చోరీకి వెళ్లి మృత్యువాత | The death toll to go to the Robbery | Sakshi
Sakshi News home page

చోరీకి వెళ్లి మృత్యువాత

Oct 5 2015 12:50 AM | Updated on Sep 2 2018 3:46 PM

చోరీకి వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం చర్లపల్లిలో చోటు చేసుకుంది

 నల్లగొండ క్రైం: చోరీకి వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం చర్లపల్లిలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్‌ఐ ధనుంజయ కథనం ప్రకారం.. శేషమ్మగూడెంకు చెందిన నాగరాజు (26) శనివారం రాత్రి పీకలదాకా మద్యం సేవించాడు. చర్లపల్లి గ్రామంలో కత్తుల రాములు ఇంట్లో చోరీ చేసేందుకు గోడదూకి వెళ్లాడు. వంటగదిలోకి వెళ్లి బయటికి వస్తున్న సమయంలో వర్షం పడింది. బండలు జారి వంట గది హాలులో కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement