ఫోర్డ్ కార్ల ధరలు 5 శాతం పెరిగాయ్ | Fordcar hikes prices by up to 5% | Sakshi
Sakshi News home page

ఫోర్డ్ కార్ల ధరలు 5 శాతం పెరిగాయ్

Sep 6 2013 2:52 AM | Updated on Oct 4 2018 4:56 PM

ఫోర్డ్ ఇండియా కార్ల ధరలను పెంచింది. అన్ని మోడళ్ల కార్ల ధరలను 1-5 శాతం వరకూ పెంచుతున్నామని కంపెనీ గురువారం తెలిపింది.

న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా కార్ల ధరలను పెంచింది. అన్ని మోడళ్ల కార్ల ధరలను 1-5 శాతం వరకూ పెంచుతున్నామని కంపెనీ గురువారం తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండటంతో ధరలు పెంచక తప్పలేదని, ఈ పెరుగుదల తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఏ మోడల్‌పై ఎంత ధర పెంచుతున్నదీ కంపెనీ వివరంగా వెల్లడించలేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధికంగా ఉన్న ఇంధనం ధరలు, పడిపోతున్న రూపాయి తదితర అంశాల కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయని ఫోర్డ్ ఇండియా ఈడీ(మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపర్సానియా వివరించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement