భర్త వేధింపులు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య | Husband harassments... Software engineer suicide | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

Mar 6 2016 2:01 AM | Updated on Nov 6 2018 7:56 PM

భర్త వేధింపులు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య - Sakshi

భర్త వేధింపులు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

భర్త వేధింపులకు తాళలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.

హైదరాబాద్: భర్త వేధింపులకు తాళలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐ వాసు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన ఎస్.మల్లేశ్వరి(34) వివాహం 2009లో అమిత్ మోహిత్‌తో జరిగింది. మోహిత్‌ది మహారాష్ట్ర ఫాల్గర్ వసాయి గ్రామం. మాదాపూర్ ఇనార్బిట్‌మాల్ సమీపంలోని కాంటార్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న వీరు నల్లగండ్ల అపర్ణ సరోవర్‌లో ఉంటున్నారు. అయితే భర్త వేధింపులకు గురిచేయడంతో వాటిని తట్టుకోలేక శుక్రవారం సాయంత్రం మల్లేశ్వరి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement