దుబాయ్ విమానాలన్నింటి గమ్యం భారత్!! | India biggest destination country for Dubai airport | Sakshi
Sakshi News home page

దుబాయ్ విమానాలన్నింటి గమ్యం భారత్!!

Jan 30 2014 3:18 PM | Updated on Sep 2 2017 3:11 AM

ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎక్కువ మంది ఎక్కడకు వెళ్తారో తెలుసా.. భారతదేశానికే!!

ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎక్కువ మంది ఎక్కడకు వెళ్తారో తెలుసా.. భారతదేశానికే!! 2013లో ఇలాగే జరిగిందని ఓ నివేదికలో వెల్లడైంది. 2012 సంవత్సరంలో 73.47 లక్షల మంది ప్రయాణికులే భారత దేశానికి రాగా, 2013 సంవత్సరంలో అది 84 లక్షలకు పెరిగింది. 14.3 శాతం పెరుగుదల కనిపించింది. ఈ విషయాన్ని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సంస్థ తెలిపింది. భారత్ తర్వాత రెండో స్థానంలో బ్రిటన్ నిలిచింది. ఆ దేశానికి 50.99 లక్షల మంది వెళ్లగా, సౌదీ అరేబియాకు 48.25 లక్షల మంది వెళ్లారు.

దుబాయ్ వైమానిక రంగంలోనే ఇది చాలా చరిత్రాత్మక కాలం అని, ఎయిర్బస్ ఎ-380 విమానాలు కూడా ఇక్కడ దిగేందుకు అవకాశం ఉందని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. ఈ విమానాశ్రయం నుంచి వార్షిక ప్రయాణికుల ట్రాఫిక్ 6.64 కోట్లకు చేరుకోవడంతో మరో ఘనత సాధించినట్లయింది. 2012తో పోలిస్తే ఇది 15.2 శాతం ఎక్కువ.

Advertisement
 
Advertisement
Advertisement