నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna Teja) తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
వీఐపీ విరామ సమయంలో ఆలయానికి వచ్చిన ఆయన స్వామివారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర, దేశ ప్రజలు క్షేమంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.


