కేంద్ర హోం మంత్రి షిండేకు శస్త్రచికిత్స | Sakshi
Sakshi News home page

కేంద్ర హోం మంత్రి షిండేకు శస్త్రచికిత్స

Published Sun, Aug 4 2013 12:33 PM

కేంద్ర హోం మంత్రి షిండేకు శస్త్రచికిత్స

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయనకు ఊపిరితిత్తుల సంబంధిత ఆపరేషన్ జరిగినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 71 ఏళ్ల షిండే గతరాత్రి బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారు. అయితే షిండే అనారోగ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు. ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశముంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షిండే హాజరుకానున్నారు. అయితే ఎప్పడు ఆయన ఢిల్లీకి వెళతారనేది తెలియలేదు. శస్త్ర చికిత్స తర్వాత తన తండ్రి బాగానే ఉన్నారని షిండే కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణితి తెలిపారు.

ఆస్పత్రిలో చేరడానికి ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి జయంత్ బాంటియా, ఇతర ఉన్నతాధికారులను శనివారం షిండే కలిశారు. హజ్ హౌస్లో చవాన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. వర్లీలో నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
 
Advertisement