ఆ ఉద్యోగిషేర్ల విలువ రూ.213 కోట్లు | Infosys board member Srinath Batni sells shares worth Rs.7.46 crore | Sakshi
Sakshi News home page

ఆ ఉద్యోగిషేర్ల విలువ రూ.213 కోట్లు

Jan 21 2014 3:07 AM | Updated on Sep 2 2017 2:49 AM

ఆ ఉద్యోగిషేర్ల విలువ రూ.213 కోట్లు

ఆ ఉద్యోగిషేర్ల విలువ రూ.213 కోట్లు

ఆయనో ఉద్యోగి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 22 ఏళ్ల కిందట చేరారాయన. ప్రస్తుతం డెరైక్టర్లలో ఒకరు. ఆయన దగ్గర కంపెనీకి చెందిన 5,69,847 షేర్లున్నాయి.

బెంగళూరు: ఆయనో ఉద్యోగి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 22 ఏళ్ల కిందట చేరారాయన. ప్రస్తుతం డెరైక్టర్లలో ఒకరు. ఆయన దగ్గర కంపెనీకి చెందిన 5,69,847 షేర్లున్నాయి. వాటి విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం... దాదాపు రూ.213 కోట్లు. సోమవారం ఆయన తన షేర్లలో కొన్ని... అంటే జస్ట్ 20,000 షేర్లే విక్రయించారు. రూ.7.46 కోట్లు ఆయన చేతికొచ్చాయి. ఆయన పేరు శ్రీనాథ్ బట్ని. ఈ విషయాన్ని కంపెనీ సోమవారం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. బట్ని ప్రస్తుతం కంపెనీకి డెలివరీ ఎక్స్‌లెన్స్ హెడ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన దగ్గర మిగిలిన షేర్లు... మొత్తం ఇన్ఫోసిస్‌లో 0.095%కి సమానం. 10 నెలల వ్యవధిలో ఇన్ఫీ షేరు రూ.2,200 నుంచి ప్రస్తుత ధర రూ.3,750కి చేరటంతో బట్ని కొన్ని షేర్లను సొమ్ము చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement