
భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు శ్రావ్య వర్మ అనే అమ్మాయిని అతడు వివాహం చేసుకోబోతున్నాడు

ఇప్పటికే శ్రీకాంత్- శ్రావ్యల నిశ్చితార్థం జరిగింది పెళ్లి తేదీ సమీపిస్తుండటంతో అతిథుల్ని ఆహ్వానించిన ఈ జంట.. ప్రీ వెడ్డింగ్ షూట్‌తో పాటు మరికొన్ని ముఖ్యమైన ఈవెంట్లను మొదలుపెట్టింది

శ్రావ్య వర్మ మరెవరో కాదు.. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మేనకోడలు

చాన్నాళ్ల నుంచే శ్రీకాంత్- శ్రావ్యలకు పరిచయం ఉందట శ్రావ్య టాలీవుడ్లో స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందింది

నాగార్జున, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తదితరులకు శ్రావ్య స్టైలింగ్ చేస్తోంది

ఈ క్రమంలో ఇటీవలే తన స్నేహితులకు శ్రావ్య బ్యాచిలరెట్ పార్టీ ఇచ్చింది

ఈ సందర్భంగా తన ఫ్రెండ్‌ను జాగ్రత్తగా చూసుకోమంటూ రష్మిక శ్రీకాంత్‌కు చెప్పింది

ఇందుకు స్పందనగా శ్రీకాంత్ కూడా తనను మహారాణిలా చూసుకుంటానంటూ బదులివ్వడంవిశేషం

కీర్తి సురేశ్ నటించిన గుడ్‌లక్ సఖి సినిమాకు శ్రావ్య కో ప్రొడ్యూసర్ కావడం విశేషం







కాగా శ్రీకాంత్ నమ్మాల్వార్ కిదాంబి 1993, ఫిబ్రవరి 7న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించాడు.

బ్యాడ్మింటన్‌పై మక్కువతో కఠోర సాధన చేసి.. స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు

2011 కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో మెన్స్ డబుల్స్ విభాగంలో, మిక్స్డ్ డబుల్స్‌లో రతజం శ్రీకాంత్ వరుసగా కాంస్యం, రజతం గెలిచాడు

2013లో థాయ్‌లాండ్ ఓపెనర్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ టైటిల్ సొంతం

తన కెరీర్లో ఎన్నో విజయాలు సాధించి వరల్డ్ నంబర్ వన్‌గా ఎదిగాడు

భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ ,అర్జున అవార్డు పొందాడు

థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు


