మణిపూర్లో బాంబు పేలుళ్లు: ఒకరు మృతి | One killed, six injured in twin-bomb explosions in Manipur | Sakshi
Sakshi News home page

మణిపూర్లో బాంబు పేలుళ్లు: ఒకరు మృతి

Nov 7 2013 10:17 AM | Updated on Aug 25 2018 6:52 PM

మణిపూర్లోని థబుల్ జిల్లాలో గత అర్థరాత్రి రెండు బాంబు పేలుళ్లు సంభవించి ఘటనలో ఒకరు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఇంఫాల్లో వెల్లడించారు.

మణిపూర్లోని థబుల్ జిల్లాలో గత అర్థరాత్రి రెండు బాంబు పేలుళ్లు సంభవించి ఘటనలో ఒకరు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఇంఫాల్లో వెల్లడించారు. మృతుడు పంజాబ్కు చెందిన లాలీ కుమార్ (30)గా గుర్తించినట్లు చెప్పారు. మృతుడు, క్షతగాత్రులంతా భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పని చేస్తు జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. అయితే బాంబు పేలుళ్లలో గాయపడిన వారిని రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించినట్లు చెప్పారు.

 

వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారన్నారు. బాంబుపేలుళ్లపై సమాచారం అందగానే హూటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాంబులను రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చారని పోలీసుల తెలిపారు. ఇది తీవ్రవాదుల దుశ్చర్యగా అనుమానిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement