జయంత్యుత్సవం..నారసింహుని వైభవం | glorious narasimhaswamy Jayantyutsavam | Sakshi
Sakshi News home page

జయంత్యుత్సవం..నారసింహుని వైభవం

May 8 2017 10:05 PM | Updated on Sep 5 2017 10:42 AM

జయంత్యుత్సవం..నారసింహుని వైభవం

జయంత్యుత్సవం..నారసింహుని వైభవం

ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక మండపంలో ఉత్సవమూర్తులను కొలువుంచి అర్చన, అభిషేకాలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను నూతన పట్టువస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సోమవారం రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. కర్ణాటక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఈశ్వరప్ప.. నరసింహ స్వామి జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్‌ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
 

Advertisement
 
Advertisement
Advertisement