పంజాబ్‌లో దారుణం చోటు చేసుకుంది.
9 మంది మహిళలపై దారుణం
Dec 26 2016 9:58 PM | Updated on Aug 17 2018 2:10 PM
పంజాబ్: పంజాబ్‌లో దారుణం చోటు చేసుకుంది. కపుర్తలా పట్టణంలో ఓ వ్యక్తి తొమ్మిది మంది మహిళలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. రెండు కుటుంబాల మధ్య ఉన్న భూ వివాదమే ఇందుకు దారి తీసినట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఓ మైనర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. భూయి గ్రామానికి చెందిన సర్పంచ్ వినోద్ సెహగల్‌కు మరో కుటుంబానికి మధ్య భూవివాదం తలెత్తింది.
దీంతో ఇరు వర్గాల వారు యాసిడ్ దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలతో పాటు సంఘటనా స్థలంలో ఉన్న ఏడుగురు మహిళా కూలీలు గాయపడ్డారు. తమ స్థలంలో సర్పంచ్ కమ్యూనిటీ సెంటర్‌ను నిర్మిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. క్షతగాత్రులను స్ధానికులు ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఒక కుటుంబానికి సంబంధించిన వారిపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనలో సర్పంచ్‌కు ఎలాంటి ప్రమేయం లేనట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement


