వారి శౌర్యాన్ని పదాల్లో వర్ణించలేము:మోదీ | Words can't describe valour of our policemen, says narendra Modi | Sakshi
Sakshi News home page

వారి శౌర్యాన్ని పదాల్లో వర్ణించలేము:మోదీ

Oct 21 2014 12:29 PM | Updated on Mar 29 2019 9:24 PM

వారి శౌర్యాన్ని పదాల్లో వర్ణించలేము:మోదీ - Sakshi

వారి శౌర్యాన్ని పదాల్లో వర్ణించలేము:మోదీ

దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

న్యూఢిల్లీ: దేశం కోసం నిస్వార్ధంగా పనిచేసే పోలీస్ వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశ సేవలో భాగంగా ప్రాణాల్నేపణంగా పెట్టిన పోలీసుల శౌర్యాన్ని పదాల్లో వర్ణించలేమన్నారు. మంగళవారం పోలీస్ స్మారకోత్సవం సందర్భంగా  ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యల్ని పోస్ట్ చేశారు. 'పనిలో పోలీసులు చూపే నిబద్ధత వెలకట్టలేనిది. వారు దేశానికి సేవ చేసే క్రమంలో ప్రాణాలను కూడా లెక్క చేయరు. వారి శౌర్యాన్ని పదాల్లో వర్ణించలేను'అని తెలిపారు. వారి యొక్క సేవ తమకు ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తోందని మోదీ స్పష్టం చేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement