
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం (07-10-2025) ఆయన తాడేపల్లిలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. చంద్రబాబు సర్కార్ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తోందని.. జంకు లేకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని వైఎస్ జగన్ మండిపడ్డారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అరాచకం, అవినీతి కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి పాలన మీద ధ్యాస లేదు.. పూర్తిగా పాలన గాడితప్పింది. కేవలం సొంత ఆదాయాలు పెంచుకోవడంమీదే వీళ్ల ధ్యాస అంటూ మండిపడ్డారు.





















