మోడల్ నగరం గుజరాత్ నేరాలకు మోడల్ గా మారిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి శైలేష్ పర్మార్ ఎద్దేవా చేశారు.
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రం నేరాలకు మోడల్ గా మారిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి శైలేష్ పర్మార్ ఎద్దేవా చేశారు. గుజరాత్ రాష్ట్రంలో నేరాల చిట్టా క్రమేపీ పెరుగుతుందని ఆయన మండిపడ్డారు. గతంలో గుజరాత్ ను ఆదర్శ నగరం చెప్పుకున్నా.. ఇప్పుడు మాత్రం నేరాల నగరం చెప్పకోక తప్పదని విమర్శించారు. ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు హరించుకుపోవడానికి హోం శాఖదే పూర్తి వైఫల్యమని ఆయన విరుచుకుపడ్డారు.
ఈ విషయం బీజేపీ 17 ఏళ్ల పాలన చూస్తే అవగతం అవుతుందంటూ చురకలంటించారు. బీజేపీ పాలించిన సంవత్సరాల్లో రాష్ట్రంలో నేర చరిత్ర అధికంగా ఉందనడానికి జాతీయ నేర రికార్డు బ్యూరో నివేదికలో తేటతెల్లమైదంటూ పర్మార్ విమర్శలకు దిగారు.