మెరుపు తగ్గని పసిడి | Gold price soars, hits 7-month high | Sakshi
Sakshi News home page

మెరుపు తగ్గని పసిడి

Aug 20 2013 2:05 AM | Updated on Sep 1 2017 9:55 PM

ముంబై బులియన్ స్పాట్ మార్కెట్‌లో ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ. 31,520కి చేరింది.

 ముంబై:  ముంబై బులియన్ స్పాట్ మార్కెట్‌లో ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ. 31,520కి చేరింది. 22 క్యారెట్ల ధర రూ.40 ఎగసి 31,365కు చేరింది. వెండి కేజీ ధర రూ.300 లాభంతో రూ.51,785కు చేరింది.  
 
 ఫ్యూచర్స్‌లో...: అంతర్జాతీయంగా 2 నెలల గరిష్ట స్థాయికి చేరిన పసిడి ఔన్స్ ధర సోమవారం కడపటి సమాచారం అందేసరికి 1,373 డాలర్ల స్థాయిలో, వెండి 23 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో పసిడి రూ.315 లాభం (1%)తో రూ.31,155 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. వెండి కేజీ ధర కూడా ఒకశాతం లాభంతో (రూ.488) రూ.51,150 వద్ద ట్రేడవుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement