యువతిపై 11 మంది లైంగికదాడి | Woman Gang-Raped in Punjab's Moga | Sakshi
Sakshi News home page

యువతిపై 11 మంది లైంగికదాడి

May 1 2015 10:39 AM | Updated on Sep 3 2017 1:14 AM

యువతిపై 11 మంది లైంగికదాడి

యువతిపై 11 మంది లైంగికదాడి

పంజాబ్లో మరో దారుణం.. అదే జిల్లా అదే ప్రాంతంలో మరో పైశాచిక చర్య. కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి బస్సులోంచి తోసివేయడంతో యువతి మరణించిన ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో దుర్మార్గం.

మోగా: పంజాబ్లో మరో దారుణం.. అదే జిల్లా అదే ప్రాంతంలో మరో పైశాచిక చర్య. కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి బస్సులోంచి తోసివేయడంతో యువతి మరణించిన ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మోగా జిల్లాలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. దాదాపు పదకొండు మంది వ్యక్తులు ఓ యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈదారుణానికి పాల్పడినవారిలో బాధితురాలి స్నేహితురాలి భర్త కూడా ఉన్నాడు.

పోలీసులు వివరాల ప్రకారం.. బాధితురాలు తన స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లింది. స్నేహితురాలి కోసం  ఎదురుచూస్తుండగా అంతలో వచ్చిన ఆమె భర్త మరికొందరు కలసి అదే గ్రామంలోని ఓ పాడుబడ్డ ఇంట్లోకి ఎత్తుకెళ్లారు. బాధితురాలు వారిని నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా కొట్టి మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు వివరాలు సేకరించిన పోలీసులు బాధితురాలిని మెడికల్ పరీక్షల కోసం పంపించారు. ఆమె స్నేహితురాలు, భర్త మిగితావారిపై కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోక పోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement