జ్యూస్ లో మత్తుమందు కలిపి... | Ghaziabad builder arrested for raping staffer | Sakshi
Sakshi News home page

జ్యూస్ లో మత్తుమందు కలిపి...

Aug 27 2014 8:59 PM | Updated on Aug 25 2018 4:14 PM

జ్యూస్ లో మత్తుమందు కలిపి... - Sakshi

జ్యూస్ లో మత్తుమందు కలిపి...

అత్యాచార ఆరోపణలతో ఘజియాబాద్ బిల్డర్ ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఘజియాబాద్(యూపీ): అత్యాచార ఆరోపణలతో ఘజియాబాద్ బిల్డర్ ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన కంపెనీపై పనిచేసే ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో నిర్మాణ సంస్థ మర్సాస్ అగ్రోవెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి. రాజ్ జార్జిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆఫీసులో అందరూ వెళ్లిపోయిన తర్వాత జ్యూస్ లో మత్తుమందు కలిపి అతడీ దారుణానికి ఒడిగట్టినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అక్కడితో ఆగకుండా పెళ్లిచేసుకుంటానని చెప్పి పలుమూర్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజ్ జార్జిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఎదుట హాజరుపరిచిన తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement