మతిస్థిమితం తప్పి భార్యను నరికేశాడు.. | Husband kills wife | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం తప్పి భార్యను నరికేశాడు..

Sep 12 2015 4:31 PM | Updated on Jul 30 2018 8:29 PM

మతిస్థిమితం కోల్పోయి ఓ వ్యక్తి భార్యను నరికి చంపాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

కోడేరు (మహబూబ్‌నగర్) : మతిస్థిమితం కోల్పోయి ఓ వ్యక్తి భార్యను నరికి చంపాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఎత్తం గ్రామానికి చెందిన బాలస్వామి (50) కొన్నాళ్లుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు. శుక్రవారం ఉదయం భార్య చంద్రమ్మతోపాటు సింగవట్నం సంగమేశ్వర గ్రామీణ బ్యాంకుకు వెళ్లి రూ.40వేలు పంట రుణం తీసుకొచ్చాడు. రాత్రి పడుకునే సమయంలో కూడా బాగానే ఉన్నాడు.

అయితే అర్థరాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్య చంద్రమ్మ(46)ను గొడ్డలితో తలనరికి చంపాడు. తలలో మెదడు తీసుకుని శనివారం ఉదయమే ఇంటి ముందు కూర్చుని తాను పొట్టేలును కోసి కుప్పలు వేశానని చుట్టుపక్కల వారికి చూపించాడు. దీంతో గ్రామస్తులు ఇంట్లోకి వెళ్లి చూడగా దారుణం వెలుగుచూసింది. దీనిపై గ్రామస్తులు కోడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలస్వామిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement