వైభవో పేతం.. స్వాతి మహోత్సవం | Glory of swati ceremony | Sakshi
Sakshi News home page

వైభవో పేతం.. స్వాతి మహోత్సవం

Oct 31 2016 10:51 PM | Updated on Sep 4 2017 6:48 PM

వైభవో పేతం.. స్వాతి మహోత్సవం

వైభవో పేతం.. స్వాతి మహోత్సవం

అహోబిల క్షేత్రంలో వెలసిన స్వాతి వేడుకలు సోమవారం వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ నృసింహస్వామి అవతార దినమైన స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకుని స్వామి జయంతోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో వెలసిన స్వాతి వేడుకలు సోమవారం  వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ  నృసింహస్వామి అవతార దినమైన స్వాతి నక్షత్రాన్ని పురష్కరించుకుని స్వామి జయంతోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలోని 10 దేవాలయాల్లో కొలువైన స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో కొలువైన శ్రీ ప్రహ్లాదవరద,  శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను  శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుంచి ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తర్వాత స్వాతి , సుదర్శన హోమాలు ఘనంగా నిర్వహించారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement