వైభవో పేతం.. స్వాతి మహోత్సవం | grand celebration of swati mahochavam | Sakshi
Sakshi News home page

వైభవో పేతం.. స్వాతి మహోత్సవం

Sep 6 2016 10:16 PM | Updated on Sep 4 2017 12:26 PM

ప్రత్యేక అలంకరణలో శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వామి

ప్రత్యేక అలంకరణలో శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వామి

అహోబిల క్షేత్రంలో మంగళవారం స్వాతి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. లక్ష్మీ నృసింహ స్వామి జన్మనక్షాత్రాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

– నవ నారసింహ క్షేత్రాల్లోని లక్ష్మీ నృసింహస్వామికి ప్రత్యేక పూజలు
 
ఆళ్లగడ్డ:  అహోబిల క్షేత్రంలో మంగళవారం స్వాతి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. లక్ష్మీ నృసింహ స్వామి జన్మనక్షాత్రాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నవ నారసింహ క్షేత్రాల్లో స్వయంభువుగా వెలసిన స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు. దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాదవరదుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ.. నిత్య పూజలు చేశారు. ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో కొలువుదీర్చి ముద్రకర్త శ్రీమాణ్‌ వేణుగోపాలన్, మణియార్‌ వైకుంఠం స్వామి ఆధ్వర్యంలో అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలోని స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యంతో భక్తులు తరించారు. అనంతరం స్వాతి, సుదర్శన హోమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement