ట్రైలర్ అదుర్స్.. | trailor adhurs | Sakshi
Sakshi News home page

ట్రైలర్ అదుర్స్..

Oct 19 2015 6:56 AM | Updated on Aug 27 2019 4:33 PM

ట్రైలర్ అదుర్స్.. - Sakshi

ట్రైలర్ అదుర్స్..

బాతుపై ఆకాశ మార్గంలో ప్రయాణించడం, ఉన్నట్టుండి కత్తి ఝళిపించి డ్రాగన్‌ను చంపడం, పై నుంచి కిందపడుతున్న అమ్మాయిని పట్టుకుని కాపాడటం, గ్రహాంతర వాసులను కంటిచూపుతో కాల్చేయడం...

బాతుపై ఆకాశ మార్గంలో ప్రయాణించడం, ఉన్నట్టుండి కత్తి ఝళిపించి డ్రాగన్‌ను చంపడం, పై నుంచి కిందపడుతున్న అమ్మాయిని పట్టుకుని కాపాడటం, గ్రహాంతర వాసులను కంటిచూపుతో కాల్చేయడం... కామిక్ హీరోలు సూపర్‌మాన్, స్పైడర్‌మాన్‌లు గుర్తుకొస్తున్నారు కదూ.!! కానీ ఇవన్నీ ఎన్నికల ప్రచారంలో భాగం!! కెనడాలో పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్నాయి.

అందులో ఒక అభ్యర్థి ప్రచార వీడియో ఇది. ప్రజలను కాపాడే వాడు, ధరల డ్రాగన్లను చంపేవాడు, కన్జర్వేటివ్ పార్టీ గ్రహాంతరవాసుల్ని కాల్చేసేవాడు వచ్చేస్తున్నాడు... ఓటేసేయండహో అంటున్న స్టార్‌వార్స్ ట్రెయిలర్ లాంటి ప్రచార వీడియో ఇది. ఇది ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కామిక్ పుస్తకాల పాఠకులే ఓటర్లు అయితే వయాట్‌స్కాట్ అనే ఈ అభ్యర్థి సూపర్ డూపర్ హిట్!! ట్రెయిలరే సూపర్... ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఉంటుందో మరి!! కానీ నెట్‌నగరంలో ఓట్లు పడటం కాదు. సొంత నగరంలో వయాట్‌స్కాట్‌కి ఓట్లు పడతాయా లేదా అన్నదే భేతాళ ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement