బాలికలపై అత్యాచారం.. 11మంది అరెస్ట్ | Police arrested 11 people for allegedly raping a minor | Sakshi
Sakshi News home page

బాలికలపై అత్యాచారం.. 11మంది అరెస్ట్

Nov 4 2016 12:02 PM | Updated on Jul 28 2018 8:53 PM

బాలికలపై అత్యాచారం.. 11మంది అరెస్ట్ - Sakshi

బాలికలపై అత్యాచారం.. 11మంది అరెస్ట్

మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు

ముంబై: మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బుల్దాన జిల్లా హివర్‌ఖేడాలోని ఆశ్రమ పాఠశాలలో బాలికలపై ఉపాధ్యాయులు, సిబ్బంది అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

జిల్లా ఎస్పీ సంజయ్ బావిష్కర్ ఈ ఘటన వివరాలను వెల్లడిస్తూ.. నినాదీ ఆశ్రమ పాఠశాలలో మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జరిగినట్లు తెలిపారు. పాఠశాల ప్రెసిడెంట్, సెక్రెటరి, జాయింట్ సెక్రటరితో పాటు పలువురు సిబ్బంది ఈ ఘటనలో నిందితులుగా ఉన్నారని.. వీరిపై ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. కేసు విచారణ కోసం మహారాష్ట్ర డీజీపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్‌)ను ఏర్పాటుచేశారు.

కాగా ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్ర డీజీపీ సతీష్ మాథుర్ మాట్లాడుతూ... ఇప్పటివరకూ 11మందిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement