రెడ్‌లైట్‌ ఏరియాపై రైడ్‌.. విషాదం! | minor girls drowned at red light area | Sakshi
Sakshi News home page

రెడ్‌లైట్‌ ఏరియాపై రైడ్‌.. విషాదం!

Mar 22 2017 10:18 AM | Updated on Sep 17 2018 6:26 PM

రెడ్‌లైట్‌ ఏరియాపై రైడ్‌.. విషాదం! - Sakshi

రెడ్‌లైట్‌ ఏరియాపై రైడ్‌.. విషాదం!

రెడ్‌లైట్‌ ఏరియాలోని వేశ్యగృహాలపై పోలీసులు జరిపిన దాడులు.. విషాదానికి కారణమయ్యాయి.

రెడ్‌లైట్‌ ఏరియాలోని వేశ్యగృహాలపై పోలీసులు జరిపిన దాడులు.. విషాదానికి కారణమయ్యాయి. పోలీసుల నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న ఇద్దరు మైనర్‌ బాలికలు సమీపంలో ఉన్న చెరువులోకి దూకారు. దీంతో ఆ ఇద్దరు నీళ్లలోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో మంగళవారం జరిగింది.

భరత్‌పూర్‌లో వేశ్యగృహాలపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో వారి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు మైనర్‌ అమ్మాయిలు ప్రయత్నించారు. ఈక్రమంలో వారు చెరువులోకి దూకడంతో ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను పోలీసులు వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement