బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) బర్త్‌డే ఈ రోజు(జులై 31). కియారా అసలు పేరు అలియా అద్వానీ. సినీ పరిశ్రమలోకి వచ్చే ముందే సల్మాన్ ఖాన్ సూచన మేరకు ఆమె తన పేరును 'కియారా'గా మార్చుకున్నారు.
యారా కేవలం ఒక సంవత్సరం వయస్సు ఉన్నప్పుడే తన తల్లితో కలిసి 'క్రీమ్' బేబీ సోప్ ప్రకటనలో నటించారు.#HBDKiaraAdvani
సినిమాల్లోకి రాకముందు కియారా ముంబైలోని ఒక ప్రీ-స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పడం, పద్యాలు నేర్పించడం చేసేవారు.
2014లో వచ్చిన 'ఫగ్లీ' సినిమా ద్వారా కియారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఎం.ఎస్. ధోని బయోపిక్ లో ధోని భార్య 'సాక్షి' పాత్రతో కియారాకు మంచి గుర్తింపు లభించింది.
సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై డెబ్యూతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు.
'కబీర్ సింగ్': విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి'కి హిందీ రీమేక్ అయిన 'కబీర్ సింగ్' లో 'ప్రీతి' పాత్ర కియారా కెరీర్‌ను మలుపు తిప్పి, ఆమెను రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా స్టార్‌గా మార్చింది.
ప్రేమ - పెళ్లి: 'షేర్‌షా' సినిమా షూటింగ్ సమయంలో నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడిన కియారా, 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో అతడిని వివాహం చేసుకున్నా.
(Images Source : Instagram (kiaraaliaadvani)


