వైభవంగా ముగిసిన పవిత్రోత్సవం | pavitrotsavam ends grandly | Sakshi
Sakshi News home page

వైభవంగా ముగిసిన పవిత్రోత్సవం

Oct 14 2016 11:36 PM | Updated on Sep 4 2017 5:12 PM

వైభవంగా ముగిసిన పవిత్రోత్సవం

వైభవంగా ముగిసిన పవిత్రోత్సవం

ఎగువ అహోబిలం శ్రీజ్వాలనృసింహస్వామి ఆలయంలో నాలుగురోజుల పాటు నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ముగిసాయి. తెల్లవారు జామున నిత్య పూజలు, హోమం, గోష్టి తదితర పూజలు, రాత్రి గ్రామోత్సవం అనంతరం అత్యంత భక్తిశ్రద​‍్ధలతో హోమం నిర్వహించి పూర్ణహుతి ఇచ్చారు.

అహోబిలం (ఆళ్లగడ్డ) : ఎగువ అహోబిలం శ్రీజ్వాలనృసింహస్వామి ఆలయంలో నాలుగురోజుల పాటు నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలు శుక్రవారం రాత్రి  వైభవంగా ముగిసాయి.  తెల్లవారు జామున నిత్య పూజలు, హోమం, గోష్టి తదితర పూజలు,  రాత్రి గ్రామోత్సవం అనంతరం అత్యంత భక్తిశ్రద​‍్ధలతో హోమం నిర్వహించి పూర్ణహుతి ఇచ్చారు. కార్యక్రమంలో ఈఓ వాణి, జీపీఏ సంపత్, ప్రదానార్చకులు వేణుగోపాలన్‌ ఆధ​‍్వర్యంలో నిర్వహించారు.  
 
 నేడు దిగువ అహోబిలంలో పవిత్రోత్సవం ప్రారంభం 
దిగువ అహోబిలంలో వెలసిన శ్రీజ్వాలనృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఆలయంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న పవిత్రోత్సవం శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఉదయం విష్వక్సేనుల వీధి ఉత్సవం, అనుజ్ఞ మృత్యుజ్ఞ మృత్సంగ్రహణము, రక్షాభంధనం కార్యక్రమాలు చేపట్టనున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement