ముంబైలో గ్యాంగ్‌రేప్ | Teenaged girl gang raped in mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో గ్యాంగ్‌రేప్

Nov 5 2013 3:11 AM | Updated on Sep 2 2017 12:16 AM

ముంబైలో ఓ పదహారేళ్ల యువతిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ముంబై :  ముంబైలో ఓ పదహారేళ్ల యువతిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. గోరేగావ్‌లోని సంతోష్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు తమతో రావాల్సిందిగా శుక్రవారం నలుగురు యువకులు బాధితురాలిని కోరారు. అందరూ తెలిసినవారే కావడంతో ఆమె వారితో వెళ్లడానికి అంగీకరించింది. తర్వాత ఆ కామాంధులు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చారు. సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. రెండ్రోజులు మౌనంగా ఉన్న బాధితురాలు ఆదివారం తన బామ్మతో కలిసి పోలీసులకు  ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement