ఓ పక్క చర్చలు.. మరోపక్క కాల్పులు | Pakistan violates ceasefire again in BG sector | Sakshi
Sakshi News home page

ఓ పక్క చర్చలు.. మరోపక్క కాల్పులు

Sep 10 2015 10:47 AM | Updated on Sep 3 2017 9:08 AM

ఓ పక్క ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను నిర్మూలించేందుకు నేడు చర్చలకు సిద్ధమవుతున్న క్రమంలో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది.

పూంచ్: ఓ పక్క ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను నిర్మూలించేందుకు నేడు చర్చలకు సిద్ధమవుతున్న క్రమంలో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గల బీజీ సెక్టార్లో గత రాత్రి సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడ్డారు.

దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు ధీటుగా స్పందించారు. ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. ఈ నెలలోనే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడటం ఇది తొమ్మిదోసారి. ఇరు దేశాల సరిహద్దు విభాగ ఉన్నతాధికారులు నేడు ఢిల్లీలో సమావేశమవుతున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement