breaking news
Woman Gang-Rape
-
చిన్నారిని చంపుతామని బెదిరించి.. గ్యాంగ్ రేప్
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రి నుంచి బైక్‌పై ఇంటికొస్తున్న ఓ జంటను అడ్డగించిన నలుగురు దుండగులు భర్త, 3 నెలల చిన్నారి ముందే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తను తీవ్రంగా కొట్టి చెట్టుకు కట్టేసిన దుండగులు.. సదరు మహిళను పొలంలోకి ఈడ్చుకెళ్లి, చిన్నారిని చంపేస్తామని తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద కారుతో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయన్నారు. అత్యాచారం చేసిన అనంతరం ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించి దుండగులు పరారైనట్లు వెల్లడించారు. ఈ దంపతుల అరుపులు విని అటుగా వచ్చిన రైతులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో పాటు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి గుర్తుతెలియని నలుగురు దుండగులపై కేసు నమోదు చేసినట్లు ముజఫర్‌నగర్ రూరల్ ఎస్పీ అజయ్ సహదేవ్ తెలిపారు. గతేడాది జూలైలో యూపీలోని బులంద్‌షహర్‌లో కారులో వెళ్తున్న ఓ కుటుంబంపై దాడిచేసిన దుండగులు అందర్నీ సమీపంలోని పొలంలోకి ఈడ్చుకెళ్లారు. అనంతరం అందర్నీ చెట్టుకు కట్టేసి తల్లి, కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. -
యువతిపై 11 మంది లైంగికదాడి
మోగా: పంజాబ్‌లో మరో దారుణం.. అదే జిల్లా అదే ప్రాంతంలో మరో పైశాచిక చర్య. కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి బస్సులోంచి తోసివేయడంతో యువతి మరణించిన ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మోగా జిల్లాలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. దాదాపు పదకొండు మంది వ్యక్తులు ఓ యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈదారుణానికి పాల్పడినవారిలో బాధితురాలి స్నేహితురాలి భర్త కూడా ఉన్నాడు. పోలీసులు వివరాల ప్రకారం.. బాధితురాలు తన స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లింది. స్నేహితురాలి కోసం ఎదురుచూస్తుండగా అంతలో వచ్చిన ఆమె భర్త మరికొందరు కలసి అదే గ్రామంలోని ఓ పాడుబడ్డ ఇంట్లోకి ఎత్తుకెళ్లారు. బాధితురాలు వారిని నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా కొట్టి మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు వివరాలు సేకరించిన పోలీసులు బాధితురాలిని మెడికల్ పరీక్షల కోసం పంపించారు. ఆమె స్నేహితురాలు, భర్త మిగితావారిపై కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోక పోవడం గమనార్హం.