
నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం సందర్శకులతో పోటెత్తింది

సెలవురోజు కావడంతో పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. యువత, విద్యార్థులు, పిల్లలతో స్టాళ్లు కిటకిటలాడాయి

ముఖ్యంగా చిన్నారులు తమకిష్టమైన ఆంగ్ల కథలు, క్లాసిక్స్ పుస్తకాలను విరివిగా కొనుగోలు చేశారు. ఒకవైపు పుస్తక ఆవిష్కరణలు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు, అమ్మకాలతో సందడి నెలకొంది

పుస్తక ప్రదర్శన కేవలం పుస్తకాల అమ్మకాలకు మాత్రమే పరిమితం కాకుండా రచయితలను, పాఠకులను ఒకచోట చేర్చే వేదికగా మారింది











