్తుండగానే అధికారులు దుకాణ సముదాయాలను కూల్చడం దారుణమని వ్యాపారులు వాపోతున్నారు. ఇదే విషయాన్ని అధికారులను అడగ్గా కేసు తీర్పు రావడంతోనే కూల్చివేత పనులు ప్రారంభించామని సమాధానమిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement