కారు లోయలో పడి నలుగురు మృతి | Four killed as car falls into gorge | Sakshi
Sakshi News home page

కారు లోయలో పడి నలుగురు మృతి

Mar 1 2014 2:57 PM | Updated on Aug 14 2018 3:25 PM

ఉత్తరాఖండ్ తేహ్రీ జిల్లాలో కారు లోయలో పడి నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు శనివారం వెల్లడించారు.

ఉత్తరాఖండ్ తేహ్రీ జిల్లాలో కారు లోయలో పడి నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు శనివారం వెల్లడించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రుడు చంబ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. గత అర్థరాత్రి చంబ - ముస్సోరి రహదారిపై వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి చౌపారియల్ గ్రామ సమీపంలోని లోయలో పడిందని తెలిపారు. ఆ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement