తిరుమలకు పోటెత్తిన భక్తులు | heavy people attend the tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలకు పోటెత్తిన భక్తులు

Jul 19 2015 1:29 AM | Updated on Sep 3 2017 5:45 AM

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆదివారాలతోపాటు గోదావరి పుష్కరాల నేపథ్యంలో మంగళవారం వరకు ....

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆదివారాలతోపాటు గోదావరి పుష్కరాల నేపథ్యంలో మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. దీంతో భక్తులు పుష్కరాలతోపాటు తిరుమల బాట పట్టారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు 60 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. వెలుపల రెండు కిలోమీటర్ల వరకు భక్తులు క్యూ కట్టారు. వీరికి 20 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. కాలిబాటల్లో నడచి వచ్చిన భక్తులు నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూల్లో బారులు తీరారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement