క్వారీలో ప్రమాదం..ఇద్దరి మృతి | The accident at Quarry | Sakshi
Sakshi News home page

క్వారీలో ప్రమాదం..ఇద్దరి మృతి

Dec 12 2017 4:27 PM | Updated on Dec 12 2017 4:28 PM

విజయనగరం : బొబ్బిలి మండలం బంకురువలస మాంగనీస్‌ క్వారీలో మంగళవారం ప్రమాదం జరిగింది. క్వారీలో బండరాళ్లు మీద పడి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసి స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement