ఆస్తి కోసం తమ్ముడి హత్య | Man kills younger brother over property | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం తమ్ముడి హత్య

Sep 1 2014 4:11 PM | Updated on Aug 25 2018 6:52 PM

రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముడిని ఆస్తి కోసం ఓ వ్యక్తి హతమార్చాడు.

రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముడిని ఆస్తి కోసం ఓ వ్యక్తి హతమార్చాడు. ఈ సంఘటన కాన్పూర్ సమీపంలోని బిల్హౌర్ ప్రాంతంలో జరిగింది. వినీత్ కుమార్ (40) అనే వ్యక్తికి, అతడి తమ్ముడు సునీల్కు ఆస్తి విషయంలో ఆదివారం నాడు గొడవ జరిగింది. దాంతో తర్వాత కొద్ది సేపటికి బాగా తాగి ఉన్న సునీల్ను వినీత్ గట్టిగా తోసి, తలను గోడకేసి కొట్టాడు. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.

సోదరులిద్దరికి కలిపి దాదాపు మూడు కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాన్ని ఇప్పటికే పంచుకున్నారు కూడా. అయితే, సునీల్ తాగుబోతు కావడంతో అతడి ఆస్తి మీద కూడా వినీత్ కన్నేశాడు. అనంతరం వినీత్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి సునీల్ శవాన్ని కాక్వాన్ సమీపంలోని ఓ కాలువ వద్దకు తీసుకెళ్లి, అందులో పారేశాడు. అయితే ఇంటికి తిరిగి వచ్చేసరికే నలుగురినీ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వినీత్ను విచారించగా, నేరం చేసినట్లు అంగీకరించాడు.

Advertisement
 
Advertisement
Advertisement