గొలుసులతో కూతుర్ని స్తంభానికి కట్టేసి.. | Woman locks 8-year-old daughter to lamp post with shackles | Sakshi
Sakshi News home page

గొలుసులతో కూతుర్ని స్తంభానికి కట్టేసి..

Oct 28 2016 7:43 PM | Updated on Sep 4 2017 6:35 PM

గొలుసులతో కూతుర్ని స్తంభానికి కట్టేసి..

గొలుసులతో కూతుర్ని స్తంభానికి కట్టేసి..

8 ఏళ్ల బాలిక స్కూలు ఎగ్గొట్టినందుకు తల్లి క్రమశిక్షణ పేరుతో అమానుషంగా ప్రవర్తించింది.

8 ఏళ్ల బాలిక స్కూలు ఎగ్గొట్టినందుకు తల్లి క్రమశిక్షణ పేరుతో అమానుషంగా ప్రవర్తించింది. తల్లి ఆ పాప కాళ్లకు గొలుసులు వేసి, అపార్ట్మెంట్ బయట వీధిలో ఓ స్తంభానికి తాళం వేసి కట్టేసింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఈ దారుణం జరిగింది.

వీధిలో వెళ్తున్న వారు బాలిక దీనస్థితిని చూసి కాపాడేందుకు ప్రయత్నించారు. కాగా కాళ్లకు గొలుసులు వేసి తాళం వేసి ఉండటంతో వీలుకాలేదు. వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడి చేరుకునే వరకు గంటకుపైగా ఆ అమ్మాయి అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. స్కూలుకు వెళ్లనందుకు తన తల్లి గొలుసులతో కట్టివేసిందని ఆ పాప పోలీసులకు చెప్పింది. పోలీసులు పాప తల్లిని పిలిపించి తాళం తీయించి విడిపించారు. మరోసారి కూతురి పట్ల ఇలా ప్రవర్తించవద్దని పోలీసులు అమ్మాయి తల్లిని మందలించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement