కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ | Encounter In Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

Sep 12 2015 4:06 AM | Updated on Apr 4 2019 4:44 PM

ఉత్తర కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లతోపాటు ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతిచెందారు...

- ఇద్దరు మిలిటెంట్లు, ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూ:
ఉత్తర కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లతోపాటు ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతిచెందారు. కుప్వారా జిలా లారిబల్ గ్రామంలో గురువారం రాత్రినుంచే ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయని, అవి ఇంకా కొనసాగుతున్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ కాల్పుల సందర్భంగా ఇద్దరు గుర్తుతెలియని మిలిటెంట్లు హతమయ్యారని, ఇద్దరు జవాన్లు కూడా మృతిచెందారని అధికారులు తెలిపారు.
 
మరోసారి పాక్ కాల్పులు
భారత్, పాకిస్తాన్ సైన్యాధికారులమధ్య ఓ వైపు చర్చల ప్రక్రియ నడుస్తుండగానే పాక్ దళాలు కశ్మీర్ సరిహద్దుల్లో మరోసారి కాల్పులకు పాల్పడ్డాయి. రాజౌరీ జిల్లాలోని హమీర్‌పూర్ సెక్టార్‌లో అధీనరేఖవెంట పాక్ దళాలు శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపాయని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement